• search
 • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
రామ్ విలాస్ పాస్వాన్

రామ్ విలాస్ పాస్వాన్

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

రామ్ విలాస్ పాస్వాన్ బీహ‌ర్‌లోని ఖ‌గ‌రియా జిల్లా, ష‌హ‌ర్‌బ‌న్ని గ్రామంలో ఒక ద‌ళిత కుటుంబంలో జ‌న్మించారు. ఆయ‌న త‌ల్లిదండ్రులు దివంగ‌త జ‌మున్ పాస్వాన్, సియా దేవి. పాస్వాన్ పిల్కిలోని కోసీ కాలేజి నుంచి న్యాయ‌వాద విద్య, ప‌ట్నా విశ్వవిద్యాల‌యం నుంచి మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. 1960 లో ఆయ‌న వివాహం రాజ్‌కుమారితో జ‌రిగింది. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ నామినేష‌న్లను కొంద‌రు సవాల్ చేయ‌డంతో ఆమెకు 1981 లోనే విడాకులు ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. మొద‌టి భార్య‌తో ఆయ‌న‌కు ఉషా, ఆశా అనే ఇద్ద‌రు కుమార్తెలు జ‌న్మించారు. 1983 లో ఆయ‌న రీనా శ‌ర్మ అనే పంజాబీ హిందూ కుటుంబానికి చెందిన ఎయిర్‌హోస్టెస్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఒక కుమారుడు, కుమార్తె. ఆయ‌న కుమారుడు చిరాగ్ పాస్వాన్ న‌ట‌న నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

పాస్వాన్ ప్ర‌స్తుతం కేంద్ర వినియోదారుల వ్య‌వహ‌రాలు, ఆహ‌రం, ప్ర‌జా పంపిణీ మంత్రిగా ఉన్నారు. తొలుత‌ సంయుక్త సోష‌లిస్టు పార్టీలో చేర‌డం ద్వారా ఆయ‌న రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ పార్టీ త‌ర‌పున 1969 లో తొలిసారి బీహ‌ర్ శాస‌న‌స‌భ‌కు ఆయ‌న ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 1974 లో లోక్‌ద‌ళ్ పార్టీ ఏర్పాటు కావ‌డంతో అందులో చేరి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యారు. అత్య‌వ‌స‌ర పరిస్థితి విధించ‌డాన్ని వ్య‌తిరేకించ‌డంతో ఆయ‌న జైలు పాల‌య్యారు. 1977 లో హాజిపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థిగా నెగ్గి ఆయ‌న తొలిసారి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అంతేగాక 1980, 189, 1996, 1998, 1999, 2004, 2014 ల‌లోనూ లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు.

ఆయ‌న ప్ర‌స్తుతం లోక్ జ‌న్‌శ‌క్తి పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. పాస్వాన్ మొత్తం ఎనిమిది సార్లు లోక్‌స‌భ స‌భ్యుడిగా, ఒక‌సారి రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ సేవ‌లందించారు. 2000 లో లోక్‌జ‌న్ శ‌క్తి పార్టీ స్థాపించి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. 2004 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వంలో చేరి కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువులు, ఉక్కు శాఖా మంత్రిగా సేవ‌లందించారు. 2004 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టికీ, 2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు.

