మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లి వాస్తవ్యులైన శ్రీ ఎం.వెంకూ రెడ్డి కి జన్మించారు. వరంగల్‌లోని ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఆయన బీ.ఈ. పట్టా పొందారు. శ్రీమతి మణిమంజరితో ఆయన వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు.
ఇంజినీర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి దిగిన రెడ్డి 16 వ లోక్‌సభలో సభ్యుడిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు లోక్‌సభా నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.
1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే అదే పార్టీ తరపున పోటీ చేసి 1985 శాసనసభ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 1989 లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభ సభ్యుడయ్యారు. అయితే 1996 మరియు 1998 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ 2004 లో నర్సారావుపేట, 2009 లో నెల్లూరు లోక్‌సభా స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, లోక్‌సభ ఉప ఎన్నికల్లో నెగ్గి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లోక్‌సభలో ఆయన వెఎస్సార్ పక్ష నేతగా వ్యవహరించారు. రెడ్డి ఒకసారి ఎమ్మేల్యేగా ఐదు సార్లు ఎంపీగా(1989, 2004, 2009, 2012 ఉప ఎన్నిక మరియు 2014 లో) సేవలందించారు.
| పూర్తి పేరు | శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి |
| పుట్టిన తేదీ | 11 Jun 1944 (వయస్సు 82) |
| పుట్టిన ప్రాంతం | బ్రాహ్మణపల్లి, జిల్లా. నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ |
| పార్టీ పేరు | Indian National Congress |
| విద్య | Graduate Professional |
| వృత్తి | ఇంజినీర్ |
| తండ్రి పేరు | శ్రీ ఎం. వెంకూ రెడ్డి |
| తల్లి పేరు | NA |
| జీవిత భాగస్వామి పేరు | శ్రీమతి మణిమంజరీ |
| సంతానం | 3 కుమారులు |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.