చంద్రబాబు ఇంటి వద్ద కొండచిలువ కలకలం, రాళ్లతో కొట్టేందుకు చూడగా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో శనివారం నాడు కొండ చిలువ కలకలం సృష్టించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో శనివారం నాడు కొండ చిలువ కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి నివాసం వద్ద బీబీ 1 ఎదురుగా ఉన్న పోలీసు అవుట్ పోస్టు పక్కనే ఒక కొండ చిలువ సాయంత్రం కనిపించింది.

భద్రతా సిబ్బంది అప్రమత్తమై రాళ్లతో కొట్టేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న మునగ తోటలోకి వెళ్లిపోయింది. అయిదు నిమిషాల తర్వాత అది మళ్లీ కనిపించింది. దీంతో భద్రతా సిబ్బంది దానిని తోటల వైపు వెళ్లగొట్టారు.












Click it and Unblock the Notifications