వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడుకే ఛాన్స్: టితో కెసిఆర్‌ను కొట్టలేని కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

తెలంగాణను ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధి పొందుతామనుకున్న అధికార కాంగ్రెసు పార్టీ అంచనాలు తలకిందులు కానున్నాయట. తెలంగాణను ఏర్పాటు చేసినప్పటికీ ఎపిలో కాంగ్రెసు పార్టీ 26 స్థానాలను కోల్పోనుందట. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి లాభపడనుందట. వచ్చే ఎన్నికల్లో మూడో ఫ్రంట్‌కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, ఎపిలో కాంగ్రెసు కేవలం ఏడు సీట్లను మాత్రమే గెలుచుకోనుందని ఇండియాటుడే - సి ఓటరు సర్వేలో వెల్లడైంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే యూపిఏ 122 స్థానాలు కోల్పోతుందని అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయించినా ఎపిలో కాంగ్రెసుకు అనుకూల ఫలితాలు రావని వెల్లడైంది. ఆ పార్టీ ఏడు స్థానాలకే పరిమితం కానుంది. మొత్తం 28 రాష్ట్రాలలో 15,815 మంది అభిప్రాయం తీసుకున్నారు. సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

Losses to UPA, no gain for NDA: Survey

ప్రస్తుతం యూపిఏకు 259 స్థానాలు ఉండగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే 137కు పడిపోతుంది. ఎన్డీయే కూడా నాలుగు స్థానాలు కోల్పోయి 155 స్థానాలకు పరిమితమవుతుంది. యూపిఏ కోల్పోనున్న స్థానాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు దక్కనున్నాయి. ఇతర పార్టీలకు 251 సీట్లు దక్కవచ్చు. తద్వారా మూడో ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నించవచ్చు. ఓట్ల శాతానికి వస్తే యూపిఏ 28 శాతానికే పరిమితం కాగా, ఎన్డీయే 32 శాతం ఓట్లు తెచ్చుకోనుంది.

గుజరాత్‌లో బిజెపి 25 గెలుచుకుంటే కాంగ్రెసు కేవలం ఐదింట్లో మాత్రమే గెలువనుంది. కర్నాటకలో బిజెపి పన్నెండు స్థానాలు కోల్పోగా, కాంగ్రెసు లబ్ధి పొందనుంది. యూపిలో ఎస్పీ, బిఎస్పీలే అత్యధిక స్థానాలు గెలుచుకోనున్నాయి. కాంగ్రెసు నష్టపోనుంది. బిజెపి కొంత మెరుగుపర్చుకోనుంది. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెసు, మహారాష్ట్రలో శివసేన ముందంజలో ఉండగా, కాంగ్రెసు దెబ్బతిననుంది. బీహార్‌లో బిజెపి-జెడి(యు) తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా రెండు పార్టీలు నష్టపోగా ఆర్జేడి లబ్ధి పొందనుంది.

ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది. చత్తీస్‌గఢ్‌లో బిజెపి, కాంగ్రెసులు నువ్వానేనా అనే విధంగా ఉన్నప్పటికీ మరోసారి రమణ్ సింగ్‌కు అవకాశాలు లేకపోలేదు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు 57 శాతం మంది పట్టం కట్టారు. ఇక్కడ మరోసారి బిజెపి ప్రభుత్వానికే అవకాశమున్నప్పటికీ ఇరవై ఒక్క సీట్లను కాంగ్రెసుకు కోల్పోనుంది.

English summary

 The Survey revealed that Congress will be in huge loss if General Election happens. Surprsisingly, voters are no in favour of BJP either.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X