హోం
 » 
స్మృతి జుబిన్ ఇరానీ

స్మృతి జుబిన్ ఇరానీ

స్మృతి జుబిన్ ఇరానీ

న‌టి నుంచి రాజ‌కీయ నాయ‌కురాలిగా మారిన స్మృతి జుబిన్ ఇరానీ ఢిల్లీలో నివ‌సించే మ‌ధ్య‌త‌ర‌గ‌తి పంజాబీ కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి అజ‌య్ కుమార్ మ‌ల్హోత్రా పంజాబీ కుటంబానికి చెందిన‌వారు.

స్మృతి జుబిన్ ఇరానీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

న‌టి నుంచి రాజ‌కీయ నాయ‌కురాలిగా మారిన స్మృతి జుబిన్ ఇరానీ ఢిల్లీలో నివ‌సించే మ‌ధ్య‌త‌ర‌గ‌తి పంజాబీ కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి అజ‌య్ కుమార్ మ‌ల్హోత్రా పంజాబీ కుటంబానికి చెందిన‌వారు. ఆయ‌న ఒక చిన్న కొరియ‌ర్ కంపెనీని నడుపుతుండేవారు. ఆమె త‌ల్లి బెంగాల్‌కు చెందిన‌వారు. దేశంలోని ప్ర‌గ‌తిశీల భావాలు గ‌ల మ‌హిళా రాజ‌కీయ నాయ‌కుల్లో స్మృతి ఒక‌రు. తొలుత ఆమె బీజేపీ మ‌హిళా విభాగానికి నాయ‌కురాలిగా ఉండేవారు, అనంత‌రం ఆమె గుజ‌రాత్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ నాయ‌కుడు క‌పిల్ సిబ‌ల్‌పై మ‌రియు లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో రాహుల్ గాంధీపై ఆమె పోటీ చేశారు. అయితే రెండింటిలోనూ ఆమె ప‌రాజ‌యం పాల‌య్యారు. 2014 నుంచి 2016 మ‌ధ్య ఆమె కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఆమె కేంఢ‌ద్ర చేనేత శాఖా మంత్రిగా ఉన్నారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Tuesday, February 19, 2019, 12:59:48 PM [IST]

స్మృతి జుబిన్ ఇరానీ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు స్మృతి జుబిన్ ఇరానీ
పుట్టిన తేదీ 23 Mar 1976 (వ‌య‌స్సు  48)
పుట్టిన ప్రాంతం న్యూ ఢిల్లీ
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య 12th Pass
వృత్తి న‌టి
తండ్రి పేరు అజ‌య్ కుమార్ మ‌ల్హోత్రా
తల్లి పేరు శిబానీ బాగ్చీ
జీవిత భాగస్వామి పేరు జుబిన్ ఇరానీ
జీవిత భాగస్వామి వృత్తి వ్యాపార‌వేత్త
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
మతం హిందూ
శాశ్వత చిరునామా ఏ-602, నెప్ట్యూన్ అపార్ట్‌మెంట్స్‌, 4 వ క్రాస్ వీధి, లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌, ప‌శ్చిమ అంధేరీ, ముంబ‌యి
ప్రస్తుత చిరునామా బంగ్లా నెం. 28, తుగ్ల‌క్ క్రిసెంట్, న్యూ ఢిల్లీ- 110003
కాంటాక్ట్ నెంబర్ 9820075198
ఈ-మెయిల్ [email protected]
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

స్మృతి జుబిన్ ఇరానీ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹7.56 CRORE
ఆస్తులు :₹9.32 CRORE
బాధ్యతలు: ₹1.76 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

స్మృతి జుబిన్ ఇరానీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

స్మృతి ఇరానీ ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆక్సీలియం నుంచి త‌న పాఠ‌శాల విద్యను పూర్తి చేశారు. ఆ త‌ర్వాత‌ ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలోని సార్వ‌త్రిక పాఠ‌శాలలో విద్యార్థిగా న‌మోదు కాబ‌డ్డారు. క్యాన్స‌ర్ పేషేంట్స్ ఏయిడ్ అసోసియేష‌న్ మ‌రియు వాత్స‌ల్య వీధి బాలల ఫౌండేష‌న్ వంటి ఎన్నో స్వ‌చ్ఛంధ సంస్థ‌ల‌తో క‌లిసి ఆమె ప‌ని చేశారు. మాంటేకార్లో టెలివిజ‌న్ ఫెస్టివ‌ల్‌లో దేశం త‌ర‌పున‌ ప్రాతినిథ్యం వ‌హించిన తొలి భార‌తీయురాలు స్మృతి ఇరానే కావ‌డం విశేషం. యూఎస్ ఎయిడ్ వారు చేపట్టిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌- ఓఆర్ఎస్ మూడేళ్ల కార్య‌క్ర‌మానికి భార‌త‌దేశం త‌ర‌పున గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక‌య్యారు.

