Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుష్మా స్వ‌రాజ్

సుష్మా స్వ‌రాజ్
భార‌తీయ జ‌న‌తాపార్టీలోని ఫైర్‌బ్రాండ్ నాయ‌కుల్లో సుష్మా స్వరాజ్ ఒక‌రు. గతంలో సుప్రీం కోర్టులో న్యాయ‌వాదిగా పని చేసిన సుష్మా స్వ‌రాజ్ మే 26, 2014 నుంచి 2019 వరకు మోడీ కాబినెట్ లో విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
By Shalini | Tuesday, August 6, 2019, 11:54:05 PM [IST]

సుష్మా స్వ‌రాజ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

భార‌తీయ జ‌న‌తాపార్టీలోని ఫైర్‌బ్రాండ్ నాయ‌కుల్లో సుష్మా స్వరాజ్ ఒక‌రు. గతంలో సుప్రీం కోర్టులో న్యాయ‌వాదిగా పని చేసిన సుష్మా స్వ‌రాజ్ మే 26, 2014 నుంచి 2019 వరకు మోడీ కాబినెట్ లో విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఆమె ఏడుసార్లు పార్ల‌మెంటు స‌భ్యురాలిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అనారోగ్య కారణంగా ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అక్టోబ‌రు 13, 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ఐదవ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంతేగాక ఢిల్లీకి మొద‌టి మ‌హిళా ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర సృష్టించారు. వివిధ సామాజిక, సాంసృతిక కార్య‌క్ర‌మాల్లో ఆమె త‌రచుగా పాల్గొనే వారు.2019 ఆగష్టు 6వ తేదీన రాత్రి గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్ తుది శ్వాస విడిచారు.మృతి చెందిన నాటికి సుష్మా స్వరాజ్ వయసు 67 ఏళ్ళు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే సుష్మా... ఇక లేరు అన్న విషయాన్ని యావత్ భారత్ జీర్ణించుకోలేక పోతోంది. అంతలా ఆమె ప్రజలతో మమేకం అయ్యారు. ట్విట్టర్ లో తరుచూ ఆక్టివ్ గా వుండే సుష్మా స్వరాజ్...చివరిసారిగా మంగళవారం సాయంత్రం ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు లోక్ సభలో పాస్ కావడం పై ఆమె ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. తన జీవితంలో ఈరోజు కోసమే వేచి చూసినట్లు ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నా రు.

మరిన్ని చదవండి

సుష్మా స్వ‌రాజ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు సుష్మా స్వ‌రాజ్
పుట్టిన తేదీ 14 Feb 1952
మరణం యొక్క తేదీ 06 Aug 2019 (వ‌య‌స్సు  67)
పుట్టిన ప్రాంతం అంబాలా కంటోన్మెంట్, హ‌ర్యానా
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి న్యాయ‌వాది
తండ్రి పేరు హ‌ర్‌దేవ్ శ‌ర్మ
తల్లి పేరు ల‌క్ష్మీ దేవి
జీవిత భాగస్వామి పేరు స్వ‌రాజ్ కౌష‌ల్
జీవిత భాగస్వామి వృత్తి సుప్రీం కోర్టులో సీనియ‌ర్ న్యాయ‌వాది
సంతానం 1 కుమార్తెలు

సుష్మా స్వ‌రాజ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹7.35 CRORE
ఆస్తులు
₹7.36 CRORE
బాధ్యతలు
₹58,250.00

సుష్మా స్వ‌రాజ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఇందిరా గాంధీ త‌ర్వాత కేంద్ర విదేశీ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రిగా ప‌ని చేసిన రెండో మ‌హిళ సుష్మా స్వ‌రాజే కావ‌డం విశేషం. 2006 నుంచి 2009 మ‌ధ్య ఇండో-ఇజ్రాయెల్ పార్ల‌మెంట‌రీ స్నేహ‌బృందానికి ఆమె ఛైర్‌ప‌ర్స‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు.

