విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AP weather update: 14 రోజులపాటు భారీ వర్షాలు, అధికారులు అప్రమత్తం

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల మందగమనంతో జూన్ నెల చివర్లో వర్షాలు కాస్త తగ్గినా.. మళ్లీ ఊపందుకున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఏపీలో 14 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీలో 14 రోజులపాటు భారీ వర్షాలు

అంతేగాక, మరో 14 రోజులపాటు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి జులై 22వ తేదీ వరకు తీర ప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య పశ్చి మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వర్షాలతోపాటు ఈదురుగాలులు

వర్షాలతోపాటు ఈదురుగాలులు

శుక్రవారం ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్టెల్లా చెప్పారు. జులై 10న కోస్తా తీరంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలతో తీర ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరిస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మోహరిస్తున్నారు.

Recommended Video

Why Ashada Masam Considered Inauspicious ? | Oneindia Telugu
దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు

దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు

మరోవైపు, నైరుతి రుతుపవనాలతో ఈశాన్య రాష్ట్రాలు మినహా భారతదేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జులై 8వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా, కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహిలో వర్షపాతం ఉంటుందని వివరించింది. అదే సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని వివరించింది. మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్‌గఢ్, ఒడిశాలో అతి భారీ వర్షాలు ఉంటాయి. 8,9వ తేదీల్లో విదర్భ, చత్తీస్ గఢ్‌లో ప్రభావం ఉంటుంది. 9వ తేదీ నుంచి జమ్ముకశ్మీర్, లడాఖ్‌లో.. 11, 12వ తేదీల్లో పంజాబ్‌లో ప్రభావం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీలో 10వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో 9వ తేదీ నుంచి వర్షాలు ఉంటాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉత్తరప్రదేశ్, బీహర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

English summary
weather update: next 14 days heavy rains in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X