వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌లో కోస్తా రక్తం, సమైక్యవాదిగా: టిజి వెంకటేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
తిరుపతి/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్‌లో కోస్తా రక్తమే ప్రవహిస్తోందని ఆయన అన్నారు. తిరుపతిలో ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. విభజన క్రెడిట్ దక్కకపోతే కెసిఆర్ సమైక్యవాదిగా మారుతారని ఆయన వ్యాఖ్యానించారు.

రాజ్యాధికారం కోసమే కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని ఆయన విమర్శించారు. తాను సమైక్యవపాదినే అని ఆయన మరోసారి చెప్పారు. రాయల తెలంగాణ వల్ల రాయలసీమ ఇబ్బందులు కొద్గిగానే తగ్గుతాయని ఆయన అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని ఆయన అన్నారు.

కర్నూలును రాజధానిగా చేస్తే రాయల తెలంగాణ ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే అన్నీ ఇబ్బందులే ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందితే కోర్టులు కూడా ఆపలేవని ఆయన స్పష్టం చేశారు. రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమని ఆయన చెప్పారు. విభజన జరిగితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఏం చేస్తారో చెప్పాలని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన ఆగాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ జగన్, చంద్రబాబు కలిసి పోరాడాలని అన్నారు. రాయల తెలంగాణ అనేది జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయం మాత్రమేనని, అందరి అభిప్రాయం కాదని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు వస్తే తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.

పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పడుతుందని తాను నమ్ముతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. శానససభ సమావేశాలను డిసెంబర్ 9వ తేదీన నుంచి నిర్వహించాలని వ్యక్తిగతంగా తాను అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచారని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌ మాదిరిగా తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పదవి కోసం ఆరాటపడడం లేదని ఆయన అన్నారు.

English summary
minister TG Venkatesh said that coastal blood is floating in Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR) body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X