విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలో కొణతాల చేరికపై ట్విస్ట్: అనకాపల్లి పార్టీ క్యాడర్ గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరే విషయం కొత్త మలుపు తిరిగింది. ఆయన టిడిపిలో చేరడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న స్థితిలో ఆయనకు అనుకోని అవాంతరం వచ్చిపడింది. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు ఆయనను పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తునున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమైన కొణతాల రామకృష్ణ త్వరలో టిడిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి అయ్యన్న పాత్రుడు కొణతాల సంక్రాంతి తర్వాత పార్టీలోకి వస్తారని చెప్పడంతో ఆయన చేరిక ఖరారైంది. అయన్నపాత్రుడితో కలిసి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా కలిశారు.

Anakapalli TDP cadre against Konathala Ramakrishna

కొణతాల పార్టీలో చేరే విషయంపై స్పష్టత రావడంతో పార్టీ ముఖ్య కార్యకర్తలు కార్యాలయంలో సమావేశమయ్యారు. కొణతాల పార్టీలోకి వస్తే మూకుమ్మడిగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చే చంద్రబాబు యాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిసింది. కొణతాలను పార్టీలోకి తీసుకునే విషయంలో అధినేత పునరాలోచించాలని అనకాపల్లి పార్టీ కేడర్ సంకేతాలు పంపించింది.

కాగా, కొణతాల రామకృష్ణను టిడిపిలో చేర్చుకోవాలనే ఆలోచనను మంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో అయ్యన్నపాత్రుడికి, గంటా శ్రీనివాస రావుకు మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలో గంటా శ్రీనివాస రావుకు చెక్ పెట్టడానికే కొణతాల రామకృష్ణను అయ్యన్నపాత్రుడు పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that Anakapalli Telugu Desam cadre is opposing the decision to take ex minister Konathala Ramakrishna into the party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X