హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్, కెవిపిల్ని అనడం కొందరికి నచ్చట్లేదు: యాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: తమ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావులను విమర్శించడం తమ పార్టీలోని నేతల్లో కొందరికి నచ్చడం లేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గురువారం అన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న కెవిపిని విమర్శించడంలో తప్పు లేదన్నారు.

అలాగే తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న కెసిఆర్ అంటే గౌరవం ఉందని కానీ, ఆయన విధానం తప్పని తాను చెబుతున్నానని అన్నారు. అదే కొందరికి నచ్చడం లేదన్నారు. రాజీనామాలతో తెలంగాణ రాదని, ఎన్నికలొస్తాయన్నారు. తెలంగాణ వస్తుందంటే రాజీనామా చేయవచ్చునని, ఎన్నికల కోసం ఎందుకన్నారు. చర్చలలో పట్టువిడుపులు, పోరాటంలో ఎత్తుగడలు అవసరమని యాష్కీ అభిప్రాయపడ్డారు.

ఎనిమిదేళ్లుగా తాను తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నానని చెప్పారు. తాను తెలంగాణవాదులతో, కలిసి వచ్చే పార్టీలతో కలిసి తెలంగాణ కోసం ఉద్యమిస్తానని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లాగులు తడుపుకున్న వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను అప్పటి నుండే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నానని యాష్కీ చెప్పారు.

యాష్కీ మాతోనే ఉన్నారనుకుంటున్నాం

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ తమతోనే ఉన్నాడని భావిస్తున్నామని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య వేరుగా అన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలనేది అందరి సమష్టి నిర్ణయమని చెప్పారు.

English summary
Nizamabad MP Madhu Yashki said on Thursday that the differences are there between Telangana region MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X