హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గజల్ శ్రీనివాస్‌పై కేసుకు ఆర్డర్: వైయస్ విగ్రహానికి నిప్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghazal Srinivas
హైదరాబాద్/వరంగల్: ఎపిఎన్జీవోల సభలో జాతీయ గీతాన్ని అవమానపర్చే రీతిలో ఆలపించిన గజల్ శ్రీనివాస్ పైన కేసు నమోదు చేయాలంటూ వరంగల్ అదనపు మునిసిఫ్ మెజిస్ట్రేట్ పి.శ్రీదేవి పోలీసులను ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఎపిఎన్జీవోల సభలో గజల్ శ్రీనివాస్ పాల్గొనడం కూడా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

వైయస్ విగ్రహానికి నిప్పు

మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలం మిఠాయిపల్లిలో మంగళవారం తెల్లవారుజామున దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి దగ్గరున్న విగ్రహంపై టైర్లు వేసి నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

హైదరాబాదులో 48 గంటల దీక్ష: శైలజానాథ్

సమైక్యాంధ్ర సాధన కోసం త్వరలో హైదరాబాద్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు 48 గంటల పాటు దీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి శైలజానాథ్ చెప్పారు. అనంతపురంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడంతో వేర్పాటువాదుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. అలాంటి సభను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయనాయకులతో సంబంధం లేకుండా ఉద్యోగులే సొంతంగా అంత పెద్ద సభను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదే తెలంగాణలో అయితే ఏ సభ పెట్టినా అక్కడ అన్ని పార్టీల నేతలను కలుపుకుని పెట్టుకుంటారని, ఇది వేర్పాటువాదులు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.

English summary
Warangal Munisif Megistrate Court on ordered police to file case against Ghazal Srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X