హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారా చౌదరి కేసు: బంజారాహిల్స్ పోలీస్ కస్టడీకి ప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

tara chowdhary
హైదరాబాద్: ఉద్యోగాలు, సినిమా అవకాశాల పేరిట అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపిన తారా చౌదరి సహచరుడు ప్రసాద్‌ను పోలీసులు ఆదివారం తమ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. చర్లపల్లి జైలులో ఉన్న ప్రసాద్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుండి ప్రసాద్‌ను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆయనను నాలుగు రోజులు పోలీసులు విచారించనున్నారు.

కాగా హైటెక్ వ్యభిచారం సూత్రధారిగా అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరిని, ప్రసాద్‌ను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి నుంచి పలు కీలకమైన విషయాలను రాబట్టడానికి పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఆడియో రికార్డు వివరాలతో పాటు సెల్ ఫోన్ సంభాషణల వివరాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తారని అంటున్నారు.

తారా చౌదరి సెల్ డైరీని పరిశీలిస్తే దిమ్మ తిరిగే విషయాలు బయటపడుతున్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. మూడు నెలల కాలంలో తారా చౌదరి 8 వేల కాల్స్ చేసినట్లు చెబుతున్నారు. గత మూడు నెలల కాలంలో తారా చౌదరి సాగించిన సంభాషణల వివరాలను పోలీసులు పరిశీలించినట్లు చెబుతున్నారు.

తారా చౌదరితో గంటల తరబడి మాట్లాడినవారిలో ప్రముఖులే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పోలీసాఫీసర్లు అందులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎక్కువగా సంపన్నులతోనే ఆమె సంబంధాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. తారా చౌదరితో మాట్లాడినవారిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన కొంత మంది రాజకీయ నాయకులతో తారా చౌదరి గంటల తరబడి మాట్లాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక సెల్‌ఫోన్‌లో సందేశాలకు అంతే లేదని అంటున్నారు. అమ్మాయిలతో కస్టమర్ల శృంగార సంఘటనలను తారా చౌదరి రికార్డు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమెను విచారిస్తే అవి బయటకు రావచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Banjara Hills police took Tara Choudhary's 
 
 assistant Prasad in to custody on sunday. Court 
 
 ordered for police custody to actress Tara 
 
 Choudary and Prasad on Saturday. Audio tapes and 
 
 a diary recovered from Tollywood actor Tara 
 
 Choudary has created quite a flutter. The audio 
 
 was recorded on Ms Choudary’s mobile phone and 
 
 included her midnight conversations with 
 
 policemen and businessmen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X