హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి అరెస్టు: చంద్రబాబుకు నైతిక బలం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి నైతిక విజయం లభించినట్లేనని అంటున్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమాలపై చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధపడ్డారు. గాలి సోదరుల అక్రమ తవ్వకాలపై ఆయన జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతును కూడగట్టారు. శాసనసభలో కూడా తెలుగుదేశం పార్టీ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీవ్రంగానే గళమెత్తారు. అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలోని తెలుగుదేశం బృందం ఓబుళాపురం మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించే ప్రయత్నం చేసింది.

నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ వెలుపలా, బయటా తీవ్ర పోరాటమే సాగించారు. ఈ పరిస్థితిలోనే గాలి జనార్దన్ రెడ్డి చంద్రబాబుపై, నాగం జనార్దన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో మట్టి కరిపిస్తానని గాలి జనార్దన్ రెడ్డి శపథం చేశారు. రాష్ట రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను మైనింగ్ మాఫియా భ్రష్టు పట్టిస్తోందని చంద్రబాబు ఎప్పటికప్పుడు ధ్వజమెత్తుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి సిపిఎం, సిపిఐ మద్దతు కూడా లభించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌పై సిబిఐ కేసు పెట్టడం, గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడం తమ విజయంగా చంద్రబాబు చెప్పుకునే అవకాశం ఏర్పడింది.

English summary
Karnataka ex minister Gali Janardhan Reddy arrest may boost up TDP N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X