• search
 • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
రజినీ కాంత్

రజినీ కాంత్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

సూపర్ స్టార్ రజినీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించారు. ప్రస్తుతం ఇది కర్నాటక రాజధానిగా ఉంది. రజినీ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఐదేళ్ల వయసులోనే రజినీకాంత్ తల్లి మరణించారు. బెంగళూరులోని ఆచార్య పాఠశాలలో ప్రాథమిక విద్యను ఆపై రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలోని వివేకానంద బాలక్ సంఘ్‌లో చదివారు. రజినీ మాతృభాష మరాఠి. మాతృభాష మరాఠీలో రజినీకాంత్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక సూపర్ స్టార్‌ అయ్యే క్రమంలో రజినీకాంత్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సినీ పరిశ్రమలోకి రాకముందు రజినీకాంత్ కర్నాటక రాష్ట్ర రవాణా శాఖలో కండక్టర్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే చాలా వేదికలపై నటిస్తూ క్రమంగా తనలోని నటనా ప్రావీణ్యంపై మరింత దృష్టిసారించారు.

బాలీవుడ్‌కు రజినీ పేరు పరిచయం అక్కర్లేదు. ఇక దక్షిణాదిన రజినీకి ఉన్న క్రేజే వేరు. దక్షిణాదిలో రజినీ కాంత్‌ను ఒక దేవుడిలా కొలుస్తారు ఇక్కడి అభిమానులు. అందుకే అతన్ని రజినీ సర్ అని పిలిచి గౌరవించుకుంటారు. దక్షిణాదిన రజినీకాంత్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, కలైమామణి అవార్డులు చెవలియర్ శివాజీ గణేశన్ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లాంటి పౌర పురస్కారాలు రజినీని వరించాయి.

తమిళనాడు రాజకీయాల్లో రజినీకాంత్ ప్రభావం చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించిన రజినీ కాంత్, సొంతంగా గెలవగలిగే సత్తా కూడా ఉంది. గతంలో రజినీ రాజకీయ పార్టీ పెడతారంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ... అవి కార్య రూపం దాల్చలేదు. తాజాగా రజినీ కాంత్ స్వయంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు రజినీ కాంత్
పుట్టిన తేదీ 12 Dec 1950 (వ‌య‌స్సు  70)
పుట్టిన ప్రాంతం బెంగళూరు
పార్టీ పేరు Independent
విద్య Diploma in acting from Madras Film Institute
వృత్తి నటుడు
తండ్రి పేరు రామోజీ రావు గైక్వాడ్
తల్లి పేరు జిజాబాయ్
జీవిత భాగస్వామి పేరు లతా రజినీకాంత్
జీవిత భాగస్వామి వృత్తి N/A
సంతానం 2 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా 18, రాఘవ వీర అవెన్యూ, పోయెస్ గార్డెన్, చెన్నై,తమిళనాడు,ఇండియా
కాంటాక్ట్ నెంబర్ +91 88702-02833
ఈ-మెయిల్ not available
వెబ్‌సైట్ http://rajinikanth.com/
సామాజిక నిర్వహణ

ఆసక్తికర అంశాలు

సిని ఇండస్ట్రీలోకి రాకముందు బస్ కండక్టర్‌గా బెంగళూరులో రజినీకాంత్ పనిచేశారు

రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా రజినీకాంత్ గురించి ఉంది. బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు అనే పేరుతో పాఠం ఉంది
2000-2010 మధ్య రూ.26 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుని ఆసియా ఖండంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో రెండో స్థానంలో నిలిచారు. తొలిస్థానంలో జాకీ చాన్ నిలిచారు.

అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా రజినీకాంత్ గుర్తింపు పొందారు

రజినీకాంత్ బాబాకు మంచి భక్తుడు. ఆధ్మాత్మికతను బలంగా నమ్మే వ్యక్తి రజినీ

తమిళ హీరో ధనుష్‌తో రజినీ కాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం జరిగింది.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

 • 2020
  తాను రాజకీయాల్లోకి రాబోతోన్నట్లు రజినీకాంత్ డిసెంబర్ 3వ తేదీన వెల్లడించారు. దీనిపై 2020 డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు.
 • 2020
  డిసెంబర్ 29వ తేదీన ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. తాను రాజకీయాల్లో రావట్లేదని ప్రకటించారు. అభిమానులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ అభిమానులను ఉద్దేశించి మూడు పేజీల లేఖ రాశారు.
 • 2017
  2021 నాటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే తాను రాజకీయాల్లో రాబోతోన్నట్లు రజినీకాంత్ డిసెంబర్ 31వ తేదీన ఓ ప్రకటన చేశారు.
 • 2004
  వ్యక్తిగతంగా తాను భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్లు రజినీకాంత్ వెల్లడించారు. అంతేగానీ తాను ఏ పార్టీకి గానీ, ఏ కూటమికి గానీ మద్దతు ఇవ్వట్లేదని అన్నారు.
 • 1996
  రజినీకాంత్ సంచలన ప్రకటన చేశారు. జే జయలలిత అధికారంలోకి వస్తే ఆ భగవంతుడు కూడా తమిళనాడును కాపాడలేడని చెప్పారు. అదే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోని ఏఐఎడీఎంకే ఓడిపోయింది. డీఎంకే అధికారంలోకి వచ్చింది.

గ‌త చ‌రిత్ర

 • 1975
  రజినీకాంత్ తొలిసారిగా వెండితెరపై అడుగు పెట్టారు. కమల్ హాసన్, శ్రీవిద్యతో కలిసి తమిళ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి బాలచందర్ దర్శకత్వం వహించారు. అదే ఏడాది కథా సంగమ అనే కన్నడ సినిమాలో చిన్న పాత్రను పోషించారు.
 • 1950
  డిసెంబర్ 12వ తేదీన బెంగళూరులో స్థిరపడిన ఓ మరాఠీ కుటుంబంలో రజినీకాంత్ జన్మించారు. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి చిన్నతనంలో ఆయన చాలా కష్టపడ్డారు. కూలీగా, బస్ కండక్టర్‌గా పని చేశారు.
నికర ఆస్తులు376 CRORE
ఆస్తులు 376 CRORE
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X