హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తర్నాకాలో ఒయు విద్యార్థుల దాడులు: లాఠీచార్జీ, అరెస్టులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి అట్టుడుకుతోంది. ఒయు విద్యార్థులు గురువారం మధ్యాహ్నం తార్నాకాలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. విద్యార్థులు దుకాణాలపై, ఆర్టీసి బస్సులపై, ఇతర వాహనాలపై దాడులు చేశారు. ఆరాధన థియేటర్ పై కూడా రాళ్లతో దాడులు చేశారు. విద్యార్థుల రాళ్ల దాడుల్లో కొన్ని బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

లాఠీచార్జీలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ర్యాలీలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై రాత పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత రెండు రోజులుగా తీవ్ర ఆందోళనలకు దిగారు. డిజిపి అరవింద రావుపై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ ను ఫ్రీజోన్ నుంచి మినహాయించాలని, హైదరాబాద్ ను ఆరో జోన్ లో భాగం చేయాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ జరిగే వరకు ఎస్సై పోస్టుల భర్తీని ఆపేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X