• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
సెల్వీ జె జ‌య‌ల‌లిత

సెల్వీ జె జ‌య‌ల‌లిత

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

జ‌య‌ల‌లిత ప్ర‌ముఖ న‌టి మ‌రియు రాజ‌కీయ నాయ‌కురాలు. ఆమె త‌మిళ‌నాడు రాష్ట్రానికి ఆరు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. 1961 లో క‌న్న‌డ సినిమా "శ్రీ శైల మ‌హాత్మే" తో బాల‌న‌టిగా ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1965 లో సీ.వీ. శ్రీధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన "వెన్నిరాడై"తో త‌మిళ చిత్ర సీమ‌లో అరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత ఎమ్‌.జీ. రామ‌చంద్ర‌న్‌(ఎమ్‌జీఆర్‌) స‌ర‌స‌న 28 సినిమాలు, శివాజీ గ‌ణేష‌న్‌తో 17 సినిమాలు చేశారు. న‌ట‌న‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచినందుకుగానూ ఆమె ఎన్నో అవార్డుల‌ను సాధించారు.

ఎమ్‌జీఆర్ స్థాపించిన ఆల్ ఇండియా అన్నాద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం(ఏఐడీఎంకే) లో చేర‌డం ద్వారా ఆమె త‌న రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. 1984 నుంచి 1989 మ‌ధ్య రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ప‌ని చేశారు. 1987 లో ఎమ్‌జీఆర్ మ‌ర‌ణానంత‌రం 1989 లో ఏఐడీఎంకే అధినేత్రి అయ్యారు. 1991 లో పార్టీని అధికారంలోకి తెచ్చి, త‌మిళ‌నాడులో మొత్తం ప‌ద‌వీకాలం పూర్తిచేసిన‌ మొద‌టి మ‌హిళా ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆరుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కాలంలో అక్ర‌మాస్తుల కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లారు. అనారోగ్యం కార‌ణంగా 75 రోజులు మృత్యువుతో పోరాడిన త‌ర్వాత డిసెంబ‌రు 6, 2016 న ఆమె క‌న్నుమూశారు. ఆమె మ‌ర‌ణం ఎన్నో వివాదాల‌కు తావిచ్చింది.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు సెల్వీ జె జ‌య‌ల‌లిత
పుట్టిన తేదీ 24 Feb 1948
మరణం యొక్క తేదీ 05 Dec 2016 (వ‌య‌స్సు  68)
పుట్టిన ప్రాంతం మెలుకొటే, మండ్య జిల్లా, మైసూరు, క‌ర్ణాట‌క
పార్టీ పేరు All India Anna Dravida Munnetra Kazhagam
విద్య 10th Pass
వృత్తి చ‌ల‌న‌చిత్ర న‌టి, రాజ‌కీయ నాయ‌కుడు, ర‌చ‌యిత‌, నాట్య‌కారిణి
తండ్రి పేరు జ‌య‌రామ్
తల్లి పేరు వేద‌వ‌ల్లి

కాంటాక్ట్

శాశ్వత చిరునామా వేద నిల‌యం, 81 పోయెస్ గార్డెన్, చెన్నై - 600086
ప్రస్తుత చిరునామా వేద నిల‌యం, 81 పోయెస్ గార్డెన్, చెన్నై - 600086
కాంటాక్ట్ నెంబర్ 044-24992121
ఈ-మెయిల్ jayalalithaa1948@gmail.com