సుష్మా స్వ‌రాజ్ రాజకీయ జీవితం

  • 2019: సీనియర్ బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఆగస్టు 6వ తేదీ 2019న తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. ఆమె వయసు 67 ఏళ్లు.
  • 2016 : ఫిబ్ర‌వరి 16, 2016 నాడు ఆమె కేంద్ర విదేశీ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు.
  • 2014 : మే 27, 2014 నుంచి ఫిబ్ర‌వ‌రి 16, 2016 వ‌ర‌కు ఆమె కేంద్ర విదేశీ, ప్ర‌వాస భార‌తీయ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రిగా సేవ‌లందించారు.
  • 2014 : విదిశ నుంచి మ‌రోమారు గెలిచి ఆమె 16 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె కాంగ్రెస్‌కు చెందిన ల‌క్ష్మ‌ణ్ సింగ్‌పై 4 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో నెగ్గారు.
  • 2009 : డిసెంబ‌రు 21, 2009 న సుష్మా స్వ‌రాజ్ లోక్‌స‌భ‌లో బీజేపీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత‌గా, ప్ర‌తిప‌క్ష నేత‌గా నియ‌మితుల‌య్యారు.
  • 2009 : ఆగ‌స్టు 31, 2009 నుంచి జ‌న‌వ‌రి 1, 2010 వ‌ర‌కు ఆమె విదేశీ వ్య‌వ‌హ‌రాల స్టాండింగ్ క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా వ్య‌వ‌హరించారు. సెప్టెంబ‌రు 23, 2009 నాడు ఆమె నిబంధ‌న‌ల క‌మిటీలో స‌భ్యురాలిగా నియ‌మితుల‌య్యారు. అనంత‌రం ఆమె విలువల క‌మిటీ, సాధార‌ణ ప్ర‌యోజ‌నాల క‌మిటీలో స‌భ్యురాల‌య్యారు.
  • 2009 : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని విదిశ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌రాజ్ 15 వ లోక్‌స‌భు ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన చౌద‌రీ మున‌బ్బ‌ర్ స‌లీంపై 48,931 ఓట్ల తేడాతో నెగ్గారు.
  • 2008 : 2008 మే నుంచి 2009 వ‌ర‌కు రాజ్య‌స‌భ హౌజ్ క‌మిటీలో స‌భ్యురాలిగా సేవ‌లందించారు.
  • 2006 : మూడోసారి ఆమె రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2006 మే నుంచి 2009 వ‌ర‌కు జ‌నాభా ప్రజారోగ్యంపై నియ‌మించిన పార్ల‌మెంట‌రీ ఫోరంలో స‌భ్యురాలిగా ప‌ని చేశారు.
  • 2004 : ఆగ‌స్టు 2004 నుంచి 2009 మ‌ధ్య హోం వ్య‌వ‌హ‌రాల స్టాండింగ్ క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా రాజ్య‌స‌భ‌లో బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ, సాధార‌ణ ప్ర‌యోజ‌నాల క‌మిటీలో స‌భ్యుడిగా సేవ‌లందించారు. సెప్టెంబ‌రు 2004 నుంచి 2009 వ‌ర‌కు రాజ్య‌స‌భ‌లో విలువ‌ల కమిటీ స‌భ్యురాలిగా అక్టోబ‌రు 2004 నుంచి 2009 వ‌ర‌కు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ క‌మిటీలో స‌భ్యురాలిగా ప‌ని చేశారు.
  • 2003 : జ‌న‌వ‌రి 29, 2003 నుంచి మే 22, 2004 వ‌ర‌కు ఆమె కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రిగా ప‌ని చేశారు.
  • 2000 : రాజ్య‌స‌భ‌కు ఆమె రెండోసారి ఎన్నిక‌య్యారు. త‌ర్వాత కేంద్ర స‌మాచార, ప్ర‌సార శాఖ మంత్రిగా సెప్టెంబ‌రు 30, 2000 నుంచి జ‌న‌వ‌రి 29, 2003 వ‌ర‌కు కొన‌సాగారు.
  • 1998 : అక్టోబ‌రు 13, 1998 నాడు ఆమె ఢిల్లీ జాతీయ రాజ‌ధాని ప్రాదేశిక ప్రాంతానికి(ఎన్‌.సీ.టీ) ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ ప‌ద‌విలో ఆమె డిసెంబ‌రు 3, 1998 వ‌ర‌కు కొన‌సాగారు.
  • 1998 : ద‌క్షిణ ఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి నెగ్గి 12 వ లోక్‌స‌భ‌కు ఆమె ఎన్నిక‌య్యారు. అనంత‌రం కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌ల‌తో పాటు అద‌నంగా టెలి క‌మ్యూనికేష‌న్ల మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
  • 1996 : 1996 నుంచి 98 వ‌ర‌కు ర‌క్ష‌ణ శాఖ స్టాండింగ్ క‌మిటీ స‌భ్యురాలిగా, నావికాద‌ళ ఆధునీకీక‌ర‌ణ‌పై ఏర్పాటైన స‌బ్ క‌మిటీ ఛైర్‌ప‌ర్స్‌న్‌గా, ప్రివిలేజేస్ క‌మిటీ స‌భ్యురాలిగా ఆమె ప‌ని చేశారు.
  • 1996 : ద‌క్షిణ ఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె 11 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కేంద్ర స‌మాచారం ప్ర‌సారాల శాఖ మంత్రిగా ఆమె సేవ‌లందించారు.
  • 1994 : రాజ్య‌స‌భ‌లో పిటీష‌న్ల క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా రెండు సంవ‌త్స‌రాల‌పాటు ఆమె సేవ‌లందించారు.
  • 1992 : 1992 నుంచి 94 మ‌ధ్య ఆమె కేట‌రింగ్ సంయుక్త క‌మిటీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా, రాజ్య‌స‌భ‌లో ప్ర‌భుత్వ హామీల క‌మిటీలో స‌భ్యురాలిగా వ్య‌వ‌హ‌రించారు.
  • 1990 : ఆమె రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
  • 1977 : హ‌ర్యానా ప్ర‌భుత్వంలో ఆమె కార్మిక, ఉద్యోగ క‌ల్ప‌న శాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు. 1987 లో హ‌ర్యానా ప్ర‌భుత్వంలో ఆమె మ‌రోసారి విద్యా, ఆహారం, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి అయ్యారు.
  • 1977 : అంబాలా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె రెండు సార్లు హ‌ర్యానా శాస‌న‌స‌భ‌లో ప్రాతినిథ్యం వ‌హించారు.

