హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సకల జనుల సమ్మెపై స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Swamy Goud
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న సకల జనుల సమ్మెపై ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మెను ఉద్యోగుల సమ్మెగా మార్చారని రాజకీయ నాయకులపై ధ్వజమెత్తారు. సమ్మె వల్ల రాజకీయ నాయకులు ఎవరూ నష్ట పోలేదని కేవలం ఉద్యోగులే నష్ట పోయారని విమర్శించారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొని కేసులు పెడితే ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందన్నారు. రాజకీయ నాయకులు ఉదయం సమ్మెలో పాల్గొంటూ సాయంత్రం సమయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులు మాత్రం బలవుతున్నారన్నారు. శనివారం ప్రభుత్వంతో జరిగే చర్చలలో పాల్గొంటామని స్పష్టం చేశారు.

కాగా సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, అజయ్ మిశ్రాతో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఉదయమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో తాము చర్చలకు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి వస్తేనే తాము చర్చలలో పాల్గొంటామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

English summary
TNGO leader Swamy Goud make wild comments today on Sakala Janula Strike. He accused political leaders attitude in strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X