హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిండికేట్లు, ఆబ్కారీ ఆఫీసర్ల ఇళ్లలో ఎసిబి సోదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

ACB
హైదరాబాద్: లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో ఆబ్కారీ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు శనివారం ఉదయం నుంచి ఆబ్కారీ అధికారులను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, నెల్లూరు, చిత్తూరు, విజయవాడ వంటి పలు ప్రాంతాల్లో ఏక కాలంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వరంగల్ రేంజ్ సూపరింటిండెట్ మధుసూదన్ రావు ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాదులోని కొత్తపేటలో గల ఆయన ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. తాను ఎవరి వద్ద కూడా ముడుపులు తీసుకోలేదని, తనపై ఏ విధమైన రిమార్కులు లేవని అతను అంటున్నాడు. హైదరాబాదులోని నాచారంలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.

మధుసూదన్ రావు ఇంటి నుంచి ఎసిబి అధికారులు లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మధుసూదన రావు బ్యాంకు లాకర్లను తెరవడానికి ఎసిబి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మంలో నలుగురు ఆబ్కారీ అధికారులను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మధుసూదన రావు ఇంటిలోనే కాకుండా ఆబ్కారీ అధికారులు నర్సింహారావు, శంకరయ్య, నర్సింగ రావు ఇళ్లలో ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

ఖమ్మం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటిండెంట్ శంకరయ్య నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం సిండికేట్లలో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు రావడంతో ఆయన కొంత కాలంగా సెలవులో ఉన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం కోటపల్లిలోని శంకరయ్య బంధువుల ఇళ్లపై కూడా ఎసిబి అధికారులు దాడులు చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ టీచర్స్ కాలనీలోని ఖమ్మం ఎక్సైజ్ సిఐ సర్వేశ్వరనాథ్ ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హన్మకొండ అడ్వకేట్స్ కాలలీలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. విజయవాడలోని కినీరా వైన్స్‌లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.

English summary
ACB has raided excise officers houses in Hyderabad, Warangal and in other places in connection with liquor syndicates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X