వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

PM-CM : అక్కడ ప్రధాని మోదీ - ఇక్కడ సీఎం జగన్ : అందుకే అంత క్రేజ్..!!

|
Google Oneindia TeluguNews

PM Modi - CM Jagan: ప్రధాని మోదీ..సీఎం జగన్ సాధారణ ప్రజల మనసు గెలుచుకున్నారు. ఇద్దరి తాజా నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు ఇద్దరినీ ప్రశంసిస్తున్నారు. ప్రధాని హోదాలో ఉండి గొప్ప మనసు చాటుకున్నారంటూ ప్రధాని పైన సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ మనసు గురించి సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. ఆరోగ్య పరంగా పలువురి చిన్నారులకు సీఎం జగన్ వెంటనే ఆర్దిక సాయం అందించిన విధానం పలువురిని ఆకట్టుకుంది. అక్కడ ప్రధాని - ఇక్కడ సీఎం జగన్ కు ఇంత క్రేజ్ పెంచింది.

ప్రధాని మోదీ అరుదైన ఫీట్

ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ప్రధాని మోడీ రోడ్‌షో జరిగింది. కాన్వాయ్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ.. ముందుకు సాగారు. తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ వేదికగా ఈ అరుదైన ఫీట్ చేసారు. ఇక, ప్రధాని రోడ్ షో కొనసాగుతున్న సమయంలోనే ఆ మార్గంలోనే ఒక అంబులెన్స్ అక్కడ నుంచి వెళ్తోంది. దీనిని గమనించిన ప్రధాని వెంటనే స్పందించారు.

వైరల్ అవుతున్న ప్రధాని నిర్ణయం

తన వాహనాన్ని పక్కకు తీయాలని సిబ్బందికి సూచించారు. రోడ్డు పక్కగా ప్రదాని కాన్వాయ్ నిలిపివేఆరు. ఆ అంబులెన్స్ ప్రధాని కాన్వాయ్ పక్కకు తీయటంతో ఎక్కడా ఆగకుండా వెంటనే వెళ్లిపోయింది. దీనిని ప్రత్యక్షంగా చూసిన వారు ప్రధానిని అభినందించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ పలు మార్లు అంబులెన్స్ కు మార్గం ఇచ్చేందుకు తన కాన్వాయ్ ను పక్కకు తప్పించిన ఘటనలను వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ విద్యాదీవెన పథకం కార్యక్రమానికి మదనపల్లెలో హెలిపాడ్‌ నుంచి సభావేదిక వద్దకు వెళ్తుండగా108 అంబులెన్స్‌ వెళ్తోంది.

సీఎం జగన్ తాజా నిర్ణయాలతో

దానిని చూసిన సీఎం జగన్ వెంటనే తన కాన్వాయ్ పక్కకు తీసి అంబులెన్స్ కు దారి ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో, సీఎం ప్రయాణిస్తున్న బస్సును పక్కకు తీసి అంబులెన్సకు దారి ఇచ్చారు. ఆ వీడియో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది. అదే విధంగా అరుదైన వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి ఆరోగ్య విషయం పైన ఆ పాప తల్లితండ్రులు సీఎంకు నివేదించారు. వెంటనే పాప వైద్య ఖర్చులతో పాటుగా ప్రతీ నెలా సాయం అందేలా జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. ఇప్పుడు వైసీపీ అభిమానులు తాజాగా చోటు చేసుకున్న ఈ రెండు పరిణామాలను పెద్ద ఎత్తన షేర్ చేస్తున్నారు.

English summary
PM Modi stops his convoy to make way for Ambulance during his mege Road show in Ahmedabad became viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X