1969 లో సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్య‌ర్థిగా రిజ‌ర్వ్‌డ్ స్థానం నుంచి ఆయ‌న తొలిసారి బీహ‌ర్ శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్టారు. 1974 లో రాజ్ నారాయణ్, జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణల అనుచరుడిగా పాస్వాన్ లోక్‌ద‌ళ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని తీవ్రంగా వ్య‌తిరేకించిన ప్ర‌ముఖ నాయ‌కులు రాజ్ న‌రైన్‌, క‌ర్పూరి ఠాకూర్, స‌త్యేంద్ర సిన్హాల‌కు అత్యంత స‌న్నిహితుడిగా మెలిగేవారు. మొరార్జీ దేశాయ్‌తో విభేధించి లోక్‌బంధు రాజ్ నారాయణ్ స్థాపించిన జ‌న‌తా ఎస్ పార్టీలో చేరి ఛైర్మ‌న్ అయ్యారు. 1975 లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి స‌మ‌యంలో పాస్వాన్ జైలుకు వెళ్లారు. అత్యయిక ప‌రిస్థితి ఎత్తేసేంత వ‌ర‌కూ జైలులోనే ఉన్నారు. 1977 లో జైలు నుంచి విడుద‌ల‌య్యాక, జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌పంచ రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచి తొలిసారి పార్ల‌మెంటులోకి అడుగు పెట్టారు. 1980, 1984 లో హాజిపూర్ సీటు నుంచి నెగ్గి ఏడ‌వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ద‌ళితుల క‌డ‌గండ్లు తీర్చి వారి సంక్షేమం కోసం 1983 లో ఆయ‌న ద‌ళిత సేనను ఏర్పాటు చేశారు.

1989 లో పాస్వాన్ 9 వ లోక్‌స‌భ‌కు తిరిగి ఎన్నిక‌య్యారు. విశ్వ‌నాథ్ ప్రతాప్ సింగ్ ప్ర‌భుత్వంలో కేంద్ర కార్మిక శాఖ, సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు. 1996లో అప్ప‌టి ప్ర‌ధాని రాజ్య‌స‌భ స‌భ్యుడు కావ‌డంతో, లోక్‌స‌భ‌లో అధికార కూట‌మిని ఆయ‌న ముందుండి న‌డిపించ‌డం విశేషం. అదే ఏడాది ఆయ‌న కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి 1998 వ‌ర‌కు కొన‌సాగారు. అనంత‌రం 1999 అక్టోబ‌రు నుంచి సెప్టెంబ‌రు 2001 వ‌ర‌కు కేంద్ర స‌మాచార శాఖ మంత్రిగానూ ప‌ని చేశారు. 2001 సెప్టెంబ‌రు నుంచి ఏప్రిల్ 2002 వ‌ర‌కు బొగ్గు మంత్రిత్వ శాఖ‌కు మారారు.

2000 లో పాస్వాన్ జ‌న‌తాదళ్‌ను వీడి లోక్ జ‌న్‌శ‌క్తి పార్టీ(ఎల్‌జేపీ)ని స్థాపించారు. 2004 లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత యునైటెడ్ ప్రోగ్రెసివ్ కూట‌మి (యూపీఏ) ప్ర‌భుత్వంలో చేరి కేంద్ర రసాయ‌నాలు, ఎరువులు, ఉక్కు శాఖ మంత్రిగా ప‌ని చేశారు.

2005 ఫిబ్ర‌వరిలో బీహ‌ర్ శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పాస్వాన్ లోక్ జ‌న్‌శ‌క్తి పార్టీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నిక‌ల్లో ఏ ఒక్క పార్టీ, కూట‌మికి కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన సీట్లు రాలేదు. గ‌తంలో లాలు ప్ర‌సాద్ యాద‌వ్‌ను అవినీతి ప‌రుడిగా విమ‌ర్శించ‌డంతో లాలుతోపాటు ఎన్‌డీఏ కూట‌మికి కూడా పాస్వాన్ త‌న‌ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించ‌లేదు. దీంతో రాష్ట్రంలో ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాస్వాన్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మేల్యేలు నితీష్ కుమార్‌కు మ‌ద్ధతిచ్చారు. అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ బూటా సింగ్ అసెంబ్లీని ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించారు. 2005 న‌వంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పాస్వాన్ ఏర్పాటు చేసిన తృతీయ కూట‌మి ఘోర ఓట‌మిని చ‌విచూడ‌గా, లాలు ప్ర‌సాద్ యాద‌వ్‌-కాంగ్రెస్ కూట‌మికి త‌క్కువ సీట్లు వ‌చ్చాయి. చివ‌రికి ఎన్‌డీఏ కూట‌మే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2009 సార్వ‌త్రిక ఎన్నికల సంద‌ర్భంగా లాలు ప్ర‌సాద్ యాదవ్ (కేంద్ర‌), అమ‌ర్ సింగ్‌ల‌తో క‌ల‌సి ముంబ‌యిలో జ‌రిగిన ర్యాలీలో పాస్వాన్ పాల్గొన్నారు.

