హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో'సారీ' షాక్: దినేష్ రెడ్డికి క్యాట్‌లో చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

DGP Dinesh Reddy
హైదరాబాద్: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) దినేష్ రెడ్డికి క్యాట్‌లో మరోసారి నిరాశ ఎదురైంది. తన పదవిని కొనసాగించాలన్న డిజిపి పిటిషన్‌ను క్యాట్ తోసిపుచ్చింది. డిజిపిగా రెండేళ్లు పూర్తయినందున అయన పదవీకాలాన్ని పొడిగించలేమని అంతేకాకుండా ఆయన ఆస్తుల పైన సిబిఐ దర్యాఫ్తు జరుగుతోందని ప్రభుత్వం క్యాట్ ముందు వాదించింది.

సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి తన పదవిని పొడగించాలని దినేష్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన క్యాట్ దినేష్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది.

కాగా, డిజిపిగా దినేష్ రెడ్డిని మరికొంతకాలం పొడిగించలేమని గురువారం క్యాట్‌కు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని దినేష్ రెడ్డి నిన్న మరోసారి సవాల్ చేశారు. దీనిని మళ్లీ విచారించిన క్యాట్ ఆయన పిటిషన్ తోసిపుచ్చింది.

దినేష్ రెడ్డి పదవి కాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తోంది. తదుపరి అవకాశం ప్రసాద రావుకు వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఎపిఎన్జీవోలపై వాదనలు పూర్తి

ఎపిఎన్జీవోల సమ్మెపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో శక్రవారం వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

English summary
The State government on Friday rejected the application of Dinesh Reddy to continue as the DGP beyond September 30 when he will attain the date of superannuation in view of the ongoing inquiry against him by the CBI into allegations that he acquired assets disproportionate to his known sources of income.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X