రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియా రంగంలోకి దిగితే చూస్తూ ఊరుకోం: పీఆర్పీ ఎమ్మెల్యే కన్నబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kanna Babu
రాజమండ్రి: కాకినాడ ప్రజల కోసం మీడియా చేస్తున్న ఉద్యమాన్ని తాము ముందుండి నడిపిస్తామని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కన్నబాబు శనివారం అన్నారు. కాకినాడ సెజ్‌కు వ్యతిరేకంగా ఎన్టీవీ, ఐన్యూస్ కలిపి చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా నాకాలపాడు గ్రామ ప్రజలు సెజ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కన్నబాబు పాల్గొని మాట్లాడారు. సీపోర్టులో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హోప్ ఐలాండ్‌లో ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రజా ఆగ్రహాన్ని ప్రభుత్వం చవి చూడవలసి ఉంటుందని హెచ్చరించారు.

మీడియా రంగంలోకి దిగితే తాము చూస్తూ ఊరుకోమని చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా మీడియాకు సహకరిస్తామని చెప్పారు. సీ పోర్టులో జరుగుతున్న అక్రమాలను మీడియా దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. అక్రమాలు బయట పెట్టేందుకు వారికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. కాగా కాకినాడ సెజ్‌కు వ్యతిరేకంగా బాధిత గ్రామాల ప్రజలు ఉద్యమించడానికి సిద్దమయ్యారు.

వాకాలపాడు గ్రామ ప్రజలు ఉద్యమించడానికి తీర్మానం చేసిన మాదిరిగానే 5 మండలాలలోని 70 గ్రామాల ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సెజ్‌లో భాగంగా పవర్ ప్లాంట్ ఏర్పాటును వారు వ్యతిరేకిస్తున్నారు. షిప్పింగ్ హార్బర్‌ను తరలించడంపై, హోప్ ఐలాండ్ విధ్వంసంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Prajarajyam MLA Kanna Babu supported media and public agitation against Kakinada sez. He demanded government to solve kakinada sez issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X