హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాల్‌గర్ల్ అంటూ నెట్లో ఫోటో, సెల్ నెంబర్: టెక్కీ భర్తపై భార్య పోరాటం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ భర్త తన భార్య ఫోన్ నెంబర్, ఫోటోను అశ్లీల వెబ్ సైట్లో పెట్టి, కాల్ గర్ల్‌లా చిత్రీకరించిన సంఘటన హైదరాబాదులో బుధవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. అవసరమైతే తన భర్త పైన తాను న్యాయపోరాటానికి సైతం సిద్ధమని ఆమె చెబుతున్నారు.

మురళీకృష్ణకు, బాధితురాలికి 2010లో పెళ్లైంది. అయితే, ఆమె స్వయానా అతనికి మరదలు అని తెలుస్తోంది. వారు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చింది. పెళ్లి తర్వాత మరో పిల్లాడు పుట్టాడు. అనంతరం ఇటీవల భార్యను కాల్ గర్ల్‌లా చిత్రీకరిస్తూ అశ్లీల వెబ్ సైట్లో ఫోటో, ఫోన్ నెంబర్ పెట్టాడని ఆరోపిస్తున్నారు.

Techie booked for cyber harassment

దీనిపై బాధితురాలు మాట్లాడుతూ.. తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. వ్యక్తిత్వం ఉన్న వారు ఎవరు కూడా అలా చేయరన్నారు. ప్రతి దానికి తనను వేధించేవాడన్నారు. శాడిజంతో తనను కాల్ గర్ల్‌లా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. తనకు ఎన్నో ఫోన్లు వచ్చాకనే తెలిసిందన్నారు. ఫోటో పెట్టినప్పటి నుండి తాను అతనితో మాట్లాడలేదని చెప్పారు.

ఇంటర్నెట్లో భార్య ఫోటో, ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె భర్త పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు బెంగళూరులోని ఓ బహుళజాతి సంస్థలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.

పెళ్లైన ఏడాదిన్నర నుండే భర్త వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె చెబుతున్నారు. సదరు మహిళకు అసభ్యకరంగా మాట్లాడుతూ వందల సంఖ్యలో ఫోన్లు వచ్చాయి. ఆ మహిళ సోదరుడు ఒకరిద్దరితో మాట్లాడగా పరుషంగా మాట్లాడారు. ఇంటర్నెట్లో వాంట్ యు కాల్ గర్ల్ అన్న శీర్షికన ఫోటో, నెంబర్ ఇచ్చారని వారు చెప్పడంతో విషయం తెలిసింది.

English summary
An IT professional allegedly posted his wife’s phone number in social networking sites and other websites describing her as a call girl. The victim lodged a complaint with the cyber crime police here alleging that her husband had put her contact number online to malign her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X