వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌నే అంటావా, పవన్ కళ్యాణ్ లేకుంటే: లోకేష్‌పై వైసిపి సంచలనం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ లేకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోయి ఉండేవారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ లేకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోయి ఉండేవారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు.

<strong>దెబ్బతీయాలనుకుంటే, జగన్‌కు బుద్ధి చెప్పారు, మనోళ్లని చంపారు: బాబు</strong>దెబ్బతీయాలనుకుంటే, జగన్‌కు బుద్ధి చెప్పారు, మనోళ్లని చంపారు: బాబు

ఏపీ మంత్రి, టిడిపి యువనేత లోకేష్‌కు తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌కు సవాల్ విసిరే సత్తా లేదని విమర్శించారు.లోకేష్.. ఓ పెద్ద సూట్ కేస్ అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో టిడిపి కేవలం 1 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిందన్నారు.

జగన్, షర్మిలపై పోస్టులు పెట్టారుగా

జగన్, షర్మిలపై పోస్టులు పెట్టారుగా

సోషల్ మీడియాలో టిడిపి నేతలపై పోస్టులు పెడుతున్నారని అరెస్టు చేయడం సరికాదని భూమన అన్నారు. జగన్‌తో పాటు ఆయన సోదరి షర్మిలలను కించపరిచేలా పోస్టులు పెట్టినప్పుడు ఏం చేశారని నిలదీశారు.

జగన్‌నే అంటావా.. క్షమాపణ చెప్పు

జగన్‌నే అంటావా.. క్షమాపణ చెప్పు

మహానాడు వేదికగా లోకేష్... జగన్‌పై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మరో వైసిపి నేత పార్థసారథి డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో ఎటువంటి అవినీతి జరగలేదని నమ్మకముంటే వైసిపి ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కులపిచ్చి, మతపిచ్చి పార్టీ అని సంచలన వ్యాఖ్యలు

కులపిచ్చి, మతపిచ్చి పార్టీ అని సంచలన వ్యాఖ్యలు

లోకేష్ ప్రసంగం వింటే మహాభారతంలోని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు గుర్తుకు వస్తున్నాయని పార్థసారథి ఎద్దేవా చేశారు. కులపిచ్చి, మతపిచ్చి, అవినీతి పార్టీ ఏదైనా ఉందా అంటే అది టిడిపియే అన్నారు. కడప సమావేశంలో మీ మనసులో మాటను బయటపెట్టారని చెప్పారు.

జగన్‌ను అంటే గొప్పవాడివైనట్లా

జగన్‌ను అంటే గొప్పవాడివైనట్లా

వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్‌లను విమర్శిస్తే గొప్పవాడయిపోయినట్లు లోకేష్ అనుకుంటున్నారని పార్థసారథి నిప్పులు చెరిగారు. అభివృద్ధికి జగన్ అడ్డుపడ్డారనడాన్ని నిరూపించాలని లేదంటే జగన్‌కు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

మొదట చెప్పిందే వైయస్

మొదట చెప్పిందే వైయస్

చంద్రబాబు కులపిచ్చితో రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని పార్థసారథి మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లివ్వాలని మొదట ఆలోచించిన వ్యక్తి దివంగత వైయస్సార్ అన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా రైతులకు అన్యాయం జరగకుండా సీమకు నీళ్లివ్వాలని తపించిన వ్యక్తి వైయస్ అన్నారు.

వేదికపై నందమూరి ఫ్యామిలీ లేకుండా..

వేదికపై నందమూరి ఫ్యామిలీ లేకుండా..

చంద్రబాబు, లోకేష్‌లకు దమ్ము ఉంటే అమరావతి, పోలవరంలపై చర్చకు రావాలని పార్థసారథి సవాల్ విసిరారు. మహానాడు పేరుతో ఎన్టీఆర్ అరిశెలు, చంద్రబాబు పూర్ణాలు, లోకేష్ పప్పు, మామిడికాయ అంటూ 42 రకాల పదార్థాలతో పండుగ చేసుకున్నారన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోట పొడిచి, ఆయన కుటుంబానికి చెందిన ఒక్కరూ వేదికపై లేకుండా చేసి మరీ సభ నిర్వహించారన్నారు.

English summary
YSR Congress Party leader Bhumana Karunakar Reddy and Parthasarathi lashed out at Minister Nara Lokesh for blaming YS Jagan in Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X