వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల దాడి: ఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలోని పాకూరు జిల్లాలో మావోయిస్టులు పోలీసు కాన్వాయ్‌పై దాడి చేశారు. మంగళవారంనాడు జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. కథికుండ్ ప్రాంతం మీదుగా వెళ్తుండగా దుమ్కా వద్ద పోలీసు కాన్వాయ్‌పై మావోయిస్టులు దాడి చేశారు.

పోలీసు కాన్వాయ్‌లో పాకూరు ఎస్పీ అమర్‌జిత్ బలిహారు కూడా ఉన్నారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మరణించినవారిలో ఆయన కూడా ఉన్నారు. తన నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికే మావోయిస్టులు ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారని జార్ఖండ్ పోలీసు సంఘం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించింది.

ఈ సభలో పాల్గొని ఎస్పీ తిరిగి వస్తుండగా మోటార్‌కేడ్‌పై మావోయిస్టులు దాడి చేశారు. సంఘటన జరిగిన ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలు తరలివెళ్లాయి. దాడి అనంతరం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉన్న పాకూరు జిల్లాలో నక్సల్స్ ప్రభావం లేదని ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. అయితే, దుమ్కాలో మాత్రం మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. పాకూరు, దుమ్కా సరిహద్దుల్లో ఈ దాడి జరిగింది. రాష్ట్ర పోలీసు క్యాడర్ నుంచి ఇటీవలే బలిహార్‌కు ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది.

English summary
Maoists attacked a police convoy in Jharkhand's Pakur district, on Tuesday, killing eight police men, reports said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X