వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ బసపై జిల్లా మెజిస్ట్రేట్ నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగడ్‌లో గల ఓ కళాశాలలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాత్రి బస చేసినందుకు జిల్లా మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్, కాంగ్రెసు ప్రెసిడెంట్‌లకు మెజిస్ట్రేట్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు లభించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నందున నోటీసులు జారీ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్, రిటర్నింగ్ అధికారి అశుతోష్ ద్వివేది చెప్పారు.

రాహుల్ గాంధీ బస వల్ల ప్రజలు గుమికూడడంతో ఈ నెల 11వ తేదీన శిబ్లి జాతీయ పిజి కళాశాలలో విద్యా కార్యక్రమాలకు విఘాతం కలిగిందని, ఇది నిషేదాజ్ఞలను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. పదో తేదీ రాత్రి రాహుల్ గాంధీ బసపై నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనుమతి లేకుండా రాహుల్ గాంధీ ప్రసంగించడంపై కూడా వివరణ అడిగినట్లు ఆయన చెప్పారు.

English summary
Taking cognisance of AICC general secretary Rahul Gandhi's night stay at a college in Azamgarh, the district magistrate on Friday issued notices to college management, principal and district Congress president seeking their explanation on the matter within three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X