హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్‌కు లైన్ క్లియర్: వ్యూహాత్మకంగా ముందడుగు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌కు పార్టీలో బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి వ్యూహాత్మకంగా చంద్రబాబు అడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలుగు విద్యార్థి, తెలుగు యువత విభాగాల సమావేశం జరిగింది. విద్యార్థి, యువత పర్యవేక్షణ బాధ్యత లోకేష్‌కు అప్పగించాలని చంద్రబాబును కోరుతూ సమావేశంలో తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో విజయంసాధించడానికి యువత, విద్యార్థి విభాగాల కృషిపై చర్చించారు. సమావేశంలో చేసిన తీర్మానాలను చంద్రబాబుకు అందజేస్తారు.

సోమవారం జరిగే పార్టీ విస్తృత సమావేశంలో తీర్మానాలపై చంద్రబాబు లోకేష్‌ రాజకీయ ప్రవేశంపై తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. తొలుత చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు కొందరు లోకేష్‌కు చంద్రగిరి నియోజక వర్గం బాధ్యతలు అప్పగించాలని, యువతలో అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు. అనంతరం కొందరు యువత నాయకులు సైతం లోకేష్‌రు రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరారు. ఈ డిమాండ్లపై చంద్రబాబు అటూ ఇటూ కాకుండా సమాధానం చెప్పి దాట వేశారు.

తనకు లోకేష్ చేదోడు వాదోడుగా ఉంటున్నారని, నగదు బదిలీ పథకం అతని సృష్టేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలుగు విద్యార్థి, యువత లోకేష్‌కు పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని తీర్మానించింది. లోకేష్ రాజకీయ ప్రవేశంపై అధినాయకునికి ఇష్టం లేకపోతే ఇలాంటి డిమాండ్లను మధ్యలోనే అడ్డుకునే వారని, అధినాయకుడు కోరుకుంటున్నదాన్నే యువత, విద్యార్థి నాయకులు కోరుకుంటున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. తెలుగు యువత ద్వారా లోకేశ్ టిడిపి రాజకీయాల్లో ప్రవేశిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. యువత రాష్ట్ర అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవాలని కోరారు. యువత కమిటీల నియామకంలో యువత అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉండాలని కోరారు.

English summary
It appears line is cleared for the political entry of Nara Lokesh son of Telugudesam president N Chandrababu Naidu. Telugu Yuvatha in its meeting passed a resolution for the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X