హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
ప్రియాంక్ ఖ‌ర్గే

ప్రియాంక్ ఖ‌ర్గే

ప్రియాంక్ ఖ‌ర్గే

ప్రియాంక్ ఖ‌ర్గే, ప్ర‌ముఖ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడైన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే కుమారుడు. ఆయ‌న గుల్బ‌ర్గాలో జన్మించారు మ‌రియు గ్రాఫిక్ డిజైన్ & యానిమేష‌న్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా పొందారు.

ప్రియాంక్ ఖ‌ర్గే బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ప్రియాంక్ ఖ‌ర్గే, ప్ర‌ముఖ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడైన మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే కుమారుడు. ఆయ‌న గుల్బ‌ర్గాలో జన్మించారు మ‌రియు గ్రాఫిక్ డిజైన్ & యానిమేష‌న్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా పొందారు. యువ‌జ‌న కాంగ్రెస్ విభాగ‌మైన ఎన్ఎస్‌యూఐలో క్రియాశీల‌క స‌భ్యుడిగా మార‌టంతో ఆయ‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇది ఆయ‌న భావి రాజ‌కీయ జీవితానికి నాంది ప‌లికింది. విద్యార్థి నాయ‌కుడిగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన త‌ర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంత‌రం త‌క్కువ స‌మ‌యంలోనే కర్ణాట‌క యువజ‌న‌ పీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యారు.

2008 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్తాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ద్వారా ఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో అతి త‌క్కువ తేడాతో ఆయ‌న ఓడిపోయారు. తిరిగి 2013 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆయ‌న సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వంలో స‌మాచార సాంకేతిక మ‌రియు బ‌యోటెక్నాల‌జీ మంత్రి అయ్యారు. 2018 ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత హెచ్‌.డీ. కుమారస్వామి ప్ర‌భుత్వంలో సాంఘిక మ‌రియు వెనుకబ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ మంత్రిగా అయ్యారు.

మరిన్ని చదవండి
By Srinivas G Updated: Monday, December 31, 2018, 03:36:12 PM [IST]

ప్రియాంక్ ఖ‌ర్గే వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ప్రియాంక్ ఖ‌ర్గే
పుట్టిన తేదీ 22 Nov 1978 (వ‌య‌స్సు  45)
పుట్టిన ప్రాంతం గుల్బ‌ర్గా, క‌ర్ణాట‌క
పార్టీ పేరు Indian National Congress
విద్య 12th Pass
వృత్తి వ్యాపార‌వేత్త మ‌రియు క‌న్స‌ల్టెంట్
తండ్రి పేరు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే
తల్లి పేరు రాధాభాయి ఖ‌ర్గే
జీవిత భాగస్వామి పేరు శ్రుతి ఖ‌ర్గే
జీవిత భాగస్వామి వృత్తి వ్యాపారం
మతం హిందూ
శాశ్వత చిరునామా ఆర్‌/ఓ గుండ‌గుర్తి గ్రామం, చిత్తాపూర్ తాలుక్‌, క‌ల‌బుర్గి జిల్లా-585317
ప్రస్తుత చిరునామా ఆర్‌/ఓ గుండ‌గుర్తి గ్రామం, చిత్తాపూర్ తాలుక్‌, క‌ల‌బుర్గి జిల్లా-585317
కాంటాక్ట్ నెంబర్ 9845067711
ఈ-మెయిల్ [email protected]
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

ప్రియాంక్ ఖ‌ర్గే నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹16.54 CRORE
ఆస్తులు :₹16.83 CRORE
బాధ్యతలు: ₹28.75 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

ప్రియాంక్ ఖ‌ర్గే సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

2016 లో మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన‌ప్పుడు, మంత్రి వ‌ర్గం లో అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా ఖ‌ర్గే గుర్తింపు పొందారు.
ఆయ‌న గ్రాఫిక్ డిజైన్ & యానిమేష‌న్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా పొందారు.
పుస్త‌క ప‌ఠ‌నం అంటే, అందులోనూ డిజైన్‌కి సంబంధించిన కాల్పనిక పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అంటే ఆయ‌నకు ఎంతో ఇష్టం.

