అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి ఎఫెక్ట్!: కోట్లు కూడబెట్టిన సీఆర్డీఏ అధికారి, ఆస్తుల చిట్టా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీఆర్డీఏ టౌన్ ప్లానింగ్ అధికారి రెహ్మాన్ ఆస్తుల పైన ఏసీబీ సోదాలు జరిపింది. కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.4 కోట్ల ఆస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఆర్డీఏలో రెహ్మాన్ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నారు. ఈ ఆరేడు నెలల్లోనే ఆయన రూ.4 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలోని పదకొండు చోట్ల అధికారులు దాడులు చేశారని తెలుస్తోంది. ఆయన ఇంట్లో విదేశీ కరెన్సీ కూడా దొరికినట్టుగా సమాచారం. పలు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

CRDA

ఆయన వద్ద రూ.1.60 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారని తెలుస్తోంది. విశాఖ ఆయన నివాసంలో 4.46 లక్షలు, విదేశీ కరెన్సీ, బంగారంతో పాటు పలు జిల్లాల్లో స్థిరాస్తులు గుర్తించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

ఆయన ఆస్తుల చిట్టా.. విశాఖ దసపల్లా హిల్స్ లే అవుట్లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్. రాజధాని తుళ్లూరు అనంతవరంలో 70 సెంట్ల వ్యవసాయ భూమి. గుంటూరు పొన్నూరు రోడ్డులో అపార్టుమెంట్. గుంటూరు, కర్నూలులో ఇల్లు.య

గుంటూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

గుంటూరు జిల్లా కోర్టుకు మంగళవారం నాడు బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులో బాంబు ఉందంటూ ఓ ఆగంతుకుడు నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి కోర్టు పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

English summary
ACB raids on CRDA town planning officer Rahman's House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X