గ‌త చ‌రిత్ర

  • 1973: 1973 లో సుష్మా స్వ‌రాజ్ సుప్రీం కోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీసును ప్రారంభించారు.
  • 1969-70: హ‌ర్యానా రాష్ట్రంలో వ‌రుస‌గా మూడు సార్లు, పంజాబ్ విశ్వ‌విద్యాల‌యంలో ఒక‌సారి ఉత్త‌మ వ‌క్త‌గా సుష్మా స్వ‌రాజ్ ఎంపిక‌య్యారు. అంబాలా కంటోన్మెంట్‌లోని ఎస్‌.డీ. కాలేజీలో ఉత్త‌మ ఎన్‌సీసీ క్యాడెట్ అవార్డును ఆమె మూడుసార్లు అందుకున్నారు. దీంతోపాటు ఎస్‌.డీ. కాలేజీలోనే ఉత్త‌మ విద్యార్థి అవార్డుతో పాటు బంగారు ప‌త‌కాన్ని కూడా సాధించారు.

సుష్మా స్వ‌రాజ్ సాధించిన విజయాలు

1977 లో అతి చిన్న వ‌య‌సులోనే హ‌ర్యానా మంత్రిగా బాధ్య‌త‌లు స్వీకరించారు. బ్ర‌స్సెల్స్‌, బెల్జియం, జెనీవాలో జ‌రిగిన అంత‌ర్ పార్ల‌మెంట‌రీ స‌ద‌స్సుకు భార‌త పార్ల‌మెంట‌రీ బృందంలో స‌భ్యురాలిగా ఉన్నారు. దీంతోపాటు ఫిజీలో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ పార్ల‌మెంట‌రీ అసోసియేష‌న్ స‌ద‌స్సులో పాల్గొన్నారు.

వీటితోపాటు (i) ఢాకాలో జ‌రిగిన సార్క్ టెలిక‌మ్యూనికేష‌న్ మంత్రుల స‌దస్సు, (ii) ఇస్లామాబాద్‌లో జ‌రిగిన సార్క్ స‌భ్య స‌మాచారం, ప్ర‌సార శాఖ మంత్రుల స‌ద‌స్సు, (iii) కొలంబోలో నిర్వ‌హించిన సార్క్ స‌భ్య‌దేశాల టెలీ క‌మ్యూనికేష‌న్ మంత్రుల స‌ద‌స్సు లో ఆమె పాల్గొన్నారు. ఆమె భ‌ర్త భార‌త‌దేశంలో ఒక రాష్ట్రానికి అతి చిన్న వ‌య‌సులోనే గ‌వ‌ర్న‌ర్‌గా నియమితుల‌య్యారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్ర‌త్యేక‌మైన జంట‌గా వారివురు పేర్లు న‌మోదు చేయ‌బ‌డ్డాయి.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+