• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
ఓ ప‌న్నీర్ సెల్వం

ఓ ప‌న్నీర్ సెల్వం

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ఓ.పీ.ఎస్ గా ప్ర‌సిద్ధి చెందిన ఓ.ప‌న్నీర్ సెల్వం ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఆగ‌స్టు 21, 2017 నుంచి ఆల్ ఇండియా అన్నా ద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం(ఏఐడీఎంకే) స‌మ‌న్వ‌య‌కుడిగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లితను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అన‌ర్హురాలిగా కోర్టు రెండుసార్లు నిర్థారించ‌డంతో ప‌న్నీర్‌సెల్వం త‌మిళ‌నాడు 7 వ ముఖ్య‌మంత్రిగా(వ్య‌క్తుల ప‌రంగా) సేవ‌లందించారు. జ‌య‌ల‌లిత‌కు బ‌దులుగా సీఏం పీఠాన్ని ఆయ‌న రెండుసార్లు అధిరోహించారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం ముచ్చ‌ట‌గా మూడోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. 2 నెల‌లు గ‌డిచిన త‌ర్వాత ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఓ ప‌న్నీర్ సెల్వం
పుట్టిన తేదీ 14 Jan 1951 (వ‌య‌స్సు  70)
పుట్టిన ప్రాంతం పెరియ‌కులం, తేని
పార్టీ పేరు All India Anna Dravida Munnetra Kazhagam
విద్య 12th Pass
వృత్తి వ్య‌వ‌సాయం
తండ్రి పేరు ఒట్టాక్కార థేవ‌ర్
తల్లి పేరు ప‌ళ‌నియ‌మ్మాళ్ నాచ్చియార్
జీవిత భాగస్వామి పేరు పీ. విజ‌య‌ల‌క్ష్మి
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 2 కుమారులు 1 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా 145/70, ద‌క్షిణ అగ్ర‌గారం, తేన్క‌రీ, పెరియ‌కులం, తేని- 625601
ప్రస్తుత చిరునామా 145/70, ద‌క్షిణ అగ్ర‌గారం, తేన్క‌రీ, పెరియ‌కులం, తేని- 625601
కాంటాక్ట్ నెంబర్ 04546284567
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

1. రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో ఆయ‌న ఒక్క‌సారి కూడా ఓడిపోక‌పోవ‌డం విశేషం.
2. శ‌శిక‌ళ‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న చేప‌ట్టిన "ధ‌ర్మాయుధం" గురించి త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల్లో సానుకూలంగా మ‌రియు వ్య‌తిరేకంగానూ పెద్ద చ‌ర్చే జ‌రిగింది.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 1969
    ప‌న్నీర్‌సెల్వం 18 ఏళ్ల వ‌య‌సులో 1969 లో ఉమ్మ‌డి డీఎంకే పార్టీలో కార్య‌క‌ర్త‌గా చేర‌డం ద్వారా త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు.

గ‌త చ‌రిత్ర

  • 2017
    ఆగ‌స్టు 21, 2017 నాడు ప‌న్నీర్‌సెల్వం మ‌రియు ఆయ‌న బృందం ఏఐడీఎంకే పార్టీని చేజిక్కించుకోవ‌డంతో ఆయ‌న త‌మిళ‌నాడు ఉప‌ముఖ్య‌మంత్రి అయ్యారు.
  • 2016
    బోడినాయ‌క‌నూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌న్నీర్‌సెల్వం మ‌రోసారి ఎన్నిక‌య్యారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ‌నాడు రాష్ట్రానికి ఆయ‌న మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు.
  • 2015
    జైలు నుంచి జ‌య‌ల‌లిత విడుద‌లైన త‌ర్వాత ఆమె మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కాగా, ప‌న్నీర్‌సెల్వం ప్ర‌జా ప‌నుల శాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు.
  • 2014
    అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లిత రెండోసారి అభిశంస‌న‌కు గురికావ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అయ్యారు.
  • 2011
    బోడినాయ‌క‌నూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలిచారు. 2011 లో త‌మిళ‌నాడు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక‌మంత్రి అయ్యారు.
  • 2006
    2006 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏఐడీఎంకే ఓడిపోవ‌డంతో శాస‌న‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేతగా వ్య‌వ‌హ‌రించారు.
  • 2006
    పెరియ‌కులం నుంచి ప‌న్నీర్‌సెల్వం మ‌రోసారి గెలిచారు. త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఏఐడీఎంకే ఓట‌మి త‌ర్వాత అసెంబ్లీలో ఆయ‌న‌ ప్ర‌తిప‌క్ష నాయకుడిగా వ్య‌వ‌హ‌రించారు.
  • 2001
    పెరియ‌కులం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌న్నీర్‌సెల్వం అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లితను సుప్రీం కోర్టు అభిశంసించ‌డంతో సెప్టెంబ‌రు 2001 లో ఆయ‌న త‌మిళ‌నాడు రాష్ట్రానికి 13 వ ముఖ్య‌మంత్రి అయ్యారు.
  • 1996
    1996 నుంచి 2001 వ‌ర‌కు పెరియ‌కులం మున్సిపాలిటీ ఛైర్మ‌న్‌గా ప‌ని చేశారు.
  • 1973
    డీఎంకే నుంచి విడిపోయి ఎమ్‌జీఆర్ ఏఐడీఎంకేను ఏర్పాటు చేసిన త‌ర్వాత ప‌న్నీర్‌సెల్వం అందులో చేరారు.
నికర ఆస్తులు5.09 CRORE
ఆస్తులు 7.82 CRORE
బాధ్యతలు2.74 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X