Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి

విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి
భారతీయ జనతా పార్టీ తరపున భారత రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తోన్న వారిలో విజయ్ రామ్‌నిక్లాల్ రూపాణి ఒకరు. 2016 ఆగష్టు 7వ తేదీ నుంచి ఈయన గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
By Moumi Majumdar | Monday, December 31, 2018, 04:40:35 PM [IST]

విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

భారతీయ జనతా పార్టీ తరపున భారత రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తోన్న వారిలో విజయ్ రామ్‌నిక్లాల్ రూపాణి ఒకరు. 2016 ఆగష్టు 7వ తేదీ నుంచి ఈయన గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ రాజ్‌కోట్ అసెంబ్లీ నుంచి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈయన బర్మాలోని రంగూన్‌లో జన్మించారు. 1960వ సంవత్సరంలో కుటుంబమంతా రాజ్‌కోట్‌కు వలసవెళ్లారు. ధర్మేంద్ర సిన్హ్ జీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్, సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టాలు పొందారు. చదువు ఆఖరి రోజుల్లో ఉండగా అఖిల భారత విద్యా పరిషత్‌లో చేరారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్‍‌లో చేరారు.

మరిన్ని చదవండి

విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి
పుట్టిన తేదీ 02 Aug 1956 (వ‌య‌స్సు  69)
పుట్టిన ప్రాంతం రంగూన్, బర్మా
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి రాజకీయం, వ్యాపారం
తండ్రి పేరు రామ్‌నిక్లాల్ రూపాణి
తల్లి పేరు Mayaben Rupani
జీవిత భాగస్వామి పేరు అంజలి రూపాణి
జీవిత భాగస్వామి వృత్తి వ్యాపారం
సంతానం 2 కుమారులు 1 కుమార్తెలు
మతం జైను
వెబ్‌సైట్ www.vijayrupani.in

విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹8.26 CRORE
ఆస్తులు
₹9.09 CRORE
బాధ్యతలు
₹83.01 LAKHS

విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ చేయడం ఆయన హాబీలలో ముఖ్యమైనవి. శ్రీ నరేంద్ర మోడీ ఈయనకు ఫేవరేట్ రాజకీయ నాయకుడు. 1976వ సంవత్సరంలో భుయ్, భావ్ నగర్ ప్రాంతాలలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో చేసిన పనులకు 11నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు.

విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి రాజకీయ జీవితం

  • 2017: 2017 డిసెంబరు 22న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ బాధ్యతలు అందుకున్నారు.
  • 2017: మరోసారి గుజరాత్ అసెంబ్లీకి పశ్చిమ రాజ్‌కోట్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచారు. ఇలా తన ముఖ్యమంత్రి పదవిని కొనసాగించారు.
  • 2016: గుజరాత్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా 2016 ఆగష్టు7న ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు అందుకున్నారు.
  • 2015: మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ క్యాబినేట్‌లో స్థానం పొందడమే కాకుండా రవాణా, నీటి సరఫరాల శాఖకు, కార్మిక ఉపాధి శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2014: 2014 అక్టోబరు 19న పశ్చిమ రాజ్‌కోట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. వాజుభాయ్ వాలా రాజీనామా తర్వాత గుజరాత్ అసెంబ్లీలో సీటు ఖాళీ అవడంతో ఈయన పోటీ చేసేందుకు వీలు కుదిరింది.
  • 2013: గుజరాత్ మునిసిపల్ ఫైనాన్స్ బోర్డుకు చైర్మన్‌గా పదవిని చేపట్టారు.
  • 2006: 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అదే 2006వ సంవత్సరం నుంచి గుజరాజ్ టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్‌గానూ కొనసాగారు.
  • 1998: గుజరాత్ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. దాంతో పాటుగా 1998 నుంచి 2002 వరకు ఆయన గుజరాత్ ప్రభుత్వ 'మ్యానిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కమిటీ' ఛైర్మన్ గా ఆయన విధులు నిర్వహించారు.
  • 1995: రూపాణి మరోసారి రాజ్‌కోట్ మున్సిపల్ కార్పోరేషన్‌కు ఎన్నికై మేయర్‌గా ఆయన సేవలను 1996 నుంచి 1997.వరకూ పనిచేశారు.
  • 1987: రాజ్‌కోట్ మున్సిపల్ కార్పోరేటర్‌గా మరియు డ్రైనేజీ కమిటీకి ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు. 1988 నుంచి 1996 వరకు ఆర్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు.
  • 1978: 1981 వరకు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా పని చేశారు.
  • 1976: ఎమర్జెన్సీ సమయంలో ఎంఐఎస్ఏ చట్టం కింద 11నెలల పాటు ఆయన జైలు జీవితం గడిపారు.
  • 1971: ఆ తరువాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో., జన సంఘ్ లలో కూడా ఆయన చేరారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉంటూ ఆయన సేవలను అందిస్తున్నాడు.
  • 1970: అఖిల భారత విద్యా పరిషత్ లో ఉద్యమకారునిగా విజయ్ రూపానీ చేరారు.

విజయ్ కుమార్ రామ్‌నిక్లాల్ రూపాణి సాధించిన విజయాలు

అతని సహచరులతో ఏ పొరపచ్చాలు లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో మెలుగుతారు. గుజరాత్ రాజకీయ ప్రస్తానంలో ఎటువంటి ఆరోపణలు లేకుండా మెరుగైన పాలనను అందిస్తున్నారు. ఈయన పాలనలోనే 6000 గ్రామాలను డిజిటల్ హైవేకు అనుసంధానించారు. ఉజాలా యోజన పథకం అభివృద్ధి క్రమంలో ఎల్ఈడీ బల్పుల రేట్లను తగ్గించడమే కాకుండా, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, ఎల్ఈడీ ఫ్యాన్లకు అక్కడి ప్రాంతంలో వినియోగదారులు పెరిగేలా దోహదపడ్డారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+