Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ రైలు ప్రారంభం-టైమింగ్స్, హాల్ట్ లివే..!
ఉత్తరాంధ్ర వాసులకు మరో శుభవార్త. శ్రీకాకుళం (Srikakulam) నుంచి తిరుపతి (tirupti)కి నేరుగా వెళ్లాలంటే విశాఖకు వెళ్లి, అక్కడి నుంచి మరో రైలు ఎక్కి వెళ్లాల్సిన పరిస్ధితుల్లో రైల్వేశాఖ ఇవాళ్టి నుంచి డైరెక్ట్ రైలు హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ (humsafar express) ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి మధ్య వారానికోసారి రాకపోకలు సాగించేలా రూపొందించిన ఈ రైలును ఇవాళ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు.
శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి మధ్య ప్రయాణించే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17440ను ఇవాళ ప్రారంభించారు. శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో ఇవాళ్టి నుంచి ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. అనంతరం చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ఇది తిరుపతికి మంగళవారం ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది.

ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం… pic.twitter.com/tQwz3tajy3
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) April 13, 2026
మరోైవైపు తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు వెళ్లే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17439 ఈనెల 19న ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రతీ ఆదివారం సాయంత్రం 4.55కు తిరుపతిలో బయలుదేరుతుంది. అక్కడి నుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్ల కోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి మీదుగా శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు సోమవారం మధ్యాహ్నం 12.30కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్ లు మాత్రమే ఉంటాయి.
-
తిరుమల ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే బిగ్ అప్డేట్, కొత్తగా అందుబాటులలోకి..!! -
అలిపిరితో పాటు తిరుమలలో -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!














Click it and Unblock the Notifications