ప్రముఖ న్యాయకోవిదుడిగా పేరుగాంచిన రామ్ జెఠ్మలానీ వాజపేయీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. చదువులలో అద్భుత ప్రతిభ కనబర్చి లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆయన న్యాయవాదిగా ప్రాక్టీసును ప్రారంభించారు. నిజానికి న్యాయవాదిగా ప్రాక్టీసును చేపట్టడానికి కనీస వయసు 21 ఏళ్లు కాగా, ఆ నిబంధనను సవాలు చేస్తూ ఆయన కోర్టుకు వెళ్లి విజయం సాధించారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, కరాచీలో ఆయన సంస్థను ఏర్పాటు చేశారు. అయితే దేశ విభజన వల్ల చెలరేగిన అల్లర్లతో ఆయన భారతదేశానికి వలస వచ్చారు.
ఒక దాని వెంట మరోకటి ప్రముఖ కేసులన్నీ గెలుచుకుంటూ రావడంతో దేశ న్యాయవాదులలో ఆయన ప్రముఖ స్థానం సంపాదించారు. అయితే వలస వచ్చిన ఆయనపై నేరస్తుడన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించి, విజయం సాధించారు. 1993 నుంచి 98 వరకు దేశంలో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కుంభకోణం మరియు మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు లంచం కేసులను వాదించిన ప్రముఖ న్యాయవాదులలో జెఠ్మలానీ ఒకరు. 2010 లో ఆయన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2017 లో న్యాయవాద వృత్తి నుంచి ఆయన వైదొలిగారు. 1977 లో ఆయన తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు తన సీటును నిలబెట్టుకున్నారు. 1988 లో ఆయన రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఆరుసార్లు తన విలువైన సేవలను అందించారు.
| పూర్తి పేరు | రామ్ జెఠ్మలానీ |
| పుట్టిన తేదీ | 14 Sep 1923 |
| మరణం యొక్క తేదీ | 08 Sep 2019 (వయస్సు 96) |
| పుట్టిన ప్రాంతం | సింధ్, పాకిస్థాన్ |
| పార్టీ పేరు | Bharatiya Janta Party |
| విద్య | |
| వృత్తి | సీనియర్ అడ్వకేట్, సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా |
| తండ్రి పేరు | దింగత శ్రీ బూల్‌చంద్ గుర్ముఖ్ దాస్ |
| తల్లి పేరు | శ్రీమతి పార్బతీ జెఠ్మలానీ |
| జీవిత భాగస్వామి పేరు | శ్రీమతి రత్నా ఆర్ |
| జీవిత భాగస్వామి వృత్తి | న్యాయవాది |
| సంతానం | 2 కుమారులు 2 కుమార్తెలు |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.