ఆసక్తికర అంశాలు

చెన్నైలోని చ‌ర్చ్‌పార్క్ కాన్వెంట్ నుంచి జ‌య‌ల‌లిత మెట్రిక్యులేష‌న్ పూర్తి చేశారు, 1964 లో ఉన్న‌త చ‌దువుల కోసం స్కాల‌ర్‌షిప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఆమె సినిమాల‌నే త‌న కెరీర్‌గా ఎంచుకున్నారు. త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, హిందీ మ‌రియు ఇంగ్లీషు భాష‌ల‌లో 140 కి పైగా సినిమాల‌లో న‌టించారు. జ‌య‌ల‌లిత త‌ల్లి కూడా సినిమాల్లో న‌టించారు, తెర మీద ఆమె పేరు సంధ్య‌. రాజ్య‌స‌భ‌లో ప‌లు అంశాల‌పై జ‌య‌ల‌లిత చేసిన ప్ర‌సంగాల‌పై నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ తీవ్రంగా విభేధించారు. ఆమె ద‌త్త పుత్రుడు సుధాక‌ర‌ణ్ వివాహం వివాదాస్ప‌ద‌మైంది.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2016
    త‌మిళ‌నాడుకు ఆరోసారి జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రి అయ్యారు. వ‌రుస‌గా రెండోసారి ముఖ్య‌మంత్రి పీఠ‌మెక్కి చ‌రిత్ర సృష్టించారు.
  • 2011-16
    ఐదోసారి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పీఠాన్ని జ‌య‌ల‌లిత అధిరోహించారు. అమ్మ మాస్ట‌ర్ హెల్త్ చెక‌ప్ ప్లాన్‌, అమ్మ ఆరోగ్య ప‌థ‌కం, వ‌యోవృద్దుల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం మొద‌లైన ఎన్నో ప‌థ‌కాల‌ను ఆమె ప్రారంభించారు. 2015 లో ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సును ఆమె ప్రారంభించారు.
  • 2011
    2011 శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో ఏఐడీఎంకే ఘ‌న విజ‌యం సాధించింది. త‌మిళ‌నాడు రాష్ట్రానికి జ‌య‌ల‌లిత నాలుగోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు.
  • 2011
    డిసెంబ‌రు 2011 లో అమ్మ త‌న స‌న్నిహితురాలు శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ తో పాటు 13 మందిని పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపారు.
  • 2003
    మార్చి 2003 లో జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడుకు మూడోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. డిసెంబ‌రు 2004 లో సునామీ వ‌చ్చిన‌ప్పుడు ఆమె చూపిన నాయ‌క‌త్వ‌ సామ‌ర్థ్యానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ద‌క్కాయి.
  • 2001
    జ‌య‌ల‌లిత రెండోసారి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అయ్యారు. సెప్టెంబ‌రు 2001 త‌ర్వాత ఆమె ఆ ప‌ద‌వికి అన‌ర్హురాల‌య్యారు. దీంతో ఆమె త‌న ప‌ద‌విని న‌మ్మిన‌బంటు ఓ.ప‌న్నీర్‌సెల్వంకు అప్ప‌గించారు.
  • 1998
    అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ప్ర‌భుత్వంలో ఏఐడీఎంకే భాగ‌స్వామ్య ప‌క్షంగా చేరింది. ఏడాది త‌ర్వాత ఆమె త‌న మ‌ద్ధ‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డంతో దేశంలో సాధార‌ణ ఎన్నిక‌లు వ‌చ్చాయి.
  • 1998
    క‌ల‌ర్ టీవిల కుంభ‌కోణంతో సంబంధ‌ముంద‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో జ‌య‌ల‌లిత అరెస్టయి 30 రోజుల పాటు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. మే 30, 2000 నాడు ఈ కేసు నుంచి ఆమె నిర్ధోషిగా బ‌య‌ట‌పడ్డారు.
  • 1991-96
    ఏఐడీఎంకే-కాంగ్రెస్ కూట‌మి విజ‌యం అనంత‌రం జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అయ్యారు.
  • 1991
    ఆ ఎన్నిక‌ల‌లో జ‌య‌ల‌లిత బోడినాయ‌క‌నూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. చీలిపోయిన మ‌రో వ‌ర్గం కూడా జ‌య‌ల‌లిత‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌గా ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఆమె ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.
  • 1987
    ఎమ్ జీ రామ‌చంద్ర‌న్ మ‌ర‌ణం త‌ర్వాత ఏఐడీఎంకే రెండు ప‌క్షాలుగా చీలిపోయింది. ఎమ్‌జీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న భార్య జాన‌కీ రామ‌చంద్ర‌న్ నేతృత్వంలోని ఏఐడీఎంకే(జేఏ) ఒక‌టి, జ‌య‌ల‌లిత నాయ‌క‌త్వంలోని ఏఐడీఎంకే(జే) మ‌రొక‌టిగా చీలిపోయాయి. జాన‌కీ రామ‌చంద్ర‌న్ ముఖ్య‌మంత్రి కాగా, జ‌య‌ల‌లిత పార్టీలోనే కొన‌సాగి త‌దుప‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల స‌న్నాహాల‌ను వేగ‌వంతం చేశారు.
  • 1984-89
    జ‌య‌ల‌లిత రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఎన్నిక‌య్యారు. 1989 వ‌ర‌కు ఆమె ఆ ప‌ద‌విలో కొన‌సాగారు. 1984 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో అన్నా డీఎంకే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు నేతృత్వం వ‌హించారు. ఆ ఎన్నిక‌ల‌లో ఏఐడీఎంకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.
  • 1984
    ఆల్ ఇండియా అన్నా ద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం(ఏఐడీఎంకే) ప్ర‌చార కార్య‌ద‌ర్శిగా జ‌య‌ల‌లిత నియ‌మితుల‌య్యారు.
  • 1982
    ఏఐడీఎంకేలో స‌భ్యురాలిగా చేర‌డం ద్వారా జ‌య‌ల‌లిత రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. "పెన్నిన్ పెరుమై"లో ఆమె తొలిసారిగా ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప్ర‌సంగించారు.

గ‌త చ‌రిత్ర

  • 1965
    వెన్నిరా ఆడై సినిమాతో త‌మిళ సినిమాల్లో అరంగేట్రం చేశారు.
  • 1964
    చిన్న‌డా గోంబే సినిమాతో క‌న్న‌డ‌లో తొలిసారి పూర్తిస్థాయి ప్రాధాన్య పాత్ర‌లో న‌టించారు.
  • 1962
    హిందీ చిత్రం మ‌న్మౌజీలో కృష్ణుని పాత్ర ధ‌రించారు. ఆ చిత్రంలో ఆమె కేవ‌లం మూడు నిమిషాల‌పాటు మాత్ర‌మే క‌నిపిస్తారు.
  • 1961
    క‌న్న‌డ చిత్రం శ్రీ శైల మ‌హాత్మేలో జ‌య బాల‌న‌టిగా క‌నిపించారు.
  • 1960-64
    1960 లో టీ హౌజ్ ఆఫ్ ద ఆగ‌స్టు మూన్ మ‌రియు 1964 లో అండ‌ర్‌సెక్ర‌ట‌రీ చిత్రాల‌లో ఆమె న‌టించారు. తర్వాత ఆమె ప్లేస్ మాల‌తీ, ద హోల్ ట్రూత్ మ‌రియు కావేరీ తండా క‌లైసెల్వీ చిత్రాల్లోనూ ఆమె న‌టించారు.
నికర ఆస్తులు111.69 CRORE
ఆస్తులు 113.73 CRORE
బాధ్యతలు2.04 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X