2007 లో స్మృతి స్వ‌యంగా పీపుల్ ఫ‌ర్ ఛేంజ్ అనే స్వ‌చ్చంధ సంస్ద‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నాసిక్‌లో క్రీడ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి ప్రోత్స‌హాకాల‌ను అంద‌జేయ‌డంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌కు స‌హాయ‌స‌హాక‌రాలందిస్తోంది. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 35 గ్రామాల్లో సంస్థ బోర్‌వెల్ పంపుల‌ను ఏర్పాటు చేసింది. 2007 లో ముంబ‌యికి వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ స‌మ‌యంలో పీపుల్ ఫ‌ర్ ఛేంజ్‌, 92.5 ఎఫ్ఎం రేడియో స్టేష‌న్‌తో క‌లిసి 10 ట‌న్నుల సామాగ్రిని పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుక‌బ‌డ్డ విద్యార్థుల ఉన్న‌త చ‌దువుల కోసం కూడా సంస్థ స్కాల‌ర్‌షిప్‌ల‌ను అంద‌జేస్తోంది. వీటితోపాటు వుమ‌న్ అండ్ వెల్త్ పేరిట మ‌హిళ‌ల్లో ఆర్థిక అక్ష‌రాస్య‌తా కార్య‌క్ర‌మాల‌ను కూడా చేపడుతోంది.

స్మృతి జుబిన్ ఇరానీ రాజకీయ జీవితం

2014
  • విప‌త్తు నిర్వ‌హ‌ణ పార్ల‌మెంట‌రీ ఫోరంలో స‌భ్యురాల‌య్యారు. దీంతోపాటు ప‌ట్ట‌ణాభివృద్ధి కాన్సులేటివ్ క‌మిటీలోనూ స‌భ్యురాలిగా నియ‌మింప‌బ‌డ్డారు.
2014
  • బొగ్గు మ‌రియు ఉక్కుపై వేసిన‌ క‌మిటీల‌లో స‌భ్యురాల‌య్యారు.
2014
  • రాయ్‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గంలో రాహుల్ గాంధీపై ఆమె పోటీ చేశారు.
2012
  • ఉగాండా రాజ‌ధాని కంపాల‌లో 126 వ‌అంత‌ర్ పార్ల‌మెంట‌రీ యూనియ‌న్‌(ఐపీయూ) స‌ద‌స్సుకు భార‌త పార్ల‌మెంట‌రీ బృందంలో స‌భ్యురాలిగా ఎంపిక‌య్యారు. మాజీ స్పీక‌ర్ శ్రీమ‌తి. మీరా కుమార్ నేతృత్వంలోని బృంద స‌భ్యురాలిగా ఆమె సద‌స్సుకు హజ‌ర‌య్యారు.
2011
  • ఆగ‌స్టు 2011 లో గుజ‌రాత్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యురాలుగా ఆమె ఎన్నిక‌య్యారు.
2010
  • బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శిగా స్మృతి ఇరానీ నియ‌మింప‌బ‌డ్డారు. వీటితోపాటు బీజేపీ మ‌హిళా విభాగం మ‌రియు బీజేపీ మ‌హిళా మోర్చా జాతీయ అధ్య‌క్షురాలిగా ఎంపిక‌య్యారు.
2009
  • విజ‌య్ గోయ‌ల్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలో రేపిస్టుల‌కు క‌ఠిన శిక్ష‌లు విధించాల‌ని స్మృతి డిమాండ్ చేశారు.
2004
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె క‌పిల్ సిబ‌ల్‌పై చాందినీ చౌక్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ, బీజేపీ కేంద్ర క‌మిటీలో ఎగ్జిక్యూటివ్ స‌భ్యురాలిగా ఆమె నియ‌మితుల‌య్యారు.
2003
  • భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌హారాష్ట్ర విభాగంలో స్మృతి ఇరానీ చేరారు. ఆ త‌ర్వాత 2004 లో ఆమె మ‌హారాష్ట్ర యువ‌జ‌న విభాగం ఉపాధ్య‌క్షురాలిగా నియ‌మింప‌బ‌డ్డారు.
27 May 2014 - 5 July 2016
  • కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మంత్రిగా తన ప‌ద‌వీ కాలంతో 2016 జూన్ నుంచి ఆరు కొత్త విశ్వ‌విద్యాల‌యాల‌లో యోగా విభాగాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు.
18 July 2017 - 14 May 2018
  • కేంద్ర స‌మాచార మ‌రియు ప్ర‌సారాల స‌హాయ(స్వ‌తంత్ర హోదా) శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
5 July 2016
  • ఎం.వెంక‌య్య నాయుడు త‌ర్వాత స్మృతి ఇరానీ కేంద్ర చేనేత శాఖ మంత్రి అయ్యారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

