చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్సకు అన్ని షాపులు ఎలా కేటాయించారు?: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చిత్తూరు: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు నిబంధనలకు విరుద్ధంగా 31 మద్యం దుకాణాలు ఎలా కేటాయించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లాలో ప్రశ్నించారు. డిస్టిల్లరీ పర్మిట్లు ఇష్టారాజ్యంగా ప్రభుత్వం ఇస్తోందని విమర్శించారు. డిస్టిల్లరీ మంజూరిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ముడుపులు అందాయని ఆరోపించారు. మద్యం ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని హైకోర్టు ఆదేశాలిస్తే అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందన్నారు. కాంగ్రెసుకు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. మద్యం నియంత్రణకు టిడిపి కట్టుబడి ఉందన్నారు.

మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు మామూళ్ల మత్తులో తూగుతున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకు పోతోందన్నారు. తెలంగాణ ప్రాంతంలో తన పర్యటనను కొందరు అడ్డుకోవడం సరికాదన్నారు. వరంగల్ పర్యటన అడ్డుకుంటే ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. కాగా పిఈఎస్ మెడికల్ కళాశాలలో చంద్రబాబు ఆధునాతన ఆపరేషన్ థియేటర్ ప్రారంభించారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu questioned about PCC chief Botsa Satyanarayana's 31 liquor shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X