ఎన్ని బ్రోకర్ పనులు చేసి ఆ స్థాయికి ఎదిగారో ప్రజలకు తెలుసు.!సజ్జలపై జనసైనికులు ఫైర్.!
అమరావతి/హైదరాబాద్ : అమరావతిలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. అధికార వైసీపి, జనసేన పార్టీ నేతల మద్య మాటాల తూటాలు పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పొత్తుల సాద్యాసాద్యాలపై జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపైన అమరావతిలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇరు పార్టీ నాయకులు ఆరోపణలు,ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని రగుల్చుతున్నారు. పవన్ కళ్యాణ్ పైన రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసైనికులు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు.

సాధారణ జర్నలిస్టు నుంచి వేల కోట్లు ఎలా సంపాదించారు? సజ్జల రామకృష్ణకు సనసేన సూటి ప్రశ్నలు
సాధారణ జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వేల కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించారో, ఎన్ని బ్రోకర్ పనులు చేశారో ప్రజలందరికీ తెలుసని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కి జర్నలిస్టులు అంటే ఎంతో గౌరవం అని, అదే గౌరవాన్ని సజ్జలకి ఇచ్చేవారన్నారు.సజ్జల అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ తన గౌరవాన్ని తానే పోగొట్టుకొంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం బ్రోకరిజం చేస్తున్న వ్యక్తిని ఏమని పిలవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎలా ఎదిగారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు జనసైనికులు.

సన్నిహిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి కోసం సజ్జల బ్రోకరిజం.. మండి పడ్డ జనసేన నేతలు
అవినీతి పెట్టుబడులతో పుట్టిన ప్రసార మాద్యమాలను అడ్డుపెట్టుకొని సజ్జల చేసిన బ్రోకర్ పనులేమిటో తెలియని నాయకులు ఉండరని జనసేన నేతలు ధ్వజమెత్తారు. మైనింగ్ వ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారని, సజ్జల ప్రధాన సలహాదారు కాదని ప్రధాన బ్రోకర్ అని అభివర్ణించారు. జగన్ కోసం సజ్జల చేస్తున్న బ్రోకర్ పనులు ఏమిటో వైసీపీలో ఏ మంత్రిని అడిగినా, ఏ వైసీపీ ఎమ్మెల్యేను అడిగినా చెబుతారన్నారు. తను చేసే బ్రోకర్ పనులకు ఎవరూ అడ్డు రాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం సిఎం ఆఫీసుకీ, ఇంటికీ దూరం పెట్టింది సజ్జల కాదా?అని జనసేన నాయకులు నిలదీసారు.

పొత్తుల విషయంలో వైసీపీ మైండ్ గేమ్.. బీజేపి కి సమాధానం చెప్పే ధైర్యం వైసిపికి లేదన్న జనసైనికులు
పొత్తుల విషయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని బీజేపీ నాయకులే స్సష్టం చేస్తున్నారన్నారు జనసేన ముఖ్య నేతలు. బీజేపి ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ములేక, చేతగాక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మీద, జనసేన పార్టీ మీద బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వస్త్ర వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి సజ్జల, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న తెర వెనక వ్యవహారాలను త్వరలోనే బయటపెడతామన్నారు జనసేని నాయకులు. మరోసారి సజ్జల జనపేన అధ్యక్షులు మీద గానీ, పార్టీ మీద ఇలాగే మాట్లాడితే మరిన్ని అంతర్గత విషయాలు బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.

రోజాను తరిమి కొట్టే రోజులు వస్తాయి.. జనసేన వీర మహిళ పొన్నూరి శిరీష హెచ్చరిక
తెలంగాణ వీర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి పొన్నూరి శిరీష మంత్రి రోజా వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి రోజా విషయాలు ఏమిటో అందరికీ తెలుసని, నిస్వార్థపరులైన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత రోజాకు ఏ మాత్రం లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్న వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే సమస్యే లేదన్నారు. రోజాను నగరి ప్రజలు తరిమితరిమి కొట్టే రోజులు రాబోతున్నాయని, అప్పుడు మళ్ళీ జబర్దస్ట్ షోల్లో కూర్చోక తప్పదన్నారు పొన్నూరి శిరీష. పవన్ కల్యాణ్ గారి గురించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే వీర మహిళలు తరిమి కొడతారని శిరీష వార్నింగ్ ఇచ్చారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications