వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నై ప్లేయర్‌తో హోటల్లో యువతి: బాంబుపేల్చిన బింద్రా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bindra
చండీగఢ్: ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో ఓ వైపు అట్టుడుకుతోంటే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా మరో బాంబు పేల్చారు. 2010లో శ్రీలంక పర్యటనలో తప్పిదాలు జరిగాయంటూ ఆయన బయట పెట్టారు. ఓ భారత క్రికెటర్ కొలంబోలోని ఓ హోటల్లో యువతితో రాత్రంతా గడిపిందన్నారు.

2010లో శ్రీలంక పర్యటన జరిగినప్పుడు ఎల్‌టిటిఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిందని, క్రికెటర్లు బస చేసిన హోటల్లోని ప్రతి ఫ్లోర్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సమయంలో ఓ యువతి ఓ భారత క్రికెటర్ ఆటగాడి గదికి వెళ్లిందన్నారు.

ఆ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆరు సీజన్‌లలో ఆడుతున్నాడని చెప్పారు. ఆ రాత్రి ఆమె హోటల్ గదిలోనే ఉందన్నారు. ఆ యువతికి బుకీలతో సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై శ్రీలంక ఆర్మీ జనరల్ శ్రీలంక క్రికెట్ బోర్డుకు నివేదిక ఇచ్చారన్నారు.

శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ నివేదికను ఐసిసికి పంపించిందని అయితే, ఆ తర్వాత బిసిసిఐ ఒత్తిడి కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గిందని చెప్పారు. బోర్డులో సభ్యుడు ఈ నివేదికను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన భారత ఆటగాడు అని చెప్పిన బింద్రా ఆ ఆటగాడి పేరు మాత్రం బయటపెట్టలేదు.

English summary
Even as the spot-fixing scandal rages on, PCA President Bindra has created a fresh controversy by claiming that a BCCI official had arm-twisted the Sri Lankan board to withdraw a report which violated the anti-corruption regulations during India's tour of Sri Lanka in 2010.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X