హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స, కిరణ్ కుమార్ రెడ్డిలపై హైకమాండ్ సీరియస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
హైదరాబాద్: ముగ్గురు పార్టీ శాసనసభ్యులు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడాన్ని కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని నిలువరించడంలో విఫలమయ్యారంటూ అధిష్టానం పెద్దలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జూపల్లి కృష్ణారావు, రాజయ్య, సోమారపు సత్యనారాయణ కాంగ్రెసును వీడి తెరాసలోకి వెళ్తారని శనివారంనాడే అధిష్టానానికి సమాచారం అందింది. వారిని కట్టడి చేయాల్సిందిగా వెంటనే అధిష్టానం పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్సకు చెప్పినట్లు తెలిసింది.

బొత్స సత్యనారాయణ ఎంతగా చెప్పినా వారు వినలేదని తెలిసింది. ఆదివారం ఉదయం కూడా బొత్స సత్యనారాయణ వారిని ఆపేందుకు ప్రయత్నించారు. తాను ఆగేది లేదని సోమారపు సత్యనారాయణ చెప్పగా, మిగతా ఇద్దరు అందుబాటులోకి కూడా రాలేదు. దీనిపై అధిష్టానం తీవ్రంగా ప్రతిస్పందిస్తూ - తెరాస వైపు చూస్తున్న శాసనసభ్యుల వివరాలు సేకరించి, ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులను తాము కట్టడి చేయలేకపోతున్నామని, దీన్ని అధిష్టానమే చూసుకోవాలని బొత్స సత్యనారాయణ చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
It is said that Congress high command expressed anguish at CM Kiran Kumar Reddy and PCC president Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X