హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు రోజుల పాటు నగర వాసులను, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లను అలరించిన ఫోటో ఎక్స్‌పో 2016 ఆదివారంతో ముగియనుంది. నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లోమూడు రోజుల ఫొటో ఎక్స్‌పోను సినీ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ సంస్ధలతో పాటు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విక్రమ సంస్ధలు దాదాపు 100 స్టాల్స్‌లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. ప్రదర్శనలో సాఫ్ట్‌వేర్‌ల నుంచి ప్రింటింగ్ వరకు, ఫ్లాష్ లైట్స్ మొదలు డ్రోన్ కెమెరాల వరకు ఫొటోగ్రఫీ రంగానికి చెందిన సకల ఉత్పత్తులు కొలువుదీరి సందర్శకులను ఆకుట్టకుంటున్నాయి.

వందలాది స్టాల్స్‌లో ఫొటో, వీడియోగ్రఫీకి సంబంధించిన వేలాది ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయి. సోనీ, నికాన్, కెనాన్, పానసోనిక్ వంటి ప్రముఖ సంస్థల లేటెస్ట్ ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి.
చివరి రోజు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వహకులు రమణ కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటోగ్రఫీ అంటే తీపి జ్ఞాపకాలను పదిలపరిచే మాధ్యమం. అది వర్తమానాన్ని భవిష్యత్తుకు అందిస్తుంది. టెక్నాలజీ అభివృద్ధితో కొత్త కొత్త ఉత్పత్తులు వెలువడుతున్నాయన్నారు. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అయినా, ట్రావెల్ ఫొటోగ్రఫీ అయినా, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అయినా, హెరిటేజ్ ఫొటోగ్రఫీ అయినా మధురానుభూతిని మీ సొంతం చేస్తుంది.

ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, బ్రాడ్‌కాస్ట్ రంగాల్లో వస్తున్న నూతన ఒరవడులను, మార్కెట్ ట్రెండ్‌ను, బిజినెస్ టెక్నిక్స్, ఉత్పత్తుల పనితీరును తెలుసుకునేందుకు, కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అన్ని విభాగాలు ఒక గొడుగు కింద కొలువుతీరాయి.

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం


వీడియోగ్రఫీ రంగంలో సంచలనంగా మారిన డ్రోన్ టెక్నాలజీలో అధునాతన కెమెరాలు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్‌కి అమర్చిన కెమెరా ఆధారంగా చిత్రించే అవకాశం గల ఈ ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. భారీ ర్యాలీలు, బహిరంగ సభలు, జనసందోహం గల ఉత్సవాలను ప్రస్తుతం డ్రోన్ కెమెరాలతోనే చిత్రిస్తుండడం గమనార్హం. హై క్వాలిటీ అవుట్ ఇచ్చే ఈ కెమెరాలు రూ. 2లక్షలు నుంచి లభిస్తున్నాయి.

 ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం


ప్రదర్శనలో కెమెరా బ్యాటరీలు మొదలు స్టూడియో సెటప్‌ల వరకు అన్ని ఉత్పత్తులు కొలువుదీరాయి. పెద్ద పెద్ద కార్యక్రమాల్లో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ కోసం వినియోగించే ఫోకస్ ల్యాంప్స్, స్టూడియో లైట్స్, లైట్ టెంట్, ప్రో టేబుల్, పానెల్ డిఫ్యూసర్, మొబైల్ ఆర్మ్ స్టాండ్ ఉత్పత్తులు, చిత్ర నిర్మాణంలో వినియోగించే క్రేన్స్, స్పెషల్ లైట్ ఎఫెక్ట్స్ , ట్రైపాడ్స్, పవర్ ప్యాక్ హెడ్స్, అంబరిల్లాస్, రిఫ్లెక్టర్స్ వందలాదిగా ప్రదర్శనలో కొలువుదీరాయి.

 ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం


చేతిలో కెమెరా ఉన్నంతమాత్రాన ఫొటోగ్రాఫర్ కాలేరు. క్వాలిటీ చిత్రాలు తీయాలంటే... ప్రొఫెషనల్‌గా తయారవ్వాల్సిందే. వాతావరణం, లైటింగ్, పరిస్థితులకు అనుగుణంగా అందమైన ఫొటోగ్రఫీ కోసం సపోర్టింగ్ మెటీరియల్ తప్పనిసరి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లకు కెమెరాతో పాటు అవసరమైన అన్ని సపోర్టింగ్ ఉత్పత్తులను ప్రదర్శనలో కొనుగోలు చేసుకోవచ్చు.

 ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం


క్వాలిటీ కెమెరా, వీడియో బ్యాగ్‌లు, టెలీ లెన్స్, ఫ్లాష్ లైట్స్, ఎల్‌సీడీ కవర్స్, లెన్స్ క్యాప్, బ్యాటరీగ్రిప్, క్లీనింగ్ కిట్, ఫొటో జాకెట్, ట్రై పాడ్, మోనోపాడ్ వంటి అన్ని రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో కొనుగోలు చేసుకోవచ్చు.

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

అందమైన ఆల్బమ్‌లో ఫొటోలను చూసుకుంటూ మురిసిపోతున్న జనాలకు... సరికొత్త ప్రింటింగ్ టెక్నాలజీని పరిచయం చేస్తోంది క్లోనిఫై డాట్ మి. పేపర్ మీద, కార్ట్ మీద ప్రింట్ చేసే ఫొటోల స్థానంలో ఇప్పుడు ఏకంగా చిట్టి చిట్టి బొమ్మల్నే రూపొందిస్తోంది క్లోనిఫై. స్టూడియోలో ఒక వ్యక్తిని నాలుగు వైపులా స్కాన్ చేసి, అతని లేదా ఆమె రూపాన్ని చిన్న చిన్న ప్రతిమలుగా అచ్చువేస్తుంది.
 ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం


ఈ పద్దతి ద్వారా మీ ఆప్తుల విగ్రహాలను తయారు చేయించి వారికే బహుకరించవచ్చు. లేదా మీకు ఇష్టమైన వాళ్ల బొమ్మలను మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. టెక్నాలజీలో అత్యాధునిక మార్పులకు సంకేతం ఈ పద్ధతి. ప్రతిమ సైజును బట్టి చార్జి చేస్తారు. ప్రారంభ ధర రూ. 4వేలు ఉంటుంది.

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో అనగానే.. కావలసిన సైజులో ప్రింట్ చేయించుకోవడం, ఫ్రేమ్ కట్టించుకోవడం తెలుసు. కానీ ఫొటో ఎగ్జిబిషన్‌లోని స్టాల్స్‌లో పర్సనలైజ్డ్ ప్రింటింగ్ చేయించుకోవచ్చు. కీ చైన్‌లు, వాల్ క్లాక్స్, సెల్ ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, టీ కప్పులు మొదలు విభిన్నమైన ఫొటో ఫ్రేములకు తగిన రీతిలో మీ ఛాయాచిత్రాలను ప్రింట్ చేయించుకోవచ్చు.
 ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం


ఉదయాన్నే మీ చేతిలోకి తీసుకునే కాఫీ కప్పుపై మీ ఫొటోనే కనిపిస్తుంది. మీరు ఆఫీసుకు తీసుకెళ్లే ల్యాప్‌ట్యాప్‌పై, మీ మొబైల్ ఫోన్‌పై ఎక్కడైనా సరే.. మీకు నచ్చిన చిత్రాన్ని, మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల చిత్రాలను ప్రింట్ చేయించుకోవచ్చు.

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం

ఫొటో ఎక్స్‌పో: తీపి జ్ఞాపకాలు పదిలం


ప్రేమగా వారికి బహుకరించవచ్చు. సైజ్, ప్రొడక్ట్‌ని బట్టి చార్జీలు ఉంటాయి. రూ. 50 నుంచి రూ. 2000 వరకు వెచ్చించి మీకు నచ్చిన వస్తువులపై మీ ఫొటోలను ముద్రించుకోవచ్చు. ఫొటో స్టూడియోలైతే.. ప్రింటింగ్ మిషన్‌ను కూడా ఎగ్జిబిషన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు.

English summary
photo expo 2016 held at hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X