ప్రత్యక్ష రాజకీయాల్లోకి వేణుమాధవ్!? అందుకే చంద్రబాబును కలిశారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హాస్యనటుడు వేణుమాధవ్‌ ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య నంద్యాల ఉపఎన్నికల టీడీపీ తరుపున వేణుమాధవ్ ప్రచారంలో కనిపించారు. మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు.

  AP Assembly Sessions Started Without Opposition YSRCP | Oneindia Telugu

  గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశం అయిన సంగతి తెలిసిందే. 'ఏంటో విశేషం అంటే'.. 'ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..' అని వేణుమాధవ్ మీడియా ప్రతినిధులకు బిస్కెట్ వేశారు.

  Comedian Venumadhav into Politics? Behind his meet with AP CM Chandrababu...

  అయితే ఆయన చంద్రబాబును కలవడం వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. వేణుమాధవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహంతో ఉన్నారని తెలుస్తోంది.

  టీడీపీ అంటే బాగా ఇష్టపడే వేణుమాధవ్.. ఆ పార్టీ ద్వారానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ తరఫున పెద్దగా హడావుడి చేసే వాళ్లు లేకుండా పోయారు.

  దీంతో ఆయన టీటీడీపీలో చేరబోతున్నారని, ఆ తరువాత తెలంగాణ నుంచే వేణుమాధవ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది పార్టీని వీడటంతో తెలంగాణ టీడీపీలో కొంత ఖాళీ కూడా ఏర్పడింది.

  ఈ నేపథ్యంలో వేణుమాధవ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడని.. టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

  హైదరాబాద్ పరిధిలో లేదా.. తన సొంత జిల్లా అయిన నల్లగొండలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నాడని సమాచారం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

  ఇది వరకూ బాబూమోహన్ వంటి కొంతమంది కమేడియన్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు.. మరి హాస్యనటుడు వేణుమాధవ్ కథ ఎంత వరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే!

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tollywood Comedian Venu Madhav thinking that to enter politics it seems. On thursday evening he met AP CM Chandrababu Naidu at Velagapudi also. After the meeting when media asked him on this incident Venu Madhav told he just came to see CM Chandrababu. But analysers telling that behind this meeting there is another reason, may be Venu Madhav thinking to enter politics.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి