హోం
 » 
తరుణ్ గోగొయ్

తరుణ్ గోగొయ్

తరుణ్ గోగొయ్

తరుణ్ గోగొయ్. 1934 అక్టోబరు 11న జన్మించారు.

తరుణ్ గోగొయ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

తరుణ్ గోగొయ్. 1934 అక్టోబరు 11న జన్మించారు. ఈయన 2001వ సంవత్సరం నుంచి 2016వరకూ అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించి మూడు
సార్లు విజయం సాధించారు. రంగాజన్ నిమ్న బునియాడి విద్యాలయ పాఠశాలలో ఆయన ప్రాథమిక విధ్యాభ్యాసం పూర్తి చేశారు. అస్సాంలోని గువాహటి విశ్వవిద్యాలయం నుంచి 1963లో ఎల్ఎల్‌బీ పట్టా పొందారు. డాలో గొగొయ్‌ను 30 జూలై 1972లో వివాహమాడి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. వారికి ఉన్న ఇద్దరు పిల్లల్లో గౌరవ్ గోగొయ్ కొడుకు, చంద్రిమ గోగొయ్ కూతురు. గోగొయ్ రాజకీయ జీవితం 1968లో మొదలైంది. జోరాట్ మునిసపల్ బోర్డు సభ్యునిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో గోగొయ్ ఐదో సారి లోక్ సభ ఎన్నికల్లో 1971లో గెలుపొందారు. తరుణ్ గోగొయ్ 2001 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో తితాబర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తత్పలితంగా తొలి సారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2016వ సంవత్సరం బీజేపీ చేతుల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓడిపోవడంతో గొగొయ్ పదవీచ్యుతులైయ్యారు. గోగొయ్ లోక్ సభ నుంచి ఆరు సార్లు (1971-85) జోరాట్ నియోజకవర్గం నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్(ఎంపీ)గా గెలుపొందారు. ఆ తర్వాత కలిబార్ నియోజకవర్గం నుంచి (1991-96/1998-2002)గెలుపొందారు.

మరిన్ని చదవండి
By Srinivas G Updated: Monday, December 31, 2018, 03:39:42 PM [IST]

తరుణ్ గోగొయ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు తరుణ్ గోగొయ్
పుట్టిన తేదీ 11 Oct 1934
మరణం యొక్క తేదీ 23 Nov 2020 (వ‌య‌స్సు  86)
పుట్టిన ప్రాంతం రంగమతి, జోరాట్
పార్టీ పేరు Indian National Congress
విద్య Graduate Professional
వృత్తి రాజకీయ నాయకుడు
తండ్రి పేరు డా. కమలేశ్వర్ గోగొయ్
తల్లి పేరు ఉషా గోగొయ్
జీవిత భాగస్వామి పేరు డాలీ గొగొయ్
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
శాశ్వత చిరునామా Reg.- నజీరలి, PO- జోరాట్, PIN No- 785001, జిల్లా- జోరాట్ అస్పాం
ప్రస్తుత చిరునామా స్టేట్ గెస్ట్ హౌజ్ నెం.-1, ఖానాపరా, గువాహటి. కాంటాక్ట్ నెం.-0361-2360291
కాంటాక్ట్ నెంబర్ 0361-2361112, 9678002244
ఈ-మెయిల్ [email protected]
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

తరుణ్ గోగొయ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹5.35 CRORE
ఆస్తులు :₹5.55 CRORE
బాధ్యతలు: ₹19.4 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

తరుణ్ గోగొయ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

గోగొయ్ దైనందిన జీవితంలో రాజకీయాలపైనే కాకుండా ఇతరాసక్తులు ఉన్నాయి. ఆయనకు పుస్తక పఠనం, మొక్కల పెంపకమంటే ఇష్టం. వీటితో పాటుగా క్రీడలు(క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్)వంటి వాటిలోనూ ఆసక్తి కనబరిచేవారు. వీటితో పాటుగా గోల్ప్ ఆడటమంటే గోగొయ్‌కు చాలా ఇష్టం. ఆల్ అస్సాం పరిజత్ & చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్స్‌కు ట్రెజరర్‌గా వ్యవహరించారు. దాంతో పాటుగా భరత్ యువక్ సమాజ్‌కు కూడా ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అస్సాం రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఘనత గోగొయ్‌కే దక్కింది. మూడు సార్లు లెజిస్లేటివ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.

తరుణ్ గోగొయ్ రాజకీయ జీవితం

2016
  • 2016వ సంవత్సరం బీజేపీ చేతుల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓడిపోవడంతో గొగొయ్ పదవీచ్యుతులైయ్యారు.
2011
  • 2011 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి గెలుపొంది మూడో సారి ముఖ్యమంత్రి సేవలను కొనసాగించారు.
2006
  • తరుణ్ గోగొయ్ 2006 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి గెలుపొంది రెండో సారి ముఖ్యమంత్రి సేవలను కొనసాగించారు.
2001
  • తరుణ్ గోగొయ్ 2001 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో తితాబర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తత్పలితంగా తొలి సారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
1999
  • మరోసారి లోక్ సభ (ఆరో సారి) ఎన్నికలలో గెలుపొందారు..
1998
  • మరోసారి లోక్ సభ (ఐదో సారి) ఎన్నికలలో గెలుపొందారు..
1997
  • అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి మార్గెరిటా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
1993-1995
  • ఆహారోత్పత్తుల శాఖకు రాష్ట్ర మంత్రిగా (స్వతంత్య హోదా)లో నియమితులయ్యారు.
1991-1993
  • ఆహార సంబంధిత శాఖకు రాష్ట్రమంత్రిగా (స్వతంత్ర్య హోదా)నియమింపబడ్డారు.
1985
  • ఆ తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జనరల్ సెక్రటరీ హోదాను దక్కించుకున్నారు.
1976
  • తరుణ్ గోగొయ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
1971
  • ఇందిరా గాంధీ నేతృత్వంలో గోగొయ్ ఐదో సారి లోక్ సభ ఎన్నికల్లో 1971లో గెలుపొందారు.
1968
  • గోగొయ్ రాజకీయ జీవితం 1968లో మొదలైంది. జోరాట్ మునిసపల్ బోర్డు సభ్యునిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

తరుణ్ గోగొయ్ సాధించిన విజయాలు

గోగొయ్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రాన్ని సుసంపన్నంగా ఉంచేందుకు ప్రయత్నించారు. 85లక్షలకు పైగా జనాభాకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన నేతృత్వంలోనే అస్సాం బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న రాష్ట్రంగా అవార్డును దక్కించుకుంది. పదో తరగతి 60శాతం మార్కులతో పాసైన విద్యార్థులకు ఉన్నత చదువులకు ప్రోత్సాహకంగా ల్యాప్‌టాప్‌లు అందజేసే పథకం గోగొయ్ నాయకత్వం నుంచే మొదలైంది. ఉన్నత చదువులకు వెళ్లే బాలికలు (హైస్కూలు విద్యార్థినులకు) ఉచిత సైకిళ్లను అందజేసే పథకాన్ని తరుణ్ చేతులమీదుగానే ఆరంభించారు.
ఆయన నాయకత్వంలోనే అస్సాం రాష్ట్రంలో 33వ జాతీయ క్రీడల పోటీలు 2007లో జరిగాయి.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X