Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిద్ధరామయ్య

సిద్ధరామయ్య
2013 ఎన్నికల ఫలితంగా కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన నంజునాద స్వామి అతని రాజకీయ జీవితాన్ని సమాజ్‌వాదీ యువజన సభ నుంచి మొదలుపెట్టారు.
By Rashmi | Monday, December 31, 2018, 03:34:40 PM [IST]

సిద్ధరామయ్య బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

2013 ఎన్నికల ఫలితంగా కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన నంజునాద స్వామి అతని రాజకీయ జీవితాన్ని సమాజ్‌వాదీ యువజన సభ నుంచి మొదలుపెట్టారు. 1978 సంవత్సరం వరకూ జూనియర్ లాయర్‌గానే పనిచేశారు. కర్ణాటక అసెంబ్లీ పలు పదవులను చేపట్టారు. క్రమంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. అంతకంటే ముందు జేడీఎస్ పార్టీకి పనిచేసి రెండు సార్లు కర్ణాటక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2005-06 సంవత్సరంలో దేవ గౌడకు సిద్ధరామయ్యకు మధ్య విభేదాలు రావడంతో జేడీఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం సిద్ధరామయ్య కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ సమన్వయ కమిటీకి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో కురుబా కమ్యూనిటీకి నాయకుడిగా పని చేశారు.

మరిన్ని చదవండి

సిద్ధరామయ్య వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు సిద్ధరామయ్య
పుట్టిన తేదీ 12 Aug 1948 (వ‌య‌స్సు  77)
పుట్టిన ప్రాంతం మైసూర్
పార్టీ పేరు Indian National Congress
విద్య Graduate Professional
వృత్తి రాజకీయ నాయకుడు
తండ్రి పేరు సిద్ధరామె గౌడ
తల్లి పేరు బోరమ్మ గౌడ
జీవిత భాగస్వామి పేరు పార్వతీ సిద్ధరామయ్య
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 2 కుమారులు
మతం Atheist

సిద్ధరామయ్య నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹28.07 CRORE
ఆస్తులు
₹51.94 CRORE
బాధ్యతలు
₹23.86 CRORE

సిద్ధరామయ్య సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

సిద్ధరామయ్య తల్లిదండ్రులను ఆయనను వైద్యవృత్తిలో చూడాలనుకుంటే దానికి భిన్నంగా ఆయనేమో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కర్ణాటక రాష్ట్రాన్ని ఆకలి కోరల్లో నుంచి బయటపడేయాలనే కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చారు. ఈ కారణంతోనే రాష్ట్రమంతటా ఇందిరా క్యాంటిన్లు ప్రారంభించారు. 2018లో రాష్ట్ర 13వ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించారు. 2010వ సంవత్సరంలో రెడ్డి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా బెంగళూరు నుంచి బళ్లారి వరకూ 320 కి.మీ మేర బళ్లారి చలో అనే పేరుతో పాదయాత్ర చేశారు. ఇది కర్ణాటక రాజకీయాల్లో ప్రధాన ఘట్టంగా నిలిచింది. చట్ట వ్యతిరేకంగా చేసిన మైనింగ్ దాంతో పాటు లంచగొండితనానికి ప్రస్తుత అధికార పార్టీ మద్దతు ఇస్తుందంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

సిద్ధరామయ్య రాజకీయ జీవితం

  • 2018: వరుణ నియోజకవర్గం నుంచి కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీకి మరోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుతం సిద్ధరామయ్య కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ సమన్వయ కమిటీకి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
  • 2013: కర్ణాటక రాష్టానికి 22వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018వరకూ ఆయన ఇదే పదవిలో కొనసాగారు. 1977తర్వాత కర్ణాటక రాష్ట్రానికి ఐదేళ్ల పాటు కొనసాగిన మొదటి ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు.
  • 2008: వరుణ నియోజకవర్గం నుంచి కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీకి మరోసారి ఎన్నికయ్యారు.
  • 2006: 2006 డిసెంబరులో జరిగిన ఉపఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గంలో ఎమ్. శివబాసప్ప జేడీ(ఎస్)పై 257ఓట్లతో గెలుపొందారు.
  • 2005: జేడీఎస్ నుంచి విడిపోయాక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు.
  • 2004: మరొక సారి కర్ణాటక ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • 1999: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.
  • 1996: కర్ణాటక రాష్ట్రానికి జే.హెచ్ పటేల్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
  • 1994: కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీకి సభ్యునిగా ఎన్నికై ఆర్థిక శాఖా మంత్రిగా నియమితులైయ్యారు.
  • 1992: జనతాదళ్‌కు సెక్రటరీగా నియమితులైయ్యారు.
  • 1989: కాంగ్రెస్ నేత ఎం. రాజశేఖర మూర్తి చేతిలో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.
  • 1985: మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి అదే నియోజకవర్గం నుంచి మరొకసారి గెలుపొందారు. పశు పోషణ, వాటి వైద్య సేవలకు సంబంధించిన శాఖకు మంత్రిగా పనిచేశారు.
  • 1983: కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఛాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. భారతీయ లోక్ దళ్ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు.
  • 1978: మైసూర్ ప్రాంతంలో లాయర్‌గా కొనసాగుతున్న నంజునాధ స్వామి ప్రోద్బలంతోనే సిద్ధరామయ్య రాజకీయ అరంగ్రేటం చేశారు. మైసూర్ తాలూకా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గ‌త చ‌రిత్ర

  • 1968: 1968వ సంవత్సరంలో మైసూర్ ప్రాంతంలో పేరు గాంచిన సీనియర్ లాయర్ చిక్కా బోరయ్య వద్ద సిద్ధరామయ్య జూనియర్ లాయర్‌గా చేరారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు లా కాలేజ్‌లో లా బోధించారు.

సిద్ధరామయ్య సాధించిన విజయాలు

కర్ణాటక రాష్టానికి దేవరాజ్ తర్వాత సిద్ధరామయ్య మాత్రమే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన ప్రభుత్వంలోనే పేదలకు ఉచిత బియ్యం అందేలా కృషి చేశారు. 2018లో రాష్ట్ర 13వ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+