Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ మంత్రుల వ్యాఖ్యలకు దిమ్మతిరిగేలా జనసేన వార్నింగ్ .. పవన్ కళ్యాణ్ పై కారుకూతలు కూస్తే ఖబడ్దార్ !!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాల విషయంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో చిలికిచిలికి గాలివానగా మారింది. ఇక మంత్రులు పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్టు దుర్భాషలాడిన నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు వైసిపి మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత మంది సన్నాసులు ఉన్నారా మాకు ఇప్పుడే తెలిసింది అంటూ మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తున్నారు.

 అనంతపురంలో పేర్ని నాని దిష్టిబొమ్మ దహనం చేసిన జనసేన నేతలు

అనంతపురంలో పేర్ని నాని దిష్టిబొమ్మ దహనం చేసిన జనసేన నేతలు

కక్ష, ఈర్ష, రాజకీయ దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ జగన్ పై విష ప్రచారం చేస్తున్నారని, అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జనసేన మహిళా కార్యకర్తలు మంత్రి పేర్ని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయన చిత్రపటానికి చెప్పులతో కొట్టారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదన్నారు. అరేయ్ ఒరేయ్ అని నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి బుద్ధి లేదా అని ప్రశ్నించారు.

నానీని అలా నలిపేస్తాం .. కారుకూతలు కూస్తే జాగ్రత్త

నానీని అలా నలిపేస్తాం .. కారుకూతలు కూస్తే జాగ్రత్త

జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ పై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదవి కోసం మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్మోహన్ రెడ్డి కాళ్లు పట్టుకున్నారని, మీడియా ముఖ్యమంత్రి కథ అందరికీ తెలుసనీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక క్రికెట్ బెట్టింగులు ఆడించే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. మంత్రి పేర్ని నానిని తలలో పేను నలిపినట్టు నలిపేస్తాం అని హెచ్చరించారు. కారు కూతలు కూసే వైసీపీ మంత్రులకు పుట్టగతులుండవని, బడిత పూజ పక్కా అని , ఖబడ్దార్ అని జనసేన పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అసలు సినిమాను రాజకీయం చేసింది మీరా పవన్ కళ్యాణ్ నా

అసలు సినిమాను రాజకీయం చేసింది మీరా పవన్ కళ్యాణ్ నా

అసలు సినిమాను రాజకీయం చేసింది ఎవరు ? రాజకీయాల్లోకి లాగింది ఎవరూ అంటూ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. చేసిందంతా మీరు చేసి పవన్ కళ్యాణ్ పై తిరిగి ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనేది మర్చిపోయారని, వైసిపి నాయకుల తీరులో రెండున్నరేళ్లయినా ఎలాంటి మార్పు రాలేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను మంత్రి వెల్లంపల్లి సన్నాసి అని మాట్లాడారని పేర్కొన్న జనసేన పార్టీ నాయకులు రాష్ట్రంలో ఇంత మంది సన్యాసులు ఉన్నారని మాకు ఇప్పుడే తెలుస్తోంది అంటూ ఎదురు దాడికి దిగారు. వైసీపీ మంత్రులంతా సన్నాసులే అని మండిపడ్డారు.

వెల్లంపల్లి మారకపోతే దుర్గమ్మ గుడి చుట్టూ తిప్పి కొట్టే రోజు వస్తుంది

వెల్లంపల్లి మారకపోతే దుర్గమ్మ గుడి చుట్టూ తిప్పి కొట్టే రోజు వస్తుంది

ఏదైనా ఒక అంశంపై మాట్లాడితే ఆ అంశానికి సంబంధించిన మంత్రి మాట్లాడితే బాగుంటుందని, కానీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కుటుంబం అన్న విషయం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ని ఏ ఒక్కరిని, ఏ మంత్రిని వ్యక్తిగతంగా దూషించలేదు అని స్పష్టం చేశారు. మంత్రి వెల్లంపల్లి దుర్గమ్మ గుడి రథం పై ఉన్న సింహం బొమ్మను కొట్టేసిన సన్నాసి అంటూ మండిపడ్డారు. వెల్లంపల్లి మారకపోతే దుర్గమ్మ గుడి చుట్టూ తిప్పి కొట్టే రోజు వస్తుందని జనసేన నేతలు హెచ్చరించారు.

మంత్రి అవంతి బంట్రోతుకు ఎక్కువ మంత్రికి తక్కువ .. నువ్ క్షమాపణ చెప్పు

మంత్రి అవంతి బంట్రోతుకు ఎక్కువ మంత్రికి తక్కువ .. నువ్ క్షమాపణ చెప్పు

ఇక మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ కు కౌంటర్ వేస్తున్నారు జనసేన పార్టీ నేతలు. అవంతి శ్రీనివాస్ బంట్రోతుకు ఎక్కువ మినిస్టర్ కు తక్కువ అనే విధంగా మారిపోయాడని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందు భీమిలి ప్రజలకు అవంతి శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన సమస్యలపై స్పందించడం మానేసి నేను సన్యాసి అంటే నేను సన్యాసిని అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు పోటీ పడుతున్నారని, వైసిపి మంత్రుల తీరు హాస్యాస్పదంగా ఉందని జనసేన పార్టీ నాయకులు సెటైర్ వేస్తున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి అని వార్నింగ్ ఇస్తున్నారు

మంత్రి పేర్ని నానీ అనుచిత వ్యాఖ్యలు .. భగ్గుమన్న జనసేన నాయకులు

మంత్రి పేర్ని నానీ అనుచిత వ్యాఖ్యలు .. భగ్గుమన్న జనసేన నాయకులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని తీవ్రపదజాలంతో మండిపడ్డారు. ఆన్లైన్ టికెట్ విధానం అమల్లోకి వస్తే బ్లాక్ లో అధిక రేట్లకు టికెట్లు అమ్ముకునే అవకాశం ఉండదని ఆక్రోశంతో నే దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా నిలుచుని ఒక చోట కూడా గెలవలేని సన్నాసిన్నర సన్నాసి అతనేనని ఈ వెధవన్నర వెధవ కు తిక్క కాదు ఒళ్ళంతా ఉంది లెక్క పిచ్చే అంటూ నిప్పులు చెరిగారు. కుల ప్రస్తావన తెచ్చి మరి అరేయ్ ఒరేయ్ అంటూ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా జనసేన పార్టీ నేతలు వైసిపి మంత్రుల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+