మురళీమోహన్, కుటుంబానికి హైకోర్టులో ఊరట-సీఐడీ చర్యలకు బ్రేక్
అమరావతిలో జయభేరి ప్రాపర్టీస్ నిర్మాణంలో స్ధల యజమానితో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘించారంటూ దాఖలైన ఫిర్యాదుపై గ్రూప్ ఛైర్మన్ మురళీమోహన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇవాళ సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది.
జయభేరి ప్రాపర్టీస్ నిర్మాణం కోసం తీసుకున్న స్ధలానికి సంబంధించి ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని స్ధల యజమాని సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ భూ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ.. 41ఏ సెక్షన్ కింద మురళీ మోహన్ తో పాటు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా... హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Recommended Video
మురళీ మోహన్ జయభేరి ప్రాపర్టీస్ కోసం తీసుకున్న స్ధల ఒప్పందాన్ని ఉల్లంఘించారని దాఖలైన ఫిర్యాదుపై సీఐడీ దాఖలు చేసిన కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.... తదుపరి చర్యలు తీసుకోకుండా సీఐడీని నిలువరిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
మురళీ మోహన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మురళీ మోహన్ తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సీఐఢీ ఈ సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చిందని శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. జయభేరీ ప్రాపర్టీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని కోర్ట్ కు తెలియజేశారు. దీంతో కేసులో అన్ని రకాల చర్యలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications