అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జమ్మలమడుగులో భగ్గుమంటున్న రాజకీయం

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగులో రాజకీయం భగ్గుమంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఫ్యాక్షన్ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఏ వ్యాఖ్యలు ఎటువంటి గొడవలకు దారితీస్తాయోననే టెన్షన్ లో ఇక్కడి పోలీసులున్నారు. తాజాగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై టీడీపీ ఇన్ ఛార్జి దేవగుడి భూపేష్ రెడ్డి మాటలతో దాడిచేశారు.

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..

సుధీర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకుందామంటూ సవాల్ విసిరారు. జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రిలో రెండు సంవత్సరాలుగా గైనకాలజిస్టు పోస్టును భర్తీ చేయించుకోలేని దుర్గతిలో సుధీర్ రెడ్డి ఉన్నారని, తనపై, దేవగుడి కుటుంబంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే అంతకుమించి మేం మాట్లాడాల్సి వస్తుందన్నారు.

చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలి

చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలి

వైసీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని సుడిగాలి సుధీర్‌ అంటున్నారని, ఎమ్మెల్యే చిల్లర మాటలు మానుకొని, భాష మార్చుకోవాలని హితవు పలికారు. మున్సిపాలిటీలోని 7వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ఇబ్బంది పడుతున్నారని, ఆర్థికంగా ఆదుకోవాలని సోషల్‌ మీడియాలో మొరపెట్టుకున్నా.. కనీసం కార్యకర్త, కౌన్సిలర్‌ కుటుంబాన్ని ఆదుకోలేని ఎమ్మెల్యేకి దేవగుడి కుటుంబంపై విమర్శించే హక్కు లేదన్నారు.

రాయలసీమలో వైసీపీని నిరోధించాలని..

రాయలసీమలో వైసీపీని నిరోధించాలని..


ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు తన పర్యటన పూర్తిచేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ప్రొద్దుటూరులో పర్యటించారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 6 నియోజకవర్గాలను సాధించాలనేది చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగా బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలకు, రోడ్ షోలకు ప్రజలు విరివిగా వస్తుండటంతో రాయలసీమలో వైసీపీని నిరోధించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు.

English summary
In the joint Kadapa district of Jammalamadugu, politics is in turmoil.A war of words is going on between the ranks of the YSR Congress Party and the Telugu Desam Party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X