బీహ‌ర్ అసెంబ్లీ ఎన్నిక‌లు కేంద్ర ప్ర‌భుత్వంపై ఎలాంటి ప్ర‌భావం చూప‌వ‌ని పాస్వాన్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న అన్న‌ట్లుగానే చివ‌రికి ఆయ‌న, లాలు ప్ర‌సాద్ కేంద్ర మంత్రులుగా ప‌ని చేశారు. ఐదుగురు ప్ర‌ధాన మంత్రుల ద‌గ్గ‌ర వివిధ శాఖ‌లలో కేంద్ర మంత్రిగా పాస్వాన్ ప‌ని చేశారు. 1996 నుంచి 2015 వ‌ర‌కు కేంద్రంలో ఏర్ప‌డ్డ ప్ర‌తీ కూట‌మి ప్ర‌భుత్వంలోనూ (యునైటెడ్ ఫ్రంట్, ఎన్‌డీఏ, యూపీఏ) ఆయ‌న మంత్రిగా ప‌ని చేయ‌డం విశేషం.

2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మికి వ్య‌తిరేకంగా రామ్ విలాస్ పాస్వాన్, లాలు ప్ర‌సాద్ యాద‌వ్‌తో క‌లిసి కొత్త కూట‌మిని ఏర్పాటు చేశారు. అనంత‌రం ఈ ఇద్దరూ క‌లిసి ములాయం సింగ్‌కు చెందిన స‌మాజ‌వాది పార్టీతో క‌లిసి నాలుగో ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఎన్నిక‌ల్లో హజీపూర్ నుంచి జ‌న‌తాద‌ళ్‌కు చెందిన బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి రామ్ సుంద‌ర్ దాస్ చేతిలో పాస్వాన్ ఓడిపోయారు. 33 ఏళ్ల‌లో ఆయ‌న తొలిసారిగా ఓట‌మి పాలవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌తో పాటు లోక్ జ‌న్‌శ‌క్తి పార్టీ సైతం ఆ ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డ‌ట‌యే గాక‌, లాలు ప్ర‌సాద్‌తో ఏర్పాటు చేసిన కూట‌మి కేవ‌లం నాలుగు సీట్ల‌నే గెలుచుకుంది.

2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆయ‌న హాజిపూర్ నుంచి నెగ్గి 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అలాగే పాస్వాన్ త‌న‌యుడు చిరాగ్ పాస్వాన్ కూడా బీహ‌ర్‌లోని జ‌మై నుంచి ఎంపీగా గెలిచారు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు రామ్ విలాస్ పాస్వాన్
పుట్టిన తేదీ 05 Jul 1946 (వ‌య‌స్సు  73)
పుట్టిన ప్రాంతం ష‌హర్‌బ‌న్ని, ఖ‌గ‌రియా జిల్లా, బీహర్
పార్టీ పేరు Ljnsp
విద్య Post Graduate
వృత్తి సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు జ‌మున్ పాస్వాన్
తల్లి పేరు సియా దేవి
జీవిత భాగస్వామి పేరు రీనా పాస్వాన్
జీవిత భాగస్వామి వృత్తి సామాజిక కార్య‌క‌ర్త
ఎంతమంది కుమారులు 1
ఎంతమంది కూతుళ్లు 3

కాంటాక్ట్

శాశ్వత చిరునామా గ్రామం, పీ.ఓ. ష‌హ‌ర్‌బ‌న్ని, మంత్రి తోలా బెల్లాహి, ఖ‌గ‌రియా జిల్లా, బీహ‌ర్-851204
ప్రస్తుత చిరునామా 12, జ‌న్‌ప‌థ్, న్యూ ఢిల్లీ - 110011
కాంటాక్ట్ నెంబర్ 01123017681
ఈ-మెయిల్ ramvilas.p@sansad.nic.in
వెబ్‌సైట్ ljp.co.in

