హోం
 » 
రాజీవ్ ప్ర‌తాప్ రూడీ

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఆయ‌న లాలు ప్ర‌సాద్ యాద‌వ్ భార్య ర‌బ్రీ దేవిని ఓడించి స‌ర‌న్ నియోజ‌క‌వ‌ర్గ ఎంపీగా గెలిచారు.

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఆయ‌న లాలు ప్ర‌సాద్ యాద‌వ్ భార్య ర‌బ్రీ దేవిని ఓడించి స‌ర‌న్ నియోజ‌క‌వ‌ర్గ ఎంపీగా గెలిచారు. అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ నాయ‌కత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఆయ‌న వాణిజ్య, ప‌రిశ్ర‌మల శాఖ స‌హాయ మంత్రిగానూ, న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంలో నైపుణ్యాభివృద్ధి, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిగా ప‌ని చేశారు. 2017 లో మంత్రి వర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ఆయ‌న త‌న‌ ప‌ద‌విని కోల్పోయారు. స‌ర‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు సార్లు లోక్‌స‌భ స‌భ్యుడిగా గెలుపొందారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా 2018 డిసెంబ‌రులో రూడీని పార్టీ అధికార ప్ర‌తినిధిగా నియ‌మించారు.

మరిన్ని చదవండి
By Anushree Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు రాజీవ్ ప్ర‌తాప్ రూడీ
పుట్టిన తేదీ 30 Mar 1962 (వ‌య‌స్సు  62)
పుట్టిన ప్రాంతం ప‌ట్నా, బీహ‌ర్
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Post Graduate
వృత్తి సామాజిక కార్య‌క‌ర్త‌, విద్యావేత్త‌, న్యాయ‌వాది, క‌మ‌ర్షియ‌ల్ పైలెట్
తండ్రి పేరు వీ.ఎన్‌. సింగ్
తల్లి పేరు ప్ర‌భా సింగ్

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹6.15 CRORE
ఆస్తులు :₹6.25 CRORE
బాధ్యతలు: ₹10.09 LAKHS

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ప్ర‌ముఖ విద్యావేత్త అయిన రూడీ, ప‌ట్నాలోని మ‌గ‌ధ్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోని ఏ.ఎన్‌. కాలేజీలో ఆర్థ శాస్త్ర ఆచార్యులుగా ప‌ని చేశారు. ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌భ్యుల‌లో వాణిజ్య విమాన పైలెట్ లైసెన్స్ క‌లిగిన ఏకైక వ్యక్తి రూడీనే కావ‌డం విశేషం.

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ రాజకీయ జీవితం

2018
  • బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పార్టీ అధికార ప్ర‌తినిధిగా రూడీని నియ‌మించారు.
2017
  • మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌విని కోల్పోయారు.
2014
  • స‌ర‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లాలు ప్ర‌సాద్ స‌తీమ‌ణి ర‌బ్రీ దేవిపై 40,948 ఓట్ల తేడాతో నెగ్గి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంలో ఆయ‌న కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌హాయ మంత్రి(స్వ‌తంత్ర హోదా) గా నియ‌మితుల‌య్యారు.
2008
  • రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
2001
  • కేంద్ర వాణిజ్య, ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రిగా ఎన్నిక‌య్యారు.
1999
  • ఛాప్రా నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఆయ‌న ఎన్నిక‌య్యారు. రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్‌కు చెందిన హిరా లాల్ రాయ్‌పై 49,553 ఓట్ల తేడాతో గెలుపొందారు.
1996
  • బీజేపీ అభ్య‌ర్థిగా ఛాప్రా నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి రూడీ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ లాల్ బాబు రాయ్‌పై 1,66,363 ఓట్ల తేడాతో నెగ్గారు.
1990
  • 1990 బీహ‌ర్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌తాదళ్ పార్టీ అభ్య‌ర్థిగా త‌రయ్యా సీటు నుంచి రూడీ గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి చెందిన రామ్ దాస్ రాయ్‌పై 8753 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

గ‌త చ‌రిత్ర

1988
  • ప‌ట్నాలోని ఏ.ఎన్ కాలేజీలో ఆయ‌న అర్థ శాస్త్ర ఆచార్యులుగా ప‌ని చేశారు.

రాజీవ్ ప్ర‌తాప్ రూడీ సాధించిన విజయాలు

1990 లో అత్యంత చిన్న వ‌య‌సులోనే బీహ‌ర్ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికయ్యారు. 2003 నుంచి 2004 మ‌ధ్య పౌర విమాన‌యాన్ మంత్రిగా పని చేసిన కాలంలో చెప్పుకోద‌గిన సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టి ఆ రంగంలో త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న చేప‌ట్టిన ప‌లు సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితాల‌ను ఇప్పుడు మ‌నం చూడ‌వ‌చ్చు. దేశ విమానాశ్ర‌యాల ఆధునికీక‌ర‌ణ‌, చౌక విమాన సంస్థ‌ల‌ను ప్రోత్స‌హించ‌డం, విమాన ఇంధ‌నంపై ప‌న్నుల‌ను త‌గ్గించ‌డం, స్వ‌దేశంలో విమాన‌యాన ప్ర‌యాణాలపై ప‌న్ను(ఐఏటీటీ)ను ర‌ద్దు చేయ‌డం, ఛార్ట‌ర్ విధానాల‌ను పునఃప‌రిశీలించ‌డం మొద‌లైన‌వి ఆయ‌న హ‌యాంలో చేప‌ట్టిన ప‌లు ప్ర‌ధాన సంస్క‌ర‌ణ‌లు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X