Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా

శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా
న‌ట‌న నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శ‌త్రుఘ్న సిన్హా కెరీర్ మొద‌ట బీజేపీతో ప్రారంభ‌మైంది. ఒక ఉప ఎన్నిక‌లో ఆయ‌న త‌న స‌హ నటుడు రాజేష్ ఖ‌న్నాకు పోటీ చేయ‌డం ద్వారా ఆయ‌న రాజ‌కీయ కెరీర్ మొద‌లైంది.
By Rashmi | Monday, February 8, 2021, 01:09:41 PM [IST]

శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

న‌ట‌న నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శ‌త్రుఘ్న సిన్హా కెరీర్ మొద‌ట బీజేపీతో ప్రారంభ‌మైంది. ఒక ఉప ఎన్నిక‌లో ఆయ‌న త‌న స‌హ నటుడు రాజేష్ ఖ‌న్నాకు పోటీ చేయ‌డం ద్వారా ఆయ‌న రాజ‌కీయ కెరీర్ మొద‌లైంది. అయితే త‌న మిత్రుడు రాజేష్ ఖ‌న్నాతో పోటీకి దిగ‌డం త‌న జీవితంలో చేసిన అతిపెద్ద పొర‌పాట‌ని ఆయ‌న చాలా సార్లు ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఆ ఎన్నిక‌ల్లో రాజేష్ ఖ‌న్నా, సిన్హా పై భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో అప్ప‌టి నుంచి ఖ‌న్నాతో ఆయన మాట్లాడ‌లేదు. మ‌ళ్లీ సంబంధాలు క‌లుపుకుందామ‌ని సిన్హా ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, 2012 లో రాజేష్ ఖ‌న్నా మ‌ర‌ణించేంత వ‌ర‌కు అది సాధ్య‌ప‌డ‌లేదు. అయితే 2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆయ‌న బీహార్‌లోని ప‌ట్నా సాహిబ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.


2009- 2014, మ‌రియు 2014-2019 వ‌ర‌కు లోక్‌స‌భ స‌భ్యుడిగానే గాక‌, రెండు సార్లు ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ సేవ‌లందించారు. 13 వ లోక్‌స‌భ‌కు ఎంపికైన ఆయ‌న‌, వాజ్‌పేయీ ప్ర‌భుత్వంలో ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమం మ‌రియు షిప్పింగ్ మంత్రిగా సేవ‌లందించారు. 2006 మేలో ఆయ‌న బీజేపీ సాంసృతిక మ‌రియు క‌ళ‌ల శాఖ నాయ‌కుడిగా ఉన్నారు. అనంత‌రం ఆయ‌న సినిమా సెల‌బ్రిటీ శేఖ‌ర్ సుమ‌న్‌ను ఓడించారు. ఆ త‌ర్వాత 2014 లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విజ‌యం సాధించారు.

మరిన్ని చదవండి

శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా
పుట్టిన తేదీ 15 Jul 1946 (వ‌య‌స్సు  79)
పుట్టిన ప్రాంతం ప‌ట్నా, బీహార్
పార్టీ పేరు All India Trinamool Congress
విద్య Graduate
వృత్తి సినీ న‌టులు, సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు దివంగత శ్రీ బీ.పీ. సిన్హా
తల్లి పేరు దివంగ‌త శ్రీమ‌తి శ్యామా దేవీ సిన్హా
జీవిత భాగస్వామి పేరు శ్రీమ‌తి పూనం సిన్హా
సంతానం 2 కుమారులు 1 కుమార్తెలు
వెబ్‌సైట్ sinhashatrughan.in

శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹192.9 CRORE
ఆస్తులు
₹210.5 CRORE
బాధ్యతలు
₹17.61 CRORE

శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లోని అద్భుత న‌టుల‌లో సిన్హా ఒక‌ర‌ని రెడీఫ్ ప్ర‌క‌టించింది. రెడీఫ్ ఎంపిక చేసిన జాబితాలోని ఇత‌ర న‌టులు అజ‌య్ దేవ్‌గ‌ణ్, అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఇర్ఫాన్ ఖాన్, రాజేష్ ఖ‌న్నా, రజినీకాంత్, షారుఖ్ ఖాన్ మ‌రియు సునీల్ శెట్టి.

శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా రాజకీయ జీవితం

  • 2014 : 2009 లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో నెగ్గి, ఆయ‌న 15 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఆర్‌జేడీ అభ్య‌ర్థి విజ‌య్ కుమార్ పై 1,66,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అనంత‌రం ఆగ‌స్టు 31, 2009 నాడు ఆయ‌న ర‌వాణా, ప‌ర్యాట‌కం మ‌రియు సాంసృతిక స్టాండింగ్ క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 2009 : 2009 లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో నెగ్గి, ఆయ‌న 15 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఆర్‌జేడీ అభ్య‌ర్థి విజ‌య్ కుమార్ పై 1,66,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అనంత‌రం ఆగ‌స్టు 31, 2009 నాడు ఆయ‌న ర‌వాణా, ప‌ర్యాట‌కం మ‌రియు సాంసృతిక స్టాండింగ్ క‌మిటీల‌లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
  • 2003 : జ‌న‌వ‌రి 29, 2003 నుంచి 2004 మే వ‌ర‌కు కేంద్ర నౌకాయాన మంత్రిగా ప‌ని చేశారు.
  • 2002 : 2002 నుంచి 2008 మ‌ధ్య‌కాంలో రెండోసారి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా సేవ‌లందించారు. అనంత‌రం జూలై 2002 నుంచి జ‌న‌వ‌రి 29, 2003 వ‌ర‌కు కేంద్ర ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రిగా సేవ‌లందించారు.
  • 1996 : 1996 నుంచి 2002 వ‌ర‌కు ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ని చేశారు. ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థి రామ్ ల‌ఖ‌న్ సింగ్‌ను 88,334 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు.

శ్రీ శ‌త్రుఘ్న ప్ర‌సాద్ సిన్హా సాధించిన విజయాలు

2016 లో ఆయ‌న ఆత్మ‌క‌థ నేప‌థ్యంలో గ‌ల ఖామోష్ సినిమా విడుద‌లైంది. సినీ రంగంలో ఆయ‌న పొందిన అవార్డుల వివ‌రాలిలా ఉన్నాయి. త‌న్హాయీ చిత్రానికిగానూ ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా బీ.ఎఫ్‌.జే.ఏ అవార్డును సాధించారు. ఖుద్‌గ‌ర్జ్ చిత్రంలో న‌ట‌న‌కుగానూ, ఉత్త‌మ క‌థానాయ‌కుడిగా పంజాబ్-క‌ళా-శ్రీ అవార్డును అందుకున్నారు. 1988 లో వ‌చ్చిన అంతోర్‌జోలీ జాత్రా చిత్రంలో న‌టించినందుకు గోల్డెన్ సెమ‌ర్గ్ అవార్డు, తాష్కెంట్ సాధించారు. వీటితోపాటు ఆల్ ఇండియా ఫిల్మ్‌గోయ‌ర్స్ నుంచి అభిన‌య సామ్రాట్ అవార్డును అందుకున్నారు.

ఇవేగాక మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను రాష్ట్రీయ కిశోర్ కుమార్ స‌మ్మాన్ పుర‌స్కారం చేత స‌త్క‌రించింది. మొద‌టిసారిగా హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ నుంచి ఒక న‌టుడు కేంద్ర మంత్రిగా కావ‌డంతో ఆయ‌న పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.

దాతృత్వ కార్య‌క్ర‌మాల‌కు గానూ బీహార్ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు బీహార్ ర‌త్నా అవార్డును ప్ర‌ధానం చేసింది. భార‌తీయ సినిమాల్లో విశేష కృషి స‌ల్పినందుకు న్యూయార్క్(యూఎస్ఏ) మ‌రియు టోరంటో(కెన‌డా) ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో త‌గిన గౌరవం పొందారు. పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఛారిటీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినందుకు నాసౌ కౌంటీ లెజిస్లేచ‌ర్ నుంచి స‌ర్టిఫికేట్ ఆఫ్ రిక‌గ్నేష‌న్ పొందారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జ‌రిగిన ఐఫా ఉత్స‌వాల్లో జీవ‌న‌కాల సాఫ‌ల్య అవార్డును అందుకున్నారు. ఇండో-జ‌పాన్ ఫ్రెండ్‌షిప్ ఛైర్మ‌న్‌గానూ ఆయ‌న ప‌ని చేశారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+