ఆసక్తికర అంశాలు

రామ్ విలాస్ పాస్వాన్ మొత్తం ఎనిమిది సార్లు లోక్‌స‌భ స‌భ్యుడిగా, ఒకసారి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
2002 లో ఏర్పాటైన విచార్ శ‌క్తి ఛైర్మ‌న్‌గా ఆయ‌న ఎన్నిక‌య్యారు.
1977 నుంచి 78 వ‌ర‌కు ఎస్‌సీ ఎస్‌టీ సంక్షేమ క‌మిటీ మ‌రియు 1980-85 వ‌ర‌కు డీడీఏ అడ్వైజ‌రీ కౌన్సిల్‌లో స‌భ్యుడిగా ఉన్నారు.

1980-85 మ‌రియు 1989 నుంచి 95 వ‌ర‌కు పార్ల‌మెంట‌రీ అధికార భాష‌ల క‌మిటీలోనూ స‌భ్యుడిగా సేవ‌లందించారు.

1991-96 వ‌ర‌కు ఏయిమ్స్ స‌ల‌హాదారుల క‌మిటీ, కోర్టు, జ‌వ‌హర్ లాల్ నెహ్రు విశ్వ‌విద్యాల‌యం క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్నారు.

1998-9 వ‌ర‌కు ఇండియా-ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్ల‌మెంట‌రీ స్నేహ బృందంలో(జూలై 2010 నుంచి) స‌భ్యుడిగా ఉన్నారు.

చ‌ద‌రంగం ఆట ప‌ట్ల‌ ఆయ‌న‌కి ఆస‌క్తి ఎక్కువ‌.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

