హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెళ్లనంటే వెళ్లను: తగ్గని కావూరి, జగన్ పార్టీలోకి నేనా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
హైదరాబాద్: ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు అసంతృప్తి ఇంకా చల్లారలేదు. రేపటి నుండి(గురువారం) పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు తాను హాజరు కావడం లేదని కావూరి తెలిపారు. రేపటి నుండి జరగనున్న సమావేశాలకు తాను హాజరు కావడం లేదని చెప్పారు. పార్టీ అధిష్టానం విప్ జారీ చేసినా తాను వెళ్లేది లేదని ఖరాఖండిగా చెప్పారు.

తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్నట్లుగా వచ్చిన వార్తలను కావూరి కొట్టిపారేశారు. తాను జగన్ పార్టీలోకి వెళుతున్నట్లుగా ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు. కావూరిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. లోకసభ సమావేశాలకు హాజరు కావాలని కిరణ్ కావూరిని కోరుతున్నట్లుగా సమాచారం. అయితే అందుకు కావూరి మాత్రం ససేమీరా అన్నారని తెలుస్తోంది.

కాగా రేపటి నుండి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అటు ఢిల్లీ, ఇటు హైదరాబాదులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటానని హామీ ఇస్తేనే సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్ జారీ చేసినా వెళ్లకూడదనే ఆలోచనలో ఎంపీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంపీలు తెలంగాణ కోసం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అండ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Eluru MP Kavuri Sambasiva Rao said he will not attend to winter session of Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X