ప్రియాంక్ ఖ‌ర్గే రాజకీయ జీవితం

2018
  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా మ‌రోసారి చిత్తాపూర్ నుంచి పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థిపై 4393 ఓట్ల తేడాతో గెలిచారు. హెచ్‌.డీ. కుమార‌స్వామి ప్ర‌భుత్వంలో ఆయ‌న సాంఘిక మ‌రియు వెనుకబ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ మంత్రి అయ్యారు.
2016
  • హైద‌రాబాద్ కర్ణాట‌క ప్రాంతంలోని తన నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారిగా ఎమ్ఎల్ఏ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
2016
  • డాక్ట‌ర్ బీ.ఆర్‌. అంబేద్క‌ర్ 125 వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న జ్ఞాప‌కార్థం లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ భాగ‌స్వామ్యంతో బెంగ‌ళూరులో ఒక ఎకాన‌మిక్స్ స్కూల్‌ను ఏర్పాటు చేయాల‌ని ఖ‌ర్గే ప్ర‌తిపాదించారు.
2016
  • క‌ర్ణాట‌క ప్ర‌భుత్వపు ప్ర‌వాస భార‌తీయ విధానం(ఎన్ఆర్ఐ) మ‌రియు పారిశ్రామిక విధాన రూప‌క‌ల్ప‌న‌లో భాగ‌స్వాముల‌య్యారు.
2016
  • లండ‌న్‌లో జ‌రిగిన ప్ర‌పంచ విద్యా వేదిక మ‌రియు బ్రిటీష్ కౌన్సిల్ డెలిగేష‌న్‌కు హాజ‌ర‌య్యారు.
2016
  • సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వంలో స‌మాచార సాంకేతిక మ‌రియు బ‌యోటెక్నాల‌జీ మంత్రిగా నియమితుల‌య్యారు.
2014
  • కామ‌న్‌వెల్త్ పార్ల‌మెంట‌రీ అసోసియేష‌న్ డెలిగేష‌న్‌, లండ‌న్‌లో చేరారు.
2013
  • చిత్తాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థి వాల్మీకి నాయ‌క్ పై 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2011
  • అనంత‌రం ఆయ‌న క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ యువ‌జ‌న కాంగ్రెస్ క‌మిటీ ఉపాధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు. 2013 వ‌ర‌కు ఈ ప‌ద‌విలో సేవ‌లందించారు.
2008
  • శాస‌న‌స‌భ‌ ఎన్నిక‌ల్లో భార‌తీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున చిత్తాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన‌ప్ప‌టికీ, బీజేపీ అభ్య‌ర్థి చేతిలో 1600 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2007
  • క‌ర్ణాట‌క యువ‌జ‌న ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి పొందారు. ఈ ప‌ద‌విలో 2011 వ‌ర‌కు కొన‌సాగారు.
2005
  • క‌ర్ణాట‌క యువ‌జ‌న ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు.
2001
  • 2005 వ‌ర‌కు ఎన్ఎస్‌యూఐ క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సేవ‌లందించారు.
2000
  • 2001 వ‌ర‌కు నేష‌న‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) కాలేజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు.
1999
  • ప్రియాంక్ ఖ‌ర్గే భార‌తీయ జాతీయ కాంగ్రెస్‌లో ప్రాథ‌మిక స‌భ్య‌త్వం పొందారు.

గ‌త చ‌రిత్ర

1996 - 2001
  • ఎన్‌సీసీ క్యాడెట్(ఏయిర్ వింగ్‌)గా 5 ఏళ్ల‌కు పైగా సేవ‌లందించారు. 2 ఏళ్ల‌పాటు ఉత్త‌మ క్యాడెట్‌గా ఎంపిక‌య్యారు. గోవా&క‌ర్ణాట‌క‌ల్లో జాతీయ స‌మీకృత శిబిరాల‌కు హాజ‌ర‌య్యారు. ఒడిశాలోని రూర్కెలాలో ఏర్పాటు చేసిన ప్రీ రిప‌బ్లిక్ డే సెల‌క్ష‌న్ క్యాంపుకు ఎంపికయ్యారు. క‌ర్ణాట‌క‌లో 3 ప్రాథ‌మిక శిబిరాల‌కు హాజ‌ర‌య్యారు. కర్ణాట‌క రాష్ట్రంలో ఇంజిన్ గ్లైడ‌ర్లుగా ఎంపిక చేసిన 5 గురిలో ఖ‌ర్గే ఒక‌రు.

ప్రియాంక్ ఖ‌ర్గే సాధించిన విజయాలు

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో ఏవియేష‌న్/ ఏరోస్పేస్ విభాగంలో మొద‌టిసారిగా సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్మిక మంత్రిత్వ శాఖ త‌ర‌పున యువత‌కు కాన్సెప్ట్ ఆధారిత ఉద్యోగ నైపుణ్య శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు.

చిత్తాపూర్‌లో 12,500 ఎక‌రాల్లో జాతీయ పెట్టుబ‌డులు త‌యారీ మండ‌లి(నిమ్జ్‌), ఇండ‌స్ట్రియ‌ల్ టౌన్‌షిప్ ఏర్పాట‌య్యేలా కృషి చేశారు.

తుమ‌కూరులోని అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఇ-ఐసీడీఎస్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

హైద‌రాబాద్ క‌ర్ణాట‌క ప్రాంతంలోని ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నార్థం ఆర్టిక‌ల్ 371(జే) ను స‌వ‌రించేలా ప్రియాంక్ ఖ‌ర్గే కీల‌క పాత్ర‌ పోషించారు.

ఇన్వెస్ట్ క‌ర్ణాట‌క పేరిట జ‌రిగిన ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సు కోసం దేశవ్యాప్తంగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు వివిధ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు.
సుల‌భ‌త‌ర వాణిజ్యంలో క‌ర్ణాట‌క రాణించడంలో ప్రియాంక్ ఖ‌ర్గే కీల‌క పాత్ర పోషించారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X