 • 2015
  జ‌న‌వ‌రి 29, 2015 నాడు సాధార‌ణ ప్ర‌యోజ‌నాల కమిటీలో స‌భ్యుడయ్యారు.
 • 2014
  16 వ లోక్‌స‌భ‌కు తిరిగి ఎన్నిక‌య్యారు (మొత్తంగా 9 వ సారి). మే 27 న కేంద్ర ఆహ‌రం, పౌర స‌ర‌ఫ‌రాలు, వినియోదారుల వ్య‌వ‌హ‌రాల మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
 • 2013
  రాజ్య‌స‌భ నిబంధ‌న‌ల క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
 • 2011
  కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
 • 2010
  2010 జూలై నుంచి 2014 మే వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఆగ‌స్టు 2010 నాడు ప‌ర్స‌న‌ల్ ప‌బ్లిక్ గ్రీవెన్సెస్‌, న్యాయ శాఖ స్టాండింగ్ క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. సెప్టెంబ‌రు 2010 లో పిటీష‌న్ల క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మాకం. 2010 సెప్టెంబ‌రు నుంచి 2011 సెప్టెంబ‌రు వ‌ర‌కు కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మింప‌బ‌డ్డారు.
 • 2004
  రామ్ విలాస్ పాస్వాన్ 14 వ లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు (మొత్తంగా 8 వ సారి). ఈ సారి ఆయ‌న ఆర్‌జేడీ పార్టీకి చెందిన చ్ఛేది పాస్వాన్‌పై 1,05,504 ఓట్ల తేడాతో నెగ్గారు. మే 23, 2004 నుంచి మే 22, 2009 వ‌ర‌కు ఆయ‌న కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువులు , ఉక్కు శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
 • 2001
  సెప్టెంబ‌రు 1, 2001 నుంచి ఏప్రిల్ 29, 2002 వ‌ర‌కు కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రిగా సేవ‌లందించారు.
 • 1999
  13 వ లోక్‌స‌భ‌కు(మొత్తంగా 7 వ సారి) ఆయ‌న లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో జేడీ(యూ) కి చెందిన రమాయి రామ్ పై 2,37,801 ఓట్ల తేడాతో గెలుపొందారు. అక్టోబ‌రు 13, 1991 నుంచి సెప్టెంబ‌రు 1, 2001 వ‌ర‌కు పాస్వాన్ కేంద్ర స‌మాచార శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
 • 1998
  12 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఎస్‌జేపీ(ఆర్‌) పార్టీకి చెందిన రామ్ సుంద‌ర్ దాస్‌పై 1,77,561 ఓట్ల తేడాతో నెగ్గారు. జ‌న‌తా ద‌ళ్ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేతగా ఉన్నారు.
 • 1998
  1998-99 మ‌ధ్య సాధార‌ణ ప్ర‌యోజ‌నాల‌ క‌మిటీ, రైల్వేల స్టాండింగ్ క‌మిటీ, హోం వ్య‌వ‌హ‌రాల కాన్సులేటివ్ క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
 • 1996
  రామ్ విలాస్ పాస్వాన్ వ‌రుస‌గా 5 వ‌ సారి లోక్‌స‌భ‌కు తిరిగి ఎన్నిక‌య్యారు. 11 వ లోక్‌స‌భ‌ సంద‌ర్భంగా ప్ర‌ధానులు స‌ర్వ‌శ్రీ హెచ్‌.డీ.దేవేగౌడ, ఐ.కే.గుజ్రాల్‌లు రాజ్య‌స‌భ‌లో స‌భ్యులుగా ఉండ‌టంతో పాస్వాన్‌ లోక్‌స‌భ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీలో స‌భ్యుడిగానూ నియ‌మితుల‌య్యారు.
 • 1996
  1996-98 మ‌ధ్య కాలంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ప‌ని చేశారు. జూన్ 1 1996 నుంచి జూన్ 29, 1996 వ‌ర‌కు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హ‌రాల మంత్రిగా ఉన్నారు.
 • 1991
  రామ్ విలాస్ పాస్వాన్ 10 వ లోక్‌స‌భ‌కు(మొత్తంగా 4 వ సారి) మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి అశోక్ కుమార్ పై 2,60,484 ఓట్ల తేడాతో నెగ్గారు. పార్ల‌మెంటులో బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ తో పాటు హోం వ్య‌వ‌హ‌రాల స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు.
 • 1989
  9 వ లోక్‌స‌భ‌ (మొత్తం 3 వ సారి)కు ఆయ‌న తిరిగి ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు చెందిన మ‌హ‌బీర్ పాస్వాన్ పై రామ్ విలాస్ 5,04,448 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989-90 మ‌ధ్య ఆయ‌న కేంద్ర కార్మిక, సంక్షేమ శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
 • 1988
  1988-89 వ‌ర‌కు నేష‌న‌ల్ ఫ్రంట్ సెక్ర‌ట‌రీతో పాటు జ‌న‌తాద‌ళ్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హరించారు.
 • 1987
  1987-88 మ‌ధ్య కాలంలో జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు.
 • 1985
  1985-86 మ‌ధ్య లోక్ ద‌ళ్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు.
 • 1984
  1982 నుంచి 84 మ‌ధ్య కాలంలో లోక్ స‌భ‌లో, లోక్ ద‌ళ్‌(కే) ప‌క్ష నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.
 • 1983
  1983 లో ద‌ళిత్ సేనను స్థాపించి, జాతీయాధ్య‌క్షుడ‌య్యారు.
 • 1980
  పాస్వాన్ 7 వ లోక్‌స‌భ‌కు (2 వ సారి) మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు.
 • 1977
  ఆయ‌న ఆరవ లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
 • 1974
  లోక్ ద‌ళ్ ప్ర‌ధాన సెక్ర‌ట‌రీగా నియ‌మితుల‌య్యారు.
 • 1970
  బీహ‌ర్ సంయుక్త సోష‌లిస్టు పార్టీ జాయింట్ సెక్ర‌ట‌రీ అయ్యారు.
 • 1969
  బీహ‌ర్ శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
నికర ఆస్తులు96.42 LAKHS
ఆస్తులు 96.42 LAKHS
బాధ్యతలుN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more