గ‌త చ‌రిత్ర

2012
  • 2012 లో బెంగాలీ సినిమా అమృత‌లో స్మృతి న‌టించారు. 2010 లో హిందీ సినిమా "మాలిక్ ఏక్" లో ద్వార‌కామాయి పాత్ర పోషించారు. అలాగే 2011 లో తెలుగు సినిమా "జై బోలో తెలంగాణ‌"లో కీల‌క పాత్రలో న‌టించారు.
2008
  • సాక్షి త‌న్వ‌ర్‌తో క‌లిసి యే హై జ‌ల్వా అనే నృత్య ప్ర‌ధాన‌మైన రియాలిటీ షోను నిర్వ‌హించారు. అదే ఏడాది "వారిస్" అనే కార్య‌క్ర‌మాన్ని నిర్మించారు. ఆ త‌ర్వాత 2009 లో కామెడీ షో మ‌నిబెన్‌.కామ్‌లో న‌టించారు.
2007
  • "విరుద్ధ్" అనే టీవీ సీరియ‌ల్‌ను స్మృతి ఇరానీ నిర్మించారు. ఆ సీరియ‌ల్‌లో ముఖ్య‌పాత్ర‌ను ఆమే పోషించారు. ఆ త‌ర్వాత మేరే అప్నే అనే కార్య‌క్రమాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ న‌టులు వినోద్ ఖ‌న్నా అందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. "తీన్ బ‌హురానియ‌న్‌"లోనూ ఆమె న‌టించారు.
2001
  • జీ టీవీ వారి రామాయ‌ణ్‌లో పౌరాణిక పాత్ర సీత‌గా ఆమె న‌టించారు. తోడి సీ జ‌మీన్ తోడా సా ఆస్మాన్ అనే సీరియ‌ల్‌కు స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.
2000
  • ఆతీష్ మ‌రియు హ‌మ్ హై క‌ల్ ఆజ్ ఔర్ క‌ల్ అనే టీవీ సిరీస్‌తో బుల్లితెర‌పై ఆమె అరంగేట్రం చేశారు. అనంత‌రం "క్యోంకీ సాస్ భీ క‌భీ బ‌హు థీ" సీరియ‌ల్‌లో ప్ర‌ధాన పాత్ర‌కు ఆమె ఎంపిక‌య్యారు.
1998
  • 1998 లో మిస్ ఇండియా అందాల పోటీల్లో స్మృతి ఇరానీ చివ‌రి రౌండ్ వ‌ర‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత గాయ‌కుడు మికా సింగ్ రూపొందించిన "సావ‌న్ మే ల‌గ్ గ‌యి ఆగ్" ఆల్బ‌మ్‌లోని ఒక పాట‌లో ఆమె న‌టించారు.

స్మృతి జుబిన్ ఇరానీ సాధించిన విజయాలు

ఇండియ‌న్ టెలివిజ‌న్ అకాడ‌మీ వారందించే ఉత్త‌మ న‌టి అవార్డును వ‌రుస‌గా ఏడు సంవ‌త్స‌రాలు గెలుచుకున్నారు. ఇండో అమెరిక‌న్ సొసైటీ అందించే ఉత్త‌మ అఛీవ‌ర్ అవార్డు, 2001, 2002, 2003 మ‌రియు 2005 లో ఉత్త‌మ డ్రామా న‌టిగా ఐటీఏ అవార్డును అందుకున్నారు. 2004 లోనూ ఉత్త‌మ న‌టిగా ఐటీఏ అవార్డును అందుకున్నారు. 2002 మ‌రియు 2003 లో ఇండియ‌న్ టెల్లీ ఉత్త‌మ న‌టి అవార్డుతోపాటు, 2003 లో ఉత్త‌మ టీవీ ప‌ర్స‌నాలిటీ అవార్డు చేజిక్కించుకున్నారు. 2010 లో ఐటీఏ మైల్‌స్టోన్ అవార్డును అందుకున్నారు. ప్ర‌ముఖ టీవీ ధారావాహిక క్యోంకీ సాస్ భీ కభీ బ‌హు థీ లో అద్భుత‌మైన న‌ట‌న‌కుగానూ దాదాపు అన్ని ఐటీఏ మ‌రియు టెల్లీ అవార్డుల‌ను సాధించారు. ఇవేగాక టీవీ కార్య‌క్ర‌మం విరుద్ధ్‌ లో న‌ట‌న‌కుగానూ ఇండియ‌న్ టెల్లీ ఉత్త‌మ న‌టి(జ్యూరీ) అవార్డును అందుకున్నారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X