నటన నుంచి రాజకీయాల్లోకి మారిన బబ్బర్ తొలుత తన రాజకీయ ప్రస్థానాన్ని 1989 లో వీ. పీ.
నటన నుంచి రాజకీయాల్లోకి మారిన బబ్బర్ తొలుత తన రాజకీయ ప్రస్థానాన్ని 1989 లో వీ.పీ.సింగ్ నాయకత్వంలోని జనతాదళ్‌లో చేరడం ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. దీంతోపాటు 1994 నుంచి 1999 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. 2004 లో మరోసారి ఎంపీగా నెగ్గి, 14 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 2006 లో సమాజ్‌వాదీ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో 2008 లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎస్పీ అధినేత ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ భార్య, డింపుల్ యాదవ్‌ను ఓడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘాజియాబాద్ నుంచి బరిలోకి దిగిన, బీజేపీ అభ్యర్థి మాజీ జనరల్ వీ.కే. సింగ్ చేతిలో ఓడిపోయారు. గత రెండు దశాబ్ధాలుగా యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చుంటున్న కాంగ్రెస్‌కు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఉత్తర్ ప్రదేశ్ కంచుకోట.
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.