హోం
 » 
సౌగ‌తా రాయ్

సౌగ‌తా రాయ్

సౌగ‌తా రాయ్

సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో సేవ‌లందిస్తున్న సౌగ‌తా రాయ్ ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌. మంచి విద్యావేత్త అయిన రాయ్‌ ఫిజిక్స్ మ‌రియు న్యాయ శాస్త్రంలో ప‌ట్ట‌భ‌ద్రుడు కావ‌డం విశేషం.

సౌగ‌తా రాయ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో సేవ‌లందిస్తున్న సౌగ‌తా రాయ్ ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌. మంచి విద్యావేత్త అయిన రాయ్‌ ఫిజిక్స్ మ‌రియు న్యాయ శాస్త్రంలో ప‌ట్ట‌భ‌ద్రుడు కావ‌డం విశేషం. ఆశుతోష్ కాలేజీలో ప్రొఫెస‌ర్‌గా ప‌ని చేసి రిటైరైన రాయ్‌ ఎంతోకాలంగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. 1977 లో జ‌రిగిన ఆరో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ బ‌రాక్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. ఆ గెలుపు అనంత‌రం 1979 లో ఆయ‌న స్వ‌ల్ప‌కాలం పాటు కేంద్ర పెట్రోలియం మ‌రియు ర‌సాయ‌నాల శాఖా మంత్రిగా సేవ‌లందించారు.


ఆ త‌ర్వాత 2009 లో జ‌రిగిన 15 వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో డ‌మ్ డ‌మ్ నుంచి గెలిచిన త‌ర్వాత ఆయ‌న కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది శాఖా స‌హాయ మంత్రిగా ప‌ని చేశారు. 2014 లో ఆయ‌న మూడోమారు లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు. 1987 నుంచి 2009 వ‌ర‌కు ఆయ‌న ప‌శ్ఛిమ బెంగాల్ శాస‌న‌స‌భ‌కు ఐదు సార్లు ఎన్నిక‌య్యారు.

మరిన్ని చదవండి
By Keshav Karna Updated: Monday, February 8, 2021, 01:14:56 PM [IST]

సౌగ‌తా రాయ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు సౌగ‌తా రాయ్
పుట్టిన తేదీ 06 Aug 1947 (వ‌య‌స్సు  76)
పుట్టిన ప్రాంతం షిల్లాంగ్, మేఘాల‌యా
పార్టీ పేరు All India Trinamool Congress
విద్య Post Graduate
వృత్తి విద్యావేత్త
తండ్రి పేరు శ్రీ దేబేష్ చంద్ర రాయ్
తల్లి పేరు శ్రీమ‌తి అనీలా రాయ్
జీవిత భాగస్వామి పేరు శ్రీమ‌తి డాలీ రాయ్
జీవిత భాగస్వామి వృత్తి N/A
శాశ్వత చిరునామా 162 /డీ/593, లేక్ గార్డెన్స్‌, కోల్‌క‌తా - 700045
ప్రస్తుత చిరునామా 58, లోధీ ఎస్టేట్, న్యూ ఢిల్లీ - 110003, టెలీఫోన్ : (011) 23329730, 9013180175 (M)
కాంటాక్ట్ నెంబర్ 9830031220 / 9013180175
ఈ-మెయిల్ [email protected]

సౌగ‌తా రాయ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹1.7 CRORE
ఆస్తులు :₹1.95 CRORE
బాధ్యతలు: ₹25 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సౌగ‌తా రాయ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఆరో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు అనంత‌రం 1979 లో ఆయ‌న స్వ‌ల్ప‌కాలం పాటు కేంద్ర పెట్రోలియం మ‌రియు ర‌సాయ‌నాల శాఖా మంత్రిగా సేవ‌లందించారు.

సౌగ‌తా రాయ్ రాజకీయ జీవితం

2014 - 2016
  • ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2009 - 2012
  • కేంద్ర ప‌ట్టణాభివృద్ది శాఖా స‌హాయ మంత్రి అయ్యారు.
2009
  • 15 వ లోక్‌స‌భ‌కు ఆయ‌న ఎన్నిక‌య్యారు.
1987-2009
  • ప‌శ్చిమ బెంగాల్ శాస‌న‌స‌భ‌లో ఆయ‌న ఐదుసార్లు ఎమ్మేల్యేగా సేవ‌లందించారు.
1979
  • కేంద్ర పెట్రోలియం మ‌రియు ర‌సాయ‌నాల శాఖా మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.
1977
  • ఆయ‌న ఆర‌వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అనంత‌రం ప్ర‌భుత్వ హామీల క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
1973-77
  • ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.
1968-70
  • కాంగ్రెస్ విద్యార్థి విభాగ‌మైన ప‌శ్చిమ బెంగాల్ ఛాత్రా ప‌రిష‌త్‌కు ఆయ‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు.
29 April 2015
  • పార్ల‌మెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో భ‌ద్ర‌తా సంయుక్త క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
11 Dec. 2014
  • ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్ సంయుక్త క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
1 May 2017
  • ప్ర‌భుత్వ రంగ సంస్ధల క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
1 Sep. 2014
  • నిబంధ‌న‌ల క‌మిటీ, ఆర్థిక శాఖా స్టాండింగ్ క‌మిటీ మ‌రియు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖా కాన్సులేటివ్ క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • మూడో సారి ఎంపీగా నెగ్గి, ఆయ‌న 16 వ లోక్‌స‌భ‌లో అడుగు పెట్టారు.

గ‌త చ‌రిత్ర

1974 - 2007
  • కోల్‌క‌తాలోని ఆశుతోష్ కాలేజీలో ఆయ‌న లెక్చ‌ర‌ర్‌గా బోధించారు.
1970-72
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస‌ర్‌గా ప‌ని చేశారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X