ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్
ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్, అస‌లు పేరు ప్ర‌కాష్ సింగ్ ధిల్లాన్. ప్ర‌కాష్ సింగ్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు మ‌రియు ప్ర‌భుత్వ అధికారిగా ఉన్న ఆయ‌న పంజాబ్‌లోని సిక్కుల నేప‌థ్యం గ‌ల స్థానిక‌ రాజ‌కీయ పార్టీ శిరోమ‌ణి అకాలీద‌ళ్‌కు 1996 నుంచి 2008 వ‌ర‌కు అధ్య‌క్షుడిగా ఉన్నారు.
By Moumi Majumdar | Tuesday, February 19, 2019, 12:59:48 PM [IST]

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్, అస‌లు పేరు ప్ర‌కాష్ సింగ్ ధిల్లాన్. ప్ర‌కాష్ సింగ్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు మ‌రియు ప్ర‌భుత్వ అధికారిగా ఉన్న ఆయ‌న పంజాబ్‌లోని సిక్కుల నేప‌థ్యం గ‌ల స్థానిక‌ రాజ‌కీయ పార్టీ శిరోమ‌ణి అకాలీద‌ళ్‌కు 1996 నుంచి 2008 వ‌ర‌కు అధ్య‌క్షుడిగా ఉన్నారు. ప‌శ్చిమ పంజాబ్‌లో సంప‌న్న రైతు కుటుంబంలో బాద‌ల్ పుట్టారు. ప్ర‌స్తుతం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గ‌ల‌ ఫోర్మ‌న్ క్రిస్గియ‌న్ క‌ళాశాల నుంచి ఆయ‌న బీ.ఏ. ప‌ట్టా పొందారు. అకాలీ ద‌ళ్ పార్టీకి ఆర్థికంగానూ, ఇత‌ర విష‌యాల‌లోనూ పెద్ద మ‌ద్ధ‌తుదారుడిగా ఉన్నారు. 1995 నుంచి 2008 వ‌ర‌కు ఆయ‌న పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. అనంత‌రం ఆయ‌న కొడుకు సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టారు.

మరిన్ని చదవండి

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్
పుట్టిన తేదీ 08 Dec 1927
మరణం యొక్క తేదీ 25 Apr 2023 (వ‌య‌స్సు  95)
పుట్టిన ప్రాంతం అబుల్ ఖురానా, మాలౌట్
పార్టీ పేరు Shiromani Akali Dal
విద్య Graduate
వృత్తి రాజ‌కీయ నాయ‌కుడు/వ‌్య‌వ‌సాయం
తండ్రి పేరు ఎస్‌. ర‌ఘురాజ్ సింగ్
తల్లి పేరు సుంద్రీ కౌర్
జీవిత భాగస్వామి పేరు సురీంద‌ర్ కౌర్‌
జీవిత భాగస్వామి వృత్తి మ‌ర‌ణించారు
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
మతం సిక్కు

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹12.37 CRORE
ఆస్తులు
₹15.12 CRORE
బాధ్యతలు
₹2.75 CRORE

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ 1947 లో తొలిసారిగా ఆయ‌న రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ ఏడాది ఆయ‌న గ్రామ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌య్యారు.

1957 లో తొలిసారిగా పంజాబ్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ ఎన్నిక‌య్యారు. అప్ప‌టినుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఆయ‌న తొమ్మిదిసార్లు ఎమ్మేల్యేగా ఎన్నిక‌య్యారు.


ఉచిత అంబులెన్సు సేవ‌లు, త‌ల్వాండి సాబో థ‌ర్మ‌ల్ ప్లాంట్ వంటి ఎన్నో ప‌థ‌కాల‌ను బాద‌ల్ ప్రారంభించారు.

శిరోమ‌ణి అకాలీద‌ళ్ పోష‌కుడిగా శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ ఏర్పాటులో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు.

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ రాజకీయ జీవితం

  • 2012: కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌హేష్ఇంద‌ర్ సింగ్‌ను బాద‌ల్ మ‌ళ్లీ ఓడించారు. ఈ సారి ఆయ‌న 24,739 ఓట్ల తేడాతో గెలిచారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని మ‌రోసారి అధిష్టించారు.
  • 2007: లంబీ సీటు నుంచి బాద‌ల్ తిరిగి ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్ కి చెందిన మ‌హేష్ ఇంద‌ర్ సింగ్ ను ఆయ‌న ఓడించారు. పంజాబ్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని బాద‌ల్ నిల‌బెట్టుకున్నారు.
  • 2007: ఎమ్మేల్యేగా మ‌రోమారు ఎన్నికై నాలుగోసారి పంజాబ్ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దాదాపు 10 రకాల మంత్రిత్వ శాఖల బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. వాటిలో హోం, గృహ‌నిర్మాణం మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి, ఎక్సైజ్ & ప‌న్నులు, న్యాయ మ‌రియు శాస‌న‌స‌భ వ్య‌వ‌హ‌రాలు మ‌రియు ప్ర‌వాస భార‌తీయ వ్య‌వ‌హ‌రాల శాఖ‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
  • 2002: స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన మ‌హేశింద‌ర్ సింగ్‌ను 23,929 ఓట్ల తేడాతో ప్ర‌కాష్ సింగ్ బాదల్ ఓడించారు. ముఖ్య‌మంత్రిగా బాద‌ల్ కొన‌సాగారు.
  • 1997: లంబీ నుంచి మ‌రోసారి ఎన్నికై పంజాబ్ ముఖ్య‌మంత్రిగా మ‌రోమారు బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
  • 1977: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి, పంజాబ్‌కి మ‌రోమారు ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యారు.
  • 1970: పంజాబ్ రాష్ట్రానికి తొలిసారి ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. భార‌త‌దేశంలో అత్యంత పిన్న వ‌య‌స్సు గ‌ల ముఖ్య‌మంత్రిగా ఆయ‌న చ‌రిత్ర సృష్టించారు. అకాలీ ద‌ళ్(సంత్) మ‌రియు జ‌న సంఘ్‌ల సంకీర్ణ ప్ర‌భుత్వానికి ముఖ్య‌మంత్రిగా ఆయ‌న నాయ‌క‌త్వం వ‌హించారు.
  • 1969: అసెంబ్లీకి మ‌రోమారు ఎన్నికై పంజాబ్ ముఖ్య‌మంత్రి అయ్యారు.
  • 1957: 1957 లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పంజాబ్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ ఎన్నిక‌య్యారు. పంజాబ్ అసెంబ్లీలో ఆయ‌న అడుగు పెట్ట‌డం ఇదే తొలిసారి.
  • 1947: బాద‌ల్ గ్రామ స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యారు. అనంత‌రం లంబీ బ్లాక్ స‌మితి ఛైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యారు.

ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ సాధించిన విజయాలు

పంజాబ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా 1970-71, 1977-80, 1997-2002 ఏళ్ల మ‌ధ్య‌ మ‌రియు 2007 నుంచి 2017 వ‌ర‌కు ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ సేవ‌లందించారు.
డిసెంబ‌రు 2011 లో అకాల్ త‌ఖ్త్ ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్‌ను పంత్ ర‌త్త‌న్ ఫ‌క‌ర్‌-ఇ-ఖ్వామ్‌(మతంలో వజ్రం, స‌మాజానికి గ‌ర్వ‌కార‌ణం) పేరిట పుర‌స్కారాన్ని అందించి స‌త్క‌రించింది.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+