హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అంశం: కాంగ్రెసు అధిష్టానంపై ముప్పేట దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధిష్టానం ముప్పేట దాడిని ఎదుర్కుంటోంది. సమస్యను ఇంకా ఎంతో కాలం నాన్చలేని పరిస్థితి ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై స్పష్టంగా ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటేనే సమస్య తేలుతుంది. ముఖ్యంగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. తాత్కాలికంగా మార్చి 1వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కానీ మార్చి 1వ తేదీ తర్వాత ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే, ఈ నెల 17వ తేదీ నుంచి తెంలగాణలో ఉద్యోగులు సహాయ నిరాకరణ సాగిస్తున్నారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మార్చి 1వ తేదీన తెలంగాణ జెఎసి రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని మునుపటిలా ఆషామాషీగా తీసుకునే పరిస్థితి లేదు. పోలీసు బలగాలతో అణచివేసే వాతావరణం కూడా లేదు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకత్వం కూడా ఆందోళన ఉధృతిని పెంచడానికి ప్రయత్నిస్తోంది.

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా తెరాస, తెలుగుదేశం పార్టీలతో ఉద్యమంలో పోటీ పడేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ఒక రకంగా చూస్తే ప్రతిపక్షాలకు చెందిన నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. అలా వ్యవహరించాల్సిన అనివార్యతలో వారు పడ్డారు. ఇప్పటికే తెరాస సభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యుల వల్ల శాసనసభా కార్యక్రమాలు ఈ నెల 17వ తేదీ నుంచి స్తంభిస్తున్నాయి. గవర్నర్ ప్రసంగాన్ని, రాష్ట్ర బడ్జెట్‌ను ఏదో విధంగా ప్రతిపాదించామని ప్రభుత్వం అనిపించుకుంది. కానీ శాసనసభ సమావేశాలు కొనసాగే పరిస్థితి లేదు.

దానికితోడు, పార్లమెంటు సమావేశాలు కూడా స్తంభించే పరిస్థితి వచ్చింది. మూడు పార్టీల నుంచి కూడా కాంగ్రెసు అధిష్టానం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటోంది. సమైక్యాంధ్రకు ఎంతగా ప్రయత్నాలు సాగిస్తున్నా సీమాంధ్ర నాయకులు తెలంగాణ ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎలా అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందువల్ల తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని వారు కూడా కోరుతున్నారు. ఆ వాతావరణంలో తెలంగాణ సమస్యను వాయిదా వేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లభించే అవకాశాలు కనిపించడం లేదు.

తెలంగాణ ప్రాంత నాయకులు పార్టీలకు అతీతంగా పనిచేయడం లేదు. అయితే, పార్టీలపరంగానే ఉద్యమం కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణ జెఎసి ఆందోళనలకు మాత్రం మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ జెఎసి ఇప్పటికీ ఒక సమన్వయ యంత్రాంగం మాదిరిగానే పనిచేస్తోంది. తెలంగాణ జెఎసి ఇప్పుడు ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకుంది. అందువల్ల తెలంగాణపై నాన్చివేత ధోరణిని కాంగ్రెసు అధిష్టానం అవలంబించే పరిస్థితి లేదు.

English summary
Telangana movement is intensifying day by day. TRS and TDP Telangana leadership are putting pressure on 
 
 government on Telangana issue. In this situation Congress Telangana parliament members, MLAs and MLCs are also 